త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | 125 మందికి ఇండ్ల‌ ప‌ట్టాలిస్తున్నం.. సంతోషంగా ఉంది

Ponguleti Srinivas Reddy | ఈరోజు గోషామ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో 125 మంది అర్హులైన పేద‌ల‌కు ఇందిర‌మ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామ‌ని.. మ‌రో రెండు మూడు విడ‌త‌ల్లో మూడు కార్పొరేష‌న్ల ప‌రిధిలోని అర్హులంద‌రికీ ఇండ్లు క‌ట్టించి ఇస్తామ‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఎక‌రం రూ.200 కోట్ల ఖ‌రీదు చేసే భూముల్లోనైనా స‌రే ఇండ్లు క‌ట్టిస్తామ‌న్నారు.

S

Telangana | Published On Jul 2, 2026, 1.23 pm IST

Ponguleti Srinivas Reddy | 125 మందికి ఇండ్ల‌ ప‌ట్టాలిస్తున్నం.. సంతోషంగా ఉంది
Advertisement
  • త్వ‌ర‌లో మూడు కార్పొరేష‌న్ల ప‌రిధిలో విడ‌త‌ల వారీగా కేటాయిస్తం
  • ఒక్కో నియోజ‌క‌వ‌ర్గానికి 500 నుంచి 1000 ఇండ్లు ఇస్తాం
  • రానివారు నిరుత్సాహ ప‌డొద్దు.. మూడు విడ‌త‌ల్లో అర్హులంద‌రికీ ఇస్తాం
  • ఎంత ఖ‌రీదు చేసే భూమైనా స‌రే అక్క‌డే నిర్మించి ఇస్తాం
  • నాంప‌ల్లి ఇందిర‌మ్మ ఇండ్ల ప‌ట్టాల పంపీణీలో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: ఈరోజు గోషామ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో 125 మంది అర్హులైన పేద‌ల‌కు ఇందిర‌మ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామ‌ని.. మ‌రో రెండు మూడు విడ‌త‌ల్లో మూడు కార్పొరేష‌న్ల ప‌రిధిలోని అర్హులంద‌రికీ ఇండ్లు క‌ట్టించి ఇస్తామ‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం నాంప‌ల్లిలో ఏర్పాటు చేసిన ప‌ట్టాల పంపిణీ కార్య‌క్ర‌మంలో ఆయ‌న ప్ర‌సంగించారు. మొద‌టి విడ‌తలో ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో 500 నుంచి 1000 ఇండ్లు త‌గ్గ‌కుండా యుద్ధ‌ప్రాతిప‌దిక పూర్తి చేస్తామ‌ని చెప్పారు. ఎక‌రం రూ.200 కోట్ల ఖ‌రీదు చేసే భూముల్లోనైనా స‌రే ఇండ్లు క‌ట్టిస్తామ‌న్నారు.

మొద‌టి విడ‌త‌లో ల‌క్ష ఇండ్లు..

సీఎం నాయక‌త్వంలోని ప్ర‌జాప్ర‌భుత్వం 125 ఇండ్ల‌ను ఈరోజు ఇస్తుంది. ఇంకా అర్హులైన చాలా మంది ఉన్నారు. వారంతా ఇండ్లు కావాల‌ని ఎదురుచూస్తున్నారు. గ‌త ప్ర‌భుత్వంలా కాకుండా ప్రతి నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటున్నాం. మొన్న‌టి కేబినెట్ మీటింగ్‌లో మొద‌టి విడ‌త ల‌క్ష ఇండ్లు సాంక్ష‌న్ చేశాం. రాబోయే రెండు మూడు రోజుల్లోనే ఈ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుడుతున్నాం. మొద‌టి విడ‌తలో 19 నియోజ‌క‌వ‌ర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో 500 నుంచి 1000 ఇండ్లు త‌గ్గ‌కుండా యుద్ధ‌ప్రాతిప‌దిక పూర్తి చేస్తం. మొద‌టి విడ‌త త‌ర్వాత రెండో, మూడో విడ‌త‌ల్లో కూడా ఇండ్లు నిర్మించి ఇస్తాం అని పొంగులేటి హామీ ఇచ్చారు.

త్వ‌ర‌లోనే టెండ‌ర్లు పిలుస్తాం..

ఈ ప్ర‌భుత్వానికి పేద‌వాడి క‌ష్టం తెలుసు. ఇల్లు పేద‌వాడి చిర‌కాల కోరిక‌. బీఆర్ఎస్ విస్మ‌రిస్తే ఈ ప్ర‌భుత్వం ఆదుకుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్ప‌టికే 5500 ఇండ్లు రెండు విడ‌త‌ల్లో ఇచ్చాం. జీహెచ్ఎంసీ ప‌రిధిలో ల‌క్ష ఇండ్లు సాంక్ష‌న్ చేశాం. మ‌ళ్లీ చేస్తాం. ఎక‌రం రూ. 100 కోట్లు అయినా రూ.200 కోట్లు ఖ‌రీదు చేసే భూమైనా ఆ భూమిలోనే మీరు నివ‌సించే ప్రాంతంలోనే త్వ‌రలోనే ఇండ్లు క‌ట్టిస్తం. త్వ‌ర‌లోనే టెండ‌ర్లు కూడా పిల‌వ‌బోతున్నామ‌ని చెప్ప‌డానికి చాలా సంతోషంగా ఉంది. ప్ర‌భుత్వ స్థ‌లాలు మూడు స్థ‌లాల్లో ఉన్నాయ‌ని స్థానిక ఎమ్మెల్యే చెప్పారు. క‌లెక్ట‌ర్‌కు కూడా ఆదేశాలు ఇచ్చాను. జీహెచ్ఎంసీ మూడు కార్పొరేష‌న్ల ప‌రిధిలోని ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో విడ‌త‌ల వారీగా అర్హులైన పేద‌ల‌కు ఇండ్లు కేటాయిస్తాం. మీరు ఎన్నుకున్న ఈ ప్ర‌భుత్వం మీ క‌ల‌ల‌ను నెర‌వేరుస్తుంది అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

నా స‌వాల్‌ను మీరు స్వీక‌రించ‌లే..

10 సంవ‌త్స‌రాల్లో ఇండ్లు క‌ట్టామ‌ని జ‌బ్బ‌లు చ‌రుచుకుంటున్నారో ఆ అసంపూర్తిగా వ‌దిలేసిన అన్నింటిని మేమే పూర్తి చేసి పంపిణీ చేస్తున్నం. రాబోయే రెండున్న‌రేళ్ల‌లో బీఆర్ఎస్ క‌ట్టిన ఇండ్ల కంటే ఎక్కువ క‌డితేనే అసెంబ్లీకి పోటీ చేస్తాన‌ని స‌వాల్ విసిరాను. ఆ స‌వాల్‌ను మీరు స్వీక‌రించ‌లేక, పేదవాళ్ల‌కు ఇండ్లు ఇస్తుంటే మీకు క‌డుపు మండుతుంది. మీ ఒంట్లోని విషాన్నంతా పేద‌వాళ్ల మీద చిమ్ముతున్నారు. పేద‌వాడికి ఇల్లు ఇయ్యాల‌న్న జ్ఞానం మీకు లేదు. కాళేశ్వ‌రం క‌డితే ల‌క్ష కోట్ల రూపాయ‌లు నిధులు వ‌స్తాయ‌ని ఆ ప‌ని చేశారు. దానికి నిధులు ఉన్న‌యి కానీ పేద‌వాడికి ఇల్లు ఇవ్వ‌డానికి నిధులు లేవ‌ని వ‌ట్టి చేతులు చూపించారు అని మంత్రి శ్రీ‌నివాస్‌రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.

పేద‌వాడే మా ఎజెండా..

పేద‌వాడే మా ముఖ్య ఎజెండా. ఒక్క దూల్‌పేట నియోజ‌క‌వ‌ర్గంలోనే కాదు మూడు కార్పొరేష‌న్ల ప‌రిధిలో త‌ప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి తీరుతాం. ఎక్క‌డో 30 కి.మీ ప‌రిధ‌లో కాకుండా మీ నియోజ‌క‌వ‌ర్గంలోనే కేటాయిస్తం. ఈరోజు ఎవ‌రైతే ప‌ట్టాలు అందుకుంటున్నారో వారంద‌రికీ రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌క్షాన శుభాకాంక్ష‌లు, అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్న‌. ఇండ్లు రాని ఆడ‌బిడ్డ‌లు ఎవ‌రూ నిరుత్సాహ ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. మీకు ఇల్లు ఇచ్చే బాధ్య‌త మీరు ఎన్నుకున్న ప్ర‌భుత్వానిది.

వారి బుర‌ద‌ను మాకు అంటిస్తున్న‌రు..

బీఆర్ఎస్ నాయ‌కులు నిరుద్యోగం, ఆడ‌బిడ్డ‌ల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వ‌ల్లిస్తున్న‌ట్లు ఉంది. ఆనాటి ప్ర‌భుత్వంలో ఎలా కొల్ల‌గొట్టారో ఆధారాల‌తో స‌హా అసెంబ్లీ సాక్షిగా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు చూపించిన తీరును వారు మ‌ర్చిపోతున్నారు. అధికారం కోసం క‌ల‌లు కంటున్నారు. ఈ ప్ర‌భుత్వంలో ప‌ని చేస్తున్న పెద్ద‌ల మీద గుడ్డ కాల్చి మీద వేస్తున్నారు. వారంటించుకున్న బుర‌ద‌ను అంతా ఈ ప్ర‌భుత్వానికి రాయాల‌ని చూస్తున్న ఆ మాజీల‌కు మ‌రోసారి చెబుతున్నా.. ప్ర‌జా తీర్పును గౌర‌వించండి. మీకు మ‌తి భ్ర‌మించింది. ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా ఎలాంటి ప్ర‌జ‌లు ఎలాంటి తీర్పు ఇచ్చారో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు, దేశానికి తెలుసు అని ఎద్దేవా చేశారు.

నిన్న‌మొన్న జ‌రిగిన టెండ‌ర్ల విష‌యంలో మూడు రెట్లు దోపిడీ జ‌రిగింద‌నో, దోపిడీ జ‌ర‌గ‌బోతుంద‌నో అబ‌ద్ద‌పు ప్ర‌చారాన్ని ఇప్ప‌టికైనా మానండి. క‌నీసం మీకు ప్ర‌తిప‌క్ష హోదానైనా ఇచ్చారు. ఇంకా మీరు ఇదే ప్ర‌వ‌ర్త‌న‌తో ఉంటే ఈ ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌దు. ఇది మీరు గ్ర‌హించాలి. వెన‌క‌డుగు వేయ‌డం, వెన‌క‌డుగు వేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదు. భ‌విష్య‌త్‌లో కూడా ఉండ‌దు. గురుకుల టెండ‌ర్ల విష‌యంలో గంట కూర్చున్నా మీరు రాలేదు. ఈ ప్ర‌భుత్వం ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌దు అని పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో మంత్ర‌లు పొన్నం ప్ర‌భాక‌ర్‌, అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌, అజారుద్దిన్‌, ఎమ్మెల్యే రాజాసింగ్, స్థానిక కాంగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement