Kavitha Kalvakuntla | హామీల అమలు గురించి ప్రశ్నిస్తే రక్తం కళ్లజూస్తారా..? పోలీసుల తీరుపై కవిత మండిపాటు
Kavitha Kalvakuntla | ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేసే చేతకాక ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పతనం తప్పదని తెలంగాణ రక్షణ సేన (Telangana Rakshana Sena) చీఫ్ కల్వకుంట్ల కవిత (Kavitha Kalvakuntla) హెచ్చరించారు. బోడుప్పల్ భూ పోరాట ప్రాంతాన్ని కవిత ఇవాళ సందర్శించారు.
Kavitha Kalvakuntla | బోడుప్పల్ (Boduppal)లో భూ పోరాటం చేస్తున్న తెలంగాణ రక్షణ సేన (Telangana Rakshana Sena) చీఫ్ కల్వకుంట్ల కవిత (Kavitha Kalvakuntla)తోపాటూ వందలాది మంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారందరికీ బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు. ఇది అన్యాయమైన చర్య అని మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు గురించి అడిగామని.. అంతకుమించి ఇతర ఎలాంటి డిమాండ్లూ పెట్టలేదని చెప్పారు. ఇచ్చిన హామీల అమలు గురించి ప్రశ్నిస్తే లాఠీలతో కొట్టిస్తారా..? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉద్యమకారుల రక్తాన్ని కళ్లజూసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
"ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేసే చేతకాక ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పతనం తప్పదు. ఉద్యమకారులకు న్యాయం చేస్తామని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి వారి సమస్యలు ఇప్పుడు కనిపించడం లేదా..? ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇచ్చే వరకు మిమ్మల్ని వదిలిపెట్టం. ప్రజాక్షేత్రంలో మీ మోసాలను ఎండగడుతాం. ఉద్యమకారుల హక్కుల సాధన కోసం మా పోరాటం నిరంతరం కొనసాగుతుంది" అని కవిత స్పష్టం చేశారు.

Also Read..
అవినీతి చేయకుంటే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు..? : హరీశ్ రావు
సీనియర్ సిటిజన్లకు ఎఫ్‌డీలపై 8 శాతం వరకు వడ్డీ.. ఏ బ్యాంక్ ఎంత ఇస్తోంది..?
సంబంధిత వార్తలు

Kalvakuntla Kavitha | కోహినూర్ వజ్రం తిరిగిచ్చేయండి.. భారతీయులకు బ్రిటన్ రాజు క్షమాపణ చెప్పాల్సిందే: కవిత సంచలన వ్యాఖ్యలు
ఆగస్టు 15, 2026

Kalvakuntla Kavitha | ఆ పార్టీలకు లేని అభ్యంతరాలు తెలంగాణ రక్షణ సేనపై ఎందుకు..? ఈసీని ప్రశ్నించిన కవిత
జులై 12, 2026

Kavitha | కవితకు ఈసీ షాక్.. తెలంగాణ రక్షణ సేన పేరు మార్చుకోవాల్సిందే!
జులై 4, 2026
తాజావార్తలు
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?
- ●Telangana Movie Ticket Prices | సినిమా టికెట్ ధరలపై తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఏసీ, నాన్-ఏసీ థియేటర్లలో కొత్త రేట్లు ఇవే!
- ●Konda Surekha TPCC Notice | కొండా సురేఖకు టీపీసీసీ బిగ్ షాక్.. కూతురు కామెంట్స్‌పై 3 రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందే
- ●Telangana Intermediate Board Scandal | ఇంటర్ బోర్డులో ప్రకంపనలు: గ్లోబరీనా స్కామ్‌పై విజిలెన్స్ ఎంక్వైరీ.. మాజీ సెక్రటరీ అశోక్ విచారణ
- ●Vemula Prashanth Reddy | ఆర్భాటాలకు వందల కోట్లు.. భీమ్‌గల్ అభివృద్ధికి రూ.20 కోట్లు లేవా?
- ●Tamannaah Bhatia | ‘నో కిస్సింగ్ పాలసీ’కి గుడ్‌బై.. తమన్నా ఎందుకిలా?

Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

Telangana Movie Ticket Prices | సినిమా టికెట్ ధరలపై తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఏసీ, నాన్-ఏసీ థియేటర్లలో కొత్త రేట్లు ఇవే!

Konda Surekha TPCC Notice | కొండా సురేఖకు టీపీసీసీ బిగ్ షాక్.. కూతురు కామెంట్స్‌పై 3 రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందే

Telangana Intermediate Board Scandal | ఇంటర్ బోర్డులో ప్రకంపనలు: గ్లోబరీనా స్కామ్‌పై విజిలెన్స్ ఎంక్వైరీ.. మాజీ సెక్రటరీ అశోక్ విచారణ



