త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rakul Preet Singh | సినిమా ప్ర‌మోష‌న్స్ తెచ్చిన తంటాలు – వివాదంలో చిక్కుకున్న ర‌కుల్‌…

ర‌కుల్ ప్రీత్ సింగ్ వివాదంలో చిక్కుకుంది. ప‌తి ప‌త్నీ ఔర్ వో దో మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా మూవీ యూనిట్‌తో క‌లిసి ర‌కుల్ గిర్ నేష‌న‌ల్ పార్క్‌ను సంద‌ర్శించింది. ఈ టూర్‌లో ర‌కుల్ ఫారెస్ట్ రూల్స్ అతిక్ర‌మించిందంటూ ఆమెను నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

N

Entertainment | Published On May 11, 2026, 2.31 pm IST

Rakul Preet Singh | సినిమా ప్ర‌మోష‌న్స్ తెచ్చిన తంటాలు – వివాదంలో చిక్కుకున్న ర‌కుల్‌…
Advertisement

Rakul Preet Singh |  వెరైటీ పేరుతో చేసే కొన్ని ప‌నులు సెలిబ్రిటీల‌ను చిక్కుల్లో ప‌డేస్తాయి. ర‌కుల్ ప్రీత్ సింగ్‌కు అలాంటి అనుభ‌వ‌మే ఎదురైంది. ర‌కుల్ ఫ్రీత్ హీరోయిన్‌గా న‌టించిన ప‌తి ప‌త్నీ ఔర్ వో దో మూవీ మే 15న ప్రేక్ష‌కల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో మేక‌ర్స్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా గుజ‌రాత్‌లోని గిర్ నేష‌న‌ల్ పార్క్‌ను సంద‌ర్శించారు. సినిమా ప‌ట్ల ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేసేందుకు వెరైటీ ఇంట‌ర్వ్యూను ఈ నేష‌న‌ల్ పార్క్‌లో మేక‌ర్స్ ప్లాన్ చేశార‌ట‌. అంత‌ర‌కు బాగానే ఉంది. ప‌తి ప‌త్నీ ఔర్ వో దో మూవీ టీమ్ గిర్ నేష‌న‌ల్ పార్క్‌కు సంద‌ర్శించిన వీడియోలో ర‌కుల్ ప్రీత్ స‌ఫారీ వాహ‌నం దిగి దాని ప‌క్క‌న న‌డుస్తూ క‌నిపించింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది.

నిషేధం...

గిర్ నేష‌న‌ల్ పార్క్‌ను సంద‌ర్శించ‌డానికి వ‌చ్చిన ప‌ర్యాట‌కులు స‌ఫారీ వాహ‌నం దిగ‌డం నిషేధం. ర‌కుల్ రూల్స్ అతిక్ర‌మించ‌డంపై నెటిజ‌న్లు ఫైర్ అవుతోన్నారు. సామాన్యుల‌కు ఓ రూల్‌, సెలిబ్రిటీల‌కు మ‌రో రూలా అంటూ అధికారుల‌తో పాటు ర‌కుల్‌ను కూడా ట్రోల్ చేయ‌డం మొద‌లుపెట్టారు. రూల్స్ బ్రేక్ చేసినందుకు ర‌కుల్‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

వివాదంపై క్లారిటీ...

ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో గిర్ నేష‌న‌ల్ పార్క్ అధికారులు ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చారు. ర‌కుల్ ఎలాంటి నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించ‌లేద‌ని వెల్ల‌డించారు. సోష‌ల్ మీడియాలో స‌ర్క్యూలేట్ అవుతోన్న వీడియో నేష‌న‌ల్ పార్క్ బ‌య‌ట తీసింద‌ని అంటున్నారు. సినిమా యూనిట్‌తో క‌లిసి ర‌కుల్ నేష‌న‌ల్ పార్క్‌ను సంద‌ర్శించాల్సింద‌ని, కానీ అస్వ‌స్థ‌త‌కు లోను కావ‌డంతో పార్క్‌లోకి ఎంట్రీ కావ‌డం కంటే ముందే ర‌కుల్ స‌ఫారీ వాహ‌నం దిగింద‌ని క్లారిటీ ఇచ్చారు.

సీక్వెల్‌....

ప‌తి ప‌త్నీ ఔర్ వో దో మూవీలో ర‌కుల్ ప్రీత్ సింగ్‌తో పాటు సారా అలీ ఖాన్‌, వామికా గ‌బ్బి హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. ఆయుష్మాన్ ఖురానా క‌థానాయ‌కుడిగా క‌నిపించ‌బోతున్నారు. 2019లో వ‌చ్చిన ప‌తి ప‌త్నీ ఔర్ వోకు రీమేక్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ర‌కుల్ కెరీర్‌కు ఈ మూవీ స‌క్సెస్ కీల‌కంగా మారింది.

 

 

Advertisement
Advertisement