త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌కు పైస‌ల్లేవ్ గానీ.. ల‌క్ష కోట్ల‌తో మూసీ బాగు చేస్తావా?

Kavitha | ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ లేక విద్యార్థులు ఓ దిక్కు ఆగ‌మ‌వుతుంటే.. రూ.ల‌క్ష కోట్ల‌తో మూసీ బాగు చేస్తడంట అంటూ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిపై తెలంగాణ ర‌క్ష‌ణ సేన అధ్య‌క్ష‌రాలు క‌ల్వ‌కుంట్ల క‌విత మండిప‌డ్డారు. తెలంగాణ రక్షణ సేన (TRS) జెండా పండుగ సందర్భంగా సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో టీఆర్ఎస్ జెండా ఎగుర వేశారు. అనంత‌రం ఆమె మాట్లాడుతూ.. సికింద్రాబాద్‌లోని సీతాఫల్ మండిలో టీఆర్ఎస్ జెండా ఎగురేసుకోవడం సంతోషంగా ఉంద‌న్నారు.

P

Telangana | Published On Jul 1, 2026, 4.02 pm IST

Kavitha | ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌కు పైస‌ల్లేవ్ గానీ.. ల‌క్ష కోట్ల‌తో మూసీ బాగు చేస్తావా?
Advertisement
  • పెద్ద‌వాళ్ల కోసం ప‌నులు చేస్తూ పేద‌ల‌ను ప‌ట్టించుకోవ‌ట్లే
  • సీఎం రేవంత్‌రెడ్డిపై విమ‌ర్శ‌లు
  • ఆడ‌బిడ్డ జెండా ఎత్తింది
  • రాష్ట్రంలో అజెండా మారాల్సిందే
  • శ్రీ‌కకృష్ణుడిలా ధ‌ర్మం వైపే నిల‌బ‌డ‌తాం
  • తెలంగాణ ర‌క్ష‌ణ‌సేన చీఫ్ క‌విత‌

Kavitha | ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ లేక విద్యార్థులు ఓ దిక్కు ఆగ‌మ‌వుతుంటే.. రూ.ల‌క్ష కోట్ల‌తో మూసీ బాగు చేస్తడంట అంటూ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిపై తెలంగాణ ర‌క్ష‌ణ సేన అధ్య‌క్ష‌రాలు క‌ల్వ‌కుంట్ల క‌విత మండిప‌డ్డారు. తెలంగాణ రక్షణ సేన (TRS) జెండా పండుగ సందర్భంగా సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో టీఆర్ఎస్ జెండా ఎగుర వేశారు. అనంత‌రం ఆమె మాట్లాడుతూ.. సికింద్రాబాద్‌లోని సీతాఫల్ మండిలో టీఆర్ఎస్ జెండా ఎగురేసుకోవడం సంతోషంగా ఉంద‌న్నారు. తెలంగాణ వచ్చాక జరగాల్సినంత అభివృద్ధి జరగలేద‌ని, అందుకే ప్రజలకు మంచి చేయాలనే గట్టి సంకల్పంతో టీఆర్ఎస్ పార్టీ పెట్టామ‌న్నారు. రేవంత్ రెడ్డి మనకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయలేద‌ని, అయినా సరే ఆయనే గెలుస్తాడంట.. పెంచుతామన్న పెన్షన్లు పెంచలేదు.. కొత్తగా ఎవరికీ కూడా పెన్షన్లు, ఇళ్లు ఇవ్వలేదు.. మూసీ, మెట్రో అంటూ పెద్దవాళ్ల కోసం పనులు చేస్తూ పేదవాళ్లను పట్టించుకోవటం లేద‌ని ఆరోపించారు. ముందు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాల‌ని క‌విత డిమాండ్ చేశారు.

తులం బంగారం ఇచ్చిండా?

ఈ ముఖ్యమంత్రి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేశాడంట‌.. ఈసలు ఆయన ఇస్తానన్న తులం బంగారం ఎవరికైనా వచ్చిందా? అంటూ క‌విత ప్ర‌శ్నించారు. అయిన సరే నేను మరో పదేళ్లు ముఖ్యమంత్రి అంటాడు.. రాజ్యాంగంలో అట్ల ఏమైనా రాసి ఉందా? అంటూ విమ‌ర్శించారు. రాష్ట్రం సాధించుకొని 13 ఏళ్లు అయిన సరే మన జీవితాలు ఏమీ బాగుపడలేదని, ముఖ్యంగా పేదలకు, మధ్య తరగతి ప్రజలకు భారమైన విద్య, వైద్యం గురించి ఏ ప్రభుత్వం ఆలోచించటం లేద‌ని విమ‌ర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విద్య, వైద్యం ఫ్రీగా ఇవ్వాలన్న ఆలోచన చేయటం లేదని, మీ ఆడబిడ్డగా నేను పార్టీ పెట్టానంటే మీ కోసం ఆలోచించే పెట్టానని, మ‌గ రాజకీయ నాయకులు ఎవరూ మీకోసం ఆలోచించటం లేద‌న్నారు. మీ ఆడబిడ్డగా నేను ఆలోచన చేశాన‌ని, నన్ను ఆశీర్వదించాల‌న్నారు. మీ ఆశీర్వాదంతో కచ్చితంగా అధికారంలోకి వస్తామ‌న్నారు. అప్పుడు విద్య, వైద్యానికి సంబంధించిన ఖర్చు మొత్తం ప్రభుత్వమే భ‌రిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. తాను పెద్ద పెద్ద మాటలేమీ చెప్పన‌ని, మీకు ఏం కావాలో అదే చేస్తాన‌ని హామీ ఇచ్చారు.

డిగ్రీలు చ‌దివినా జాబ్‌లు రావ‌డం లేదు

డిగ్రీలు చదివిన సరే మన పిల్లలకు జాబ్‌లు రావ‌డం లేద‌ని క‌విత ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు వారికి రుణాలు ఇస్తామ‌న్నారు. చాలా పార్టీలు ఉన్నాయ‌ని.. విద్య, వైద్యం, ఉద్యోగాల గురించి మాత్రం ఎవరు ఆలోచన చేయ‌లేద‌ని మండిప‌డ్డారు. జు కూలీ చేసుకునే బతికే మన జీవితాలు మార్చే వాళ్లు కావాల‌ని, తెలంగాణ ఉద్యమంలో సికింద్రాబాద్ ప్రాంతం నుంచి ఎంతో మంది పోరాటం చేశార‌న్నారు. కానీ వాళ్లకు ఇవ్వాళ కనీసం గౌరవం కూడా లేని పరిస్థితి వచ్చింది. ఉద్యమకారులకు ఈ ప్రభుత్వం 250 గజాల స్థలం ఇస్తామని చెప్పి మోసం చేసింద‌ని మండిప‌డ్డారు. అందుకే రేపు ఉప్పల్ భగాయత్‌లో పెద్ద ధ‌ర్నా పెట్టామ‌ని, అక్కడ ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని ఉద్యమకారులకు ఆ భూమిని పంచుతామ‌న్నారు. శ్రీ కృష్ణుడి శంఖం పేరు పాంచజన్య‌మ‌ని, తాము కూడా ఐదు అంశాలను ప్రాధాన్యంగా పెట్టుకోని పాంచజన్యం అనే పేరు పెట్టుకున్నామ‌న్నారు. శ్రీ కృష్ణుడు ఏ విధంగా ధర్మం వైపు ఉన్నారో.. తాము కూడా అలాగే ధర్మం వైపు ఉంటామ‌న్నారు. ఇక్కడున్న ప్రజల సమస్యల కోసం టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాల‌ని క‌విత సూచించారు. ప్రజల కోసం కష్టపడి పనిచేసే వాళ్లకే టీఆర్ఎస్‌లో గౌర‌వం ఉంటుంద‌న్నారు. మీ ఆడబిడ్డ జెండా ఎత్తింద‌ని.. ఇక రాష్ట్రంలో అజెండా మారాల్సిందేన‌న్నారు. ఒక ఆడబిడ్డకు అవకాశం వచ్చేలా ఆశీర్వదించండి క‌విత కోరారు.

Advertisement
Advertisement