HYD Metro | మెట్రో స్వాధీనం రవాణా చరిత్రలో సాహసోపేత నిర్ణయం : ఆర్థిక మంత్రి భట్టి
HYD Metro | హైదరాబాద్ మహానగరం జీవనాడిగా ఉన్న మెట్రో రైలు ప్రాజెక్టును ఎల్ అండ్ టీ సంస్థ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలనే నిర్ణయం రాష్ట్ర రవాణా చరిత్రలో ఓ సాహసోపేతమైన నిర్ణయమని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
HYD Metro | హైదరాబాద్ మహానగరం జీవనాడిగా ఉన్న మెట్రో రైలు ప్రాజెక్టును ఎల్ అండ్ టీ సంస్థ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలనే నిర్ణయం రాష్ట్ర రవాణా చరిత్రలో ఓ సాహసోపేతమైన నిర్ణయమని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇది ప్రజలకు అనుకూలమైన నిర్ణయమని తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రస్తుతం రోజుకు సుమారు 5 లక్షల ప్రయాణికులకు సేవలందిస్తోందని తెలిపారు. పాతబస్తీకి విస్తరించడంతో పాటు మెట్రో ఫేజ్-11 కింద కొత్త కారిడార్లు నిర్మించి నెట్‌వర్క్‌ను విస్తరించే ప్రణాళికను ప్రభుత్వం రూపొందించిందని తెలిపారు. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో పాతబస్తీ, శంషాబాద్ విమానాశ్రయం, హైటెక్ సిటీ దాటి ఇతర ప్రాంతాలకు మెట్రో విస్తరించనున్నట్లు తెలిపారు.
అంతర్జాతీయ నగరాలకు ధీటుగా హైదరాబాద్
భారత్‌లోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ ఇప్పటికే ఖ్యాతి గడించిందన్నారు. అయినా అంతర్జాతీయ నగరాలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోందన్నారు. ప్రజలు, సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు (NGOs), కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) తదితర భాగస్వాముల సహాయ సహకారాలతో అనేక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో ముందుందని తెలిపారు. ప్రభుత్వం అక్కడితోనే ఆగకుండా తెలంగాణలోని ప్రతి పట్టణం, ప్రతి నగరం హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో పనిచేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో పట్టణీకరణ శాతాన్ని పెంచగలిగామన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమని చెప్పారు.
జీహెచ్ఎంసీ వడ్డీని తగ్గించాం..
హైదరాబాద్ మహానగర ప్రాంతానికి ఔటర్ రింగ్ రోడ్ వరకు తాగునీరు, మురుగునీటి సేవలను, హైదరాబాద్ మహానగర వాటర్ బోర్డు అందిస్తుందని, గోదావరి తాగునీటి ప్రాజెక్ట్, కొత్త రిజర్వాయర్లు, 39 మురుగునీటి శుద్ధి కేంద్రాలను మంజూరు చేశామన్నారు. వాటి నిర్మాణం వివిధ దశల్లో ఉందని తెలిపారు. పాత జీహెచ్ఎంసీకి ఉన్న అధిక వడ్డీ అప్పులపై సంబంధిత బ్యాంకులతో చర్చించి, వడ్డీ రేటును 9.15 శాతం నుంచి 7.95 శాతానికి తగ్గించామన్నారు. దాంతో సంస్థకు గణనీయమైన ఉపశమనం లభించిందన్నారు. హైదరాబాద్ నగర మౌలిక వసతుల అభివృద్ధి కోసం హెచ్-సిటీ (H-CITI) పథకం కింద రూ.2,654 కోట్లు కేటాయించామన్నారు.
హైడ్రాతో ప్రభుత్వ ఆస్తులకు రక్షణ
హైడా (HYDRAA) సంస్థ ప్రజా ఆస్తుల రక్షణ, విపత్తు నిర్వహణ కోసం తీసుకువచ్చామన్నారు. ఇప్పటివరకు వెయ్యి 45 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుండి తిరిగి స్వాధీనం చేసుకుందని, దాని విలువ సుమారు రూ.60వేల కోట్లుగా ఉంటుందన్నారు. ఇటీవల బతుకమ్మ కుంట, నల్ల చెరువు, బమ్-రుక్-ఉద్దీన్-దౌలా చెరువులను పునరుద్ధరించామన్నారు. ఈ చెరువులు భవిష్యత్తులో అభివృద్ధి కేంద్రాలుగా మారి లేక్ ఎకనామిని పెంపొందించడంలో సహాయపడతాయన్నారు. వర్షాకాలంలో వరదలను నివారించేందుకు కాలువలు, నాలాలు శుభ్రపరిచే పనులు చేపట్టామని, చెరువుల సంరక్షణకు సీసీటీవీ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
లే అవుట్ ఫ్లై ఓవర్ల నిర్మాణం..
రవాణా మౌలిక వసతుల అభివృద్ధి కోసం హెచ్ఎండీఏ పలు ప్రాజెక్టులు అమలు చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా ఎలివేటెడ్ కారిడార్లు ప్యారడైస్ నుంచి శామిర్‌పేట వరకు, ప్యారడైస్ నుండి డైరీ ఫారం రోడ్డు వరకు, ఐసీసీసీ నుంచి శిల్పా లే-అవుట్ ప్లై ఓవర్ వరకు నిర్మిస్తున్నామన్నారు. కురిమిడ వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టు, ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్‌తో కలిపే రేడియల్ రోడ్ల నిర్మాణానికి, రహదారి విస్తరణ, స్కైవాక్స్ వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఓఆర్ఆర్‌ని ఆర్ఆర్ఆర్‌తో కలిపే రేడియల్ రోడ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. హైదరాబాద్ పాతనగర ప్రాంతంలో చారిత్రాత్మక కట్టడాల సంరక్షణ, చార్మినార్, లాడ్ బజార్ ప్రాంతాల అభివృద్ధి, పాదచారుల సదుపాయాల మెరుగుదల వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
సెప్టెంబర్ 23, 2026

Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!
సెప్టెంబర్ 22, 2026

Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..
సెప్టెంబర్ 22, 2026
తాజావార్తలు
- ●Saparya | అనాథలు, వృద్ధులకు అండగా సపర్య.. బృహత్తర కార్యక్రమానికి నటుడు కాదాంబరి కిరణ్ శ్రీకారం
- ●Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
- ●84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?
- ●Horoscope | సెప్టెంబర్ 23 రాశిఫలాలు.. ఈ రాశివారు కుటుంబ సభ్యుల ద్వారా లాభాలు పొందుతారు!
- ●Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!
- ●Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..

Saparya | అనాథలు, వృద్ధులకు అండగా సపర్య.. బృహత్తర కార్యక్రమానికి నటుడు కాదాంబరి కిరణ్ శ్రీకారం

Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?

Horoscope | సెప్టెంబర్ 23 రాశిఫలాలు.. ఈ రాశివారు కుటుంబ సభ్యుల ద్వారా లాభాలు పొందుతారు!



