త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalvakuntla Kavita | నెల రోజుల పాటు టీఆర్ఎస్ జెండా పండుగ.. పార్టీ శ్రేణుల‌కు క‌విత పిలుపు

Kalvakuntla Kavita | నెల రోజుల పాటూ రాష్ట్ర వ్యాప్తంగా జెండా పండుగ‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు "తెలంగాణ రక్షణ సేన" పార్టీ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత ప్ర‌క‌టించారు. పార్టీ ఆవిర్భావ సభలో ప్రకటించిన పార్టీ విధానాలను, పాంచజన్య సిద్ధాంతాలను ప్రజలకు వివరించాల‌ని ఈ సంద‌ర్భంగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

D

Telangana | Published On May 11, 2026, 2.32 pm IST

Kalvakuntla Kavita | నెల రోజుల పాటు టీఆర్ఎస్ జెండా పండుగ.. పార్టీ శ్రేణుల‌కు క‌విత పిలుపు
Advertisement

Kalvakuntla Kavita | "తెలంగాణ రక్షణ సేన" పార్టీ (Telangana Rakshana Sena party) భావజాలాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు మే 20 నుంచి నెల రోజుల పాటు జెండా పండుగ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ఆ పార్టీ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత (Kalvakuntla Kavita) పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజ‌ధాని నుంచి వార్డు స్థాయి వ‌ర‌కూ పార్టీ జెండాలు ఆవిష్క‌రించాల‌ని సూచించారు.

"ఈ నెల 20 నుంచి జూన్ 20వ తేదీ వరకు నెల రోజులపాటు రాష్ట్ర రాజధాని, జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ, మండల కేంద్రాలు, గ్రామ స్థాయి వరకు పెద్ద ఎత్తున జెండా పండుగ నిర్వహించాలి. అన్ని వార్డుల్లోనూ టీఆర్ఎస్ జెండాలు ఎగురవేయాలి. టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ప్రకటించిన పార్టీ విధానాలను, పాంచజన్య సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలి. రాష్ట్రం ఆవిర్భవించి 12 ఏళ్లు గడిచిన తర్వాత కూడా మన తెలంగాణ గడ్డ అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నది. తెలంగాణ ఉద్యమ నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాలను సాకారం చేసుకోవడంలోనూ వంచనకు గురయ్యాము. వలస పాలన నాటి దుష్పరిణామాలను మనం ఇప్పుడు మళ్లీ ఎదుర్కొంటున్నాము" అని క‌విత అన్నారు.

తెలంగాణ తెచ్చుకుంటే మన బతుకులు మారుతాయని అనుకున్న ప్రతివర్గం అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంద‌ని పేర్కొన్నారు. స్వరాష్ట్ర సాధనకు అవిశ్రాంతంగా ఉద్యమించిన మనం తెలంగాణ పునర్నిర్మాణం, సబ్బండ వర్గాల వికాసం కోసం ఉద్యమించాల్సిన సమయం వచ్చిందన్నారు. అందుకే తెలంగాణ రక్షణ సేన జెండాను ప్రతి వాడకు, పార్టీ సిద్ధాంతాలను ప్రతి గడపకు తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. పార్టీ ఆవిర్భావానికి మూడు నెలల ముందు నుంచే పెద్ద ఎత్తున మనతో చేరిన నాయకత్వంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ జాగృతి నాయకత్వం జెండా పండుగను విజయవంతం చేయాలని ఈ సంద‌ర్భంగా క‌విత పిలుపునిచ్చారు.

Also Read..

సినిమా ప్ర‌మోష‌న్స్ తెచ్చిన తంటాలు - వివాదంలో చిక్కుకున్న ర‌కుల్‌...

మందారం...బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ...భోగి నుంచి డింపుల్ హ‌య‌తి ఫ‌స్ట్ లుక్ అదిరిందిగా!

గెలాక్సీ ఎం, ఎఫ్ సిరీస్ ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌లు.. ప్ర‌క‌టించిన శాంసంగ్‌..

Advertisement
Advertisement