త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samsung | గెలాక్సీ ఎం, ఎఫ్ సిరీస్ ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌లు.. ప్ర‌క‌టించిన శాంసంగ్‌..

Samsung | ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ సంస్థ శామ్‌సంగ్ భారత్‌లో గెలాక్సీ ఎం, గెలాక్సీ ఎఫ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు ధ‌ర‌లను ప్రకటించింది. మే 8 నుంచి ప్రారంభమైన ఈ ప్రత్యేక సేల్‌లో ఎంపిక చేసిన 5జి మోడళ్లపై గరిష్టంగా 41 శాతం వరకు డిస్కౌంట్లు అందిస్తున్నట్లు వెల్లడించింది. కొన్ని ఫోన్లపై రూ.12వేల వరకు ధర తగ్గింపు లభిస్తోందని కంపెనీ తెలిపింది.

S

Technology | Published On May 11, 2026, 1.46 pm IST

Samsung | గెలాక్సీ ఎం, ఎఫ్ సిరీస్ ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌లు.. ప్ర‌క‌టించిన శాంసంగ్‌..
Advertisement

Samsung | ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ సంస్థ శామ్‌సంగ్ భారత్‌లో గెలాక్సీ ఎం, గెలాక్సీ ఎఫ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు ధ‌ర‌లను ప్రకటించింది. మే 8 నుంచి ప్రారంభమైన ఈ ప్రత్యేక సేల్‌లో ఎంపిక చేసిన 5జి మోడళ్లపై గరిష్టంగా 41 శాతం వరకు డిస్కౌంట్లు అందిస్తున్నట్లు వెల్లడించింది. కొన్ని ఫోన్లపై రూ.12వేల వరకు ధర తగ్గింపు లభిస్తోందని కంపెనీ తెలిపింది. ఈ ప్రత్యేక సేల్‌లో గెలాక్సీ ఎం56 5జి పై అత్యధిక తగ్గింపు ధ‌ర లభిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ.33,999 కాగా, ఇప్పుడు రూ.21,999కే అందుబాటులో ఉంది. అంటే దాదాపు రూ.12వేల తగ్గింపు లభిస్తోంది. ఈ డివైస్‌లో 50ఎంపీ ఓఐఎస్ ట్రిపుల్ కెమెరా సెటప్, 12ఎంపీ హెచ్‌డీఆర్ ఫ్రంట్ కెమెరా, ఎగ్జినోస్ 1480 ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

భారీ త‌గ్గింపు ధ‌ర‌లు, అద్భుత‌మైన ఫీచ‌ర్లు..

గెలాక్సీ ఎం36 5జి ధరను రూ.26,999 నుంచి రూ.16,999 కి తగ్గించారు. ఇందులో ఎగ్జినోస్ 1380 చిప్‌సెట్, 6.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే, 120 హెడ్జ్‌ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. బడ్జెట్ సెగ్మెంట్‌లో గెలాక్సీ ఎం17ఇ 5జిపై కూడా భారీ ఆఫర్ ఉంది. ఈ ఫోన్ ధర రూ.18,999 నుంచి రూ.12,499కు పడిపోయింది. 120హెడ్జ్‌ డిస్‌ప్లే, 6000ఎంఏహెచ్‌ బ్యాటరీ, 50ఎంపీ డ్యూయల్ కెమెరా, ఆరు ఓఎస్‌ అప్‌డేట్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే గెలాక్సీ ఎం17 5జి ధర రూ.20,999 నుంచి రూ.13,999కు తగ్గింది. ఈ డివైస్‌లో 50ఎంపీ ఓఐఎస్ కెమెరా, 6.7 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే, 90హెడ్జ్‌ రిఫ్రెష్ రేట్ అందిస్తున్నారు. గెలాక్సీ ఎఫ్ సిరీస్‌లో కూడా ఆకర్షణీయ ఆఫర్లు ఉన్నాయి. గెలాక్సీ ఎఫ్‌70ఇ 5జి ధర రూ.18,999 నుంచి రూ.12,499కి తగ్గింది. ఇందులో 6.7 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపీ డ్యూయల్ కెమెరా, 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 25 వాట్ల‌ ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్లు ఉన్నాయి. అలాగే ఆరు జ‌న‌రేష‌న్స్ ఓఎస్ అప్‌డేట్స్, ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని శామ్‌సంగ్ ప్రకటించింది.

ఏయే ప్లాట్‌ఫామ్‌ల‌పై..

ఈ ఆఫర్లు ఫ్లిప్‌కార్ట్‌, శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్లు, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. కొన్ని మోడళ్లపై బ్యాంక్ ఆఫర్లు, ఈఎంఎఐ సదుపాయాలు కూడా లభిస్తున్నాయి. ఇటీవల గ్లోబల్ మెమరీ చిప్ కొరత కారణంగా స్మార్ట్‌ఫోన్ ధరలు పెరుగుతున్న సమయంలో ఈ భారీ తగ్గింపులు వినియోగదారులకు మంచి అవకాశంగా మారాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా రూ.12వేల నుంచి రూ.22వేల మధ్య 5జి ఫోన్ల కోసం చూస్తున్న వారికి గెలాక్సీఎం, ఎఫ్ సిరీస్ మంచి ఎంపికలుగా నిలుస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement