IRCTC | తెలుగు రాష్ట్రాల మీదుగా రూ.16,400కే అయోధ్య, కాశీ వంటి పుణ్యక్షేత్రాల యాత్ర.. సికింద్రాబాద్ నుంచి టూర్ స్టార్ట్
IRCTC | ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లాలనుకునే యాత్రికులకు ఐఆర్‌సీటీసీ (IRCTC) గుడ్ న్యూస్ చెప్పింది. "అయోధ్య - కాశీ పుణ్యక్షేత్ర యాత్ర విత్ బైద్యనాథ్ ధామ్" పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈనెల 4న సికింద్రాబాద్ నుంచి టూర్ ప్రారంభమవుతుంది. మొత్తం తొమ్మిది రాత్రులు, 10 రోజులపాటూ ఈ యాత్ర సాగనుంది.
Devotional | Published On Jul 2, 2026, 11.57 am IST
IRCTC | అయోధ్య, కాశీ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే వారికి ఐఆర్‌సీటీసీ (IRCTC) గుడ్‌న్యూస్ చెప్పింది. "అయోధ్య - కాశీ పుణ్యక్షేత్ర యాత్ర విత్ బైద్యనాథ్ ధామ్" పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది.
ఇందులో అయోధ్య - కాశీ టూర్ ఈనెల 4వ తేదీ నుంచే ప్రారంభం కానుంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ (Bharat Gaurav Tourist Train) తన ప్రయాణాన్ని సాగిస్తుంది. జులై 4న మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి గౌరవ్ టూరిస్ట్ రైలు బయల్దేరుతుంది. చర్లపల్లి, కాజీపేట్ జంక్షన్, వరంగల్, ఖమ్మం, విజయవాడ జంక్షన్, గుడివాడ జంక్షన్, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు జంక్షన్, రాజమండ్రి, సమల్కోట్ జంక్షన్, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం మీదుగా ఈ ప్రయాణం సాగుతుంది.
ఈ యాత్రలో గయలోని విష్ణుపాద్ టెంపుల్, కాశీ విశ్వనాథ్ టెంపుల్, కాశీ విశ్వనాథ్ కారిడార్, కాశీ విశాలాక్షి ఆలయం, అన్నపూర్ణా దేవి ఆలయం, సాయంత్రం గంగాహారతి, రామ్ జన్మభూమి, హనుమాన్ గర్హి, త్రివేణి సంగమ్, బాబా బైద్యనాథ్ టెంపుల్ వంటి పవిత్ర ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పిస్తోంది ఐఆర్‌సీటీసీ. మొత్తం యాత్ర 9 రాత్రులు, 10 రోజుల పాటు సాగుతుంది.
ఇవీ ప్యాకేజీ ధరలు..
- ప్యాకేజీ విషయానికొస్తే.. ఎకానమీ (స్లీపర్ క్లాస్), స్టాండర్డ్ (3ఏసీ), కంఫర్ట్ (2ఏసీ) అనే మూడు కేటగిరీలు ఉన్నాయి. మొత్తం 705 సీట్లు అందుబాటులో ఉంటాయి. అందులో స్లీపర్‌లోలో 237, 3ఏసీలో 416, 2 ఏసీలో 52 సీట్లు ఉన్నాయి.
- స్లీపర్ క్లాస్‌లో ఎకానమీ టికెట్ ధర రూ.16,400 నుంచి ప్రారంభమవుతుంది. అదే 5-11 ఏళ్ల మధ్య వయసు గల చిన్నారులకు మాత్రం రూ.15,300 చెల్లించాలి.
- 3ఏసీ స్టాండర్డ్ ప్యాకేజీ ధర రూ.25,500 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.24,100 చెల్లించాలి.
- ఇక 2ఏసీ కంఫర్ట్ ప్యాకేజీ ధర రూ.33,100గా నిర్ణయించారు. ఇందులో 5-11 ఏళ్ల చిన్నారులకు రూ.31,500 చెల్లించాలి.
యాత్రికులకు హోటల్ బస, శాకాహార భోజనం, స్థానిక రవాణా, ట్రావెల్ ఇన్సూరెన్స్, టూర్ మేనేజర్ సహాయం వంటి సదుపాయాలు ప్యాకేజీలో భాగం. అయితే, ఏ ఆలయం వద్దైనా ఎంట్రీ ఫీజులు ఉంటే మాత్రం ప్రయాణికులే చెల్లించుకోవాల్సి ఉంటుంది. కేవలం యాత్రికుల భద్రత, ప్రయాణ సదుపారం, బస, ఫుడ్ వంటివి మాత్రమే రైల్వే సిబ్బంది చూసుకుంటారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Kondagattu | కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కట్టలు
- ●NTPC | ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం..
- ●గోదావరి నీటిపై ఏపీ 'మాస్టర్ మైండ్'.. రేవంత్ సర్కార్ చావో రేవో!
- ●Horoscope | ఆగస్టు 13 రాశిఫలాలు.. ఈ రాశి వారు ధన సంపాదనకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు!
- ●Senior Citizen Property Rights India | ఆస్తి తీసుకుని పేరెంట్స్‌ను గాలికి వదిలేసిన కొడుకు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు
- ●Mumbai Local Train | ముంబై లోకల్ ట్రైన్ అంటే దడదడ.. ఎక్కలేక చేతులెత్తేసిన కొరియన్ టూరిస్ట్

Kondagattu | కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కట్టలు

NTPC | ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం..

గోదావరి నీటిపై ఏపీ 'మాస్టర్ మైండ్'.. రేవంత్ సర్కార్ చావో రేవో!

Horoscope | ఆగస్టు 13 రాశిఫలాలు.. ఈ రాశి వారు ధన సంపాదనకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు!






