Naxalism | నక్సలిజం నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధానం దేశానికే ఆదర్శం : భట్టి విక్రమార్క
Naxalism | నక్సలిజాన్ని (Naxalism) గత ప్రభుత్వం, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కేవలం శాంతి భద్రతల సమస్యగానే పరిగణించాయని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు.
Naxalism | నక్సలిజాన్ని (Naxalism) గత ప్రభుత్వం, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కేవలం శాంతి భద్రతల సమస్యగానే పరిగణించాయని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. పోలీసు, సైనిక బలగాలతో అణచివేసే ప్రయత్నం చేశాయని చెప్పారు. కానీ తమ ప్రభుత్వం అలా చేయలేదని.. సమస్య మూలాలను విశ్లేషించినట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2026-27 ను (Telangana Budget 2026-27) ఆయన ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నక్సలిజం-పునరావాసం గురించి మాట్లాడారు. యువతకు సరైన జీవనోపాధి, సామాజిక గౌరవం, ఆర్థిక భరోసా కల్పిస్తే అడవుల్లోకి వెళ్లిన వారు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోతారనే సామాజిక-ఆర్థిక వాస్తవాన్ని గుర్తించి తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన దార్శనిక విధానం దేశానికే ఒక ఆదర్శ నమూనాగా నిలిచిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-2023 వరకు 347 మంది మావోయిస్టులు మాత్రమే లొంగిపోగా.. తమ ప్రభుత్వం ఏర్పడిన 2023 డిసెంబర్, 7 నుంచి 2026 మార్చి 8 వరకూ 732 మంది వివిధ స్థాయి క్యాడర్ మావోయిస్టులు లొంగిపోయినట్లు భట్టి తెలిపారు. నక్సలిజం పుట్టుకకు కారణమైన ఫ్యూడలిస్టిక్ సామాజిక, ఆర్థిక అసమానతలను రూపుమాపడం ద్వారానే నక్సలిజం ఉద్యమానికి ముగింపు పలకగలమని తెలంగాణ రాష్ట్రం నిరూపించిందన్నారు. "సమగ్ర సంక్షేమం, ఉపాధి ద్వారానే నిజమైన సామాజిక మార్పు సాధ్యం అని మన తెలంగాణ రాష్ట్రం దేశానికి మార్గదర్శనం చేసింది" అని భట్టి తెలిపారు.
Also Read..
మెట్రో స్వాధీనం రవాణా చరిత్రలో సాహసోపేత నిర్ణయం : ఆర్థిక మంత్రి భట్టి
డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. మాదక ద్రవ్యాల వినియోగంపై యువతకు అవగాహన : భట్టి విక్రమార్క
తాజావార్తలు
- ●Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
- ●84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?
- ●Horoscope | సెప్టెంబర్ 23 రాశిఫలాలు.. ఈ రాశివారు కుటుంబ సభ్యుల ద్వారా లాభాలు పొందుతారు!
- ●Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!
- ●Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..
- ●Srimad Bhagavad Gita | మారిషస్‌లో ఆంగ్ల ‘శ్రీమద్భగవద్గీత’ ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ

Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?

Horoscope | సెప్టెంబర్ 23 రాశిఫలాలు.. ఈ రాశివారు కుటుంబ సభ్యుల ద్వారా లాభాలు పొందుతారు!

Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!






