Telangana Budget | డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. మాదక ద్రవ్యాల వినియోగంపై యువతకు అవగాహన : భట్టి విక్రమార్క
Telangana Budget | రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
Telangana Budget | రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సంఘ వ్యతిరేక కార్యక్రమాలను నిలువరించడంలో పోలీసు శాఖ మంచి ఫలితాలను కనబరుస్తోందన్నారు. ముఖ్యంగా డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు, రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల ముప్పు నుంచి రక్షించేందుకు ప్రభుత్వం EAGLE అనే ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఈ దళం మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్న 15 రహస్య ఫ్యాక్టరీలు, ప్రయోగశాలలను గుర్తించి నిర్మూలించినట్లు చెప్పారు. అంతర్రాష్ట్ర డ్రగ్ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు భట్టి చెప్పారు. ముఖ్య మార్గాల్లో జాయింట్ చెక్ పోస్టుల వద్ద సీసీటీవీ పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. డ్రగ్స్ రవాణా, మాదక ద్రవ్యాలపై దర్యాప్తును పెంచేందుకు ప్రత్యేక నార్కోటిక్, ఫోరెన్సిక్ ప్రయోగశాలను కూడా స్థాపించినట్లు మంత్రి వెల్లడించారు. డ్రగ్స్ వినియోగాన్ని తగ్గించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా డీ-అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయడమేకాకుండా.. విద్యా సంస్థల్లో 4,729 యాంటీ డ్రగ్ కమిటీలు, 20,989 ప్రహరీ క్లబ్స్ ఏర్పాటు చేసి యువతలో అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.
Also Read..
Bhatti Vikramarka | ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత ఆరోగ్య భద్రత: భట్టి
మహాలక్ష్మి పథకంతో మహిళలకు రూ.9,222 కోట్లు ఆదా : భట్టి విక్రమార్క
తాజావార్తలు
- ●Saparya | అనాథలు, వృద్ధులకు అండగా సపర్య.. బృహత్తర కార్యక్రమానికి నటుడు కాదాంబరి కిరణ్ శ్రీకారం
- ●Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
- ●84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?
- ●Horoscope | సెప్టెంబర్ 23 రాశిఫలాలు.. ఈ రాశివారు కుటుంబ సభ్యుల ద్వారా లాభాలు పొందుతారు!
- ●Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!
- ●Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..

Saparya | అనాథలు, వృద్ధులకు అండగా సపర్య.. బృహత్తర కార్యక్రమానికి నటుడు కాదాంబరి కిరణ్ శ్రీకారం

Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?

Horoscope | సెప్టెంబర్ 23 రాశిఫలాలు.. ఈ రాశివారు కుటుంబ సభ్యుల ద్వారా లాభాలు పొందుతారు!






