Telangana Formation Day | దేశ ప్రగతిలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలి : గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
Telangana Formation Day | అమరవీరుల త్యాగాలు, దశాబ్దాల ప్రజాస్వామ్య పోరాటాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (Telangana Formation Day) అని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) అన్నారు. దేశ ప్రగతిలో తెలంగాణ మరింత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
Telangana Formation Day | అమరవీరుల త్యాగాలు, దశాబ్దాల ప్రజాస్వామ్య పోరాటాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (Telangana Formation Day) అని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) అన్నారు. నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లోక్‌భవన్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ" స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వ్యవసాయ వారసత్వం రాష్ట్ర జీవనాడి అని తెలిపారు. కాకతీయుల గొలుసుకట్టు చెరువుల నుంచి ఆధునిక ప్రాజెక్టుల వరకు రైతాంగం కృషి ప్రశంసనీయం అని కొనియాడారు. వ్యవసాయంతో పాటు ఐటీ, ఫార్మా, స్టార్టప్ రంగాల్లో తెలంగాణ అంతర్జాతీయ గుర్తింపు పొందిందన్నారు. రాజ్యాంగ విలువలు, ‘సర్వే భవంతు సుఖినః’ స్ఫూర్తితో సుసంపన్న తెలంగాణ నిర్మాణం జరగాలన్నారు. గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం సమపాళ్లలో సాగాలని.. దేశ ప్రగతిలో తెలంగాణ మరింత కీలక పాత్ర పోషించాలని గవర్నర్ ఆకాంక్షించారు.
Also Read..
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ ఇక నిరంతర ప్రక్రియ : సీఎం రేవంత్ రెడ్డి
భారత ఆర్థిక వ్యవస్థకు వరుస షాకులు.. 7వ స్థానానికి పడిపోయిన స్టాక్ మార్కెట్ ర్యాంకు..
సంబంధిత వార్తలు

Telangana Formation Day | కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదు.. ఎన్నారై బీఆర్ఎస్ యూకే కార్యవర్గం
జూన్ 2, 2026

Telangana Formation Day | తెలంగాణ గడ్డ ఎప్పుడూ లొంగిపోదు.. హక్కుల కోసం రాజీపడదు : స్విట్జర్లాండ్ బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ గందె
జూన్ 2, 2026

BRS South Africa | ప్రతి బిడ్డా గర్వంగా చెప్పుకొనే దినం.. జూన్ 2: నాగరాజు గుర్రాల
జూన్ 2, 2026
తాజావార్తలు
- ●POSCO Case Judgment | వయసు 70 ఏండ్లు.. శిక్ష 20 ఏండ్లు.. పోక్సో కేసులో కోర్టు తీర్పు
- ●Telangana Formation Day | కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదు.. ఎన్నారై బీఆర్ఎస్ యూకే కార్యవర్గం
- ●Telangana Formation Day | తెలంగాణ గడ్డ ఎప్పుడూ లొంగిపోదు.. హక్కుల కోసం రాజీపడదు : స్విట్జర్లాండ్ బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ గందె
- ●BRS South Africa | ప్రతి బిడ్డా గర్వంగా చెప్పుకొనే దినం.. జూన్ 2: నాగరాజు గుర్రాల
- ●Indian truck drivers | అమెరికాలో 30 మంది భారతీయ ట్రక్కు డ్రైవర్లు అరెస్టు
- ●Kodandaram | పవన్ కళ్యాణ్ అనవసర వివాదాలకు తెరలేపుతున్నరు: కోదండరాం

POSCO Case Judgment | వయసు 70 ఏండ్లు.. శిక్ష 20 ఏండ్లు.. పోక్సో కేసులో కోర్టు తీర్పు

Telangana Formation Day | కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదు.. ఎన్నారై బీఆర్ఎస్ యూకే కార్యవర్గం

Telangana Formation Day | తెలంగాణ గడ్డ ఎప్పుడూ లొంగిపోదు.. హక్కుల కోసం రాజీపడదు : స్విట్జర్లాండ్ బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ గందె

BRS South Africa | ప్రతి బిడ్డా గర్వంగా చెప్పుకొనే దినం.. జూన్ 2: నాగరాజు గుర్రాల



