త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dimple Hayathi | మందారం…బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ …భోగి నుంచి డింపుల్ హ‌య‌తి ఫ‌స్ట్ లుక్ అదిరిందిగా!

శ‌ర్వానంద్ హీరోగా సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న భోగి నుంచి స‌ర్‌ప్రైజింగ్ అప్‌డేట్ వ‌చ్చేసింది. డింపుల్ హ‌య‌తి ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ సోమ‌వారం రిలీజ్ చేశారు. ఈ పీరియాడిక‌ల్ యాక్ష‌న్ మూవీలో మందారం అనే క్యారెక్ట‌ర్‌లో డింపుల్ హ‌య‌తి క‌నిపించ‌బోతుంది.

N

Entertainment | Published On May 11, 2026, 1.48 pm IST

Dimple Hayathi | మందారం…బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ …భోగి నుంచి డింపుల్ హ‌య‌తి ఫ‌స్ట్ లుక్ అదిరిందిగా!
Advertisement

Dimple Hayathi |  బోల్డ్ రోల్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు రెడీ అయ్యింది అచ్చ తెలుగు బ్యూటీ డింపుల్ హ‌య‌తి. శ‌ర్వానంద్ హీరోగా సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న మూవీ భోగి. య‌థార్థ ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో పీరియాడిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఇటీవ‌లే భోగి నుంచి శ‌ర్వానంద్‌తో పాటు అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఫ‌స్ట్ లుక్‌ల‌ను రిలీజ్ చేశారు. కంప్లీట్ రా అండ్ ర‌స్టిక్ లుక్‌లో వీరిద్ద‌రు క‌నిపించారు. తాజాగా భోగి నుంచి మ‌రో స‌ర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్ వ‌చ్చేసింది.

మందారం...

ఈ సినిమాలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో పాటు డింపుల్ హ‌య‌తి మ‌రో హీరోయిన్‌గా క‌నిపించ‌బోతుంది. డింపుల్ హ‌య‌తి ఫ‌స్ట్ లుక్‌ను సోమ‌వారం రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. మందారం అనే క్యారెక్ట‌ర్‌లో డింపుల్ న‌టించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. రెడీ శారీలో రెట్రో స్టైల్‌తో బోల్డ్ లుక్‌లో ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో డింపుల్‌ క‌నిపిస్తోంది. డింపుల్ హ‌య‌తి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన డైరెక్ట‌ర్ సంప‌త్ నంది... బొ***లో ప్రపంచం ....ఛ‌ల్ తీ....మందారం ఈడ..అంటూ పేర్కొన్నారు. సంప‌త్ నంది డైలాగ్స్ చూస్తుంటే భోగిలో ఊర‌మాస్‌గా ఈ అచ్చ తెలుగు బ్యూటీ క్యారెక్ట‌ర్ సాగ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

1960 బ్యాక్‌డ్రాప్‌లో...

మ‌హారాష్ట్ర - తెలంగాణ స‌రిహ‌ద్దుల నేప‌థ్యంలో 1960 బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో భోగి షూటింగ్ జ‌రుగుతోంది. ఆగ‌స్ట్ 28న పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో ఐదు భాష‌ల్లో రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.
భోగి మూవీకి భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రాధామోహ‌న్ నిర్మిస్తున్నారు. లాంగ్ గ్యాప్ త‌ర్వాత కంప్లీట్ మాస్ క‌థ‌తో శ‌ర్వానంద్ చేస్తోన్న సినిమా ఇది. ఈ ఏడాది శ‌ర్వానంద్ హీరోగా న‌టించిన నారి నారి న‌డుమ మురారితో పాటు బైక‌ర్ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. భోగితో ఒకే ఇయ‌ర్‌లో మూడోసారి తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు శ‌ర్వానంద్‌. శ‌త‌మానం భ‌వ‌తి త‌ర్వాత శ‌ర్వానంద్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న సెకండ్ మూవీ ఇది.

 

Advertisement
Advertisement