Senior Citizen | సీనియర్ సిటిజన్లకు ఎఫ్‌డీలపై 8 శాతం వరకు వడ్డీ.. ఏ బ్యాంక్ ఎంత ఇస్తోంది..?
Senior Citizen | ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీలు) స్థిరమైన రాబడిని అందించే పెట్టుబడి సాధనంగా గుర్తింపు పొందాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఇవి తక్కువ రిస్క్‌తోపాటు క్రమం తప్పకుండా ఆదాయం అందించే మంచి మార్గంగా మారాయి.
Senior Citizen | ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీలు) స్థిరమైన రాబడిని అందించే పెట్టుబడి సాధనంగా గుర్తింపు పొందాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఇవి తక్కువ రిస్క్‌తోపాటు క్రమం తప్పకుండా ఆదాయం అందించే మంచి మార్గంగా మారాయి. పదవీ విరమణ అనంతరం తమ పొదుపులోని గణనీయమైన భాగంపై స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారికి టర్మ్ డిపాజిట్లు అనుకూలంగా ఉంటాయి. మార్కెట్ ఒడిదుడుకులకు దూరంగా, తక్కువ రిస్క్‌తో కచ్చితమైన రాబడిని కోరుకునే పెట్టుబడిదారులకు ఎఫ్‌డీలు సరైన ఎంపికగా నిలుస్తాయి. చాలా ఎఫ్‌డీల కాలపరిమితి తక్కువగా ఉండటం వల్ల, అవసరమైతే మెరుగైన రాబడులు ఇచ్చే ఇతర పెట్టుబడి అవకాశాలకు తమ డబ్బును మళ్లించే వెసులుబాటు కూడా ఉంటుంది.
ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీలలో..
పలు బ్యాంకులు సీనియర్ సిటిజన్ల కోసం సాధారణ కస్టమర్లతో పోలిస్తే అదనంగా 0.5 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి. నిర్దిష్ట నిబంధనలను పాటిస్తే కొన్ని బ్యాంకులు సంవత్సరానికి 8.05 శాతం వరకు వడ్డీని కూడా అందిస్తున్నాయి. ఈ వడ్డీ రేట్లు రూ.3 కోట్లలోపు విలువ ఉన్న ఎఫ్‌డీలకు వర్తిస్తాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో 3 నుంచి 5 సంవత్సరాల కాలపరిమితి ఉన్న ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్లకు 6.8 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. 5 నుంచి 10 సంవత్సరాల కాలపరిమితి ఉన్న టర్మ్ డిపాజిట్లపై ఎస్‌బీఐ వీ-కేర్ డిపాజిట్ స్కీమ్ కింద అదనంగా 50 బేసిస్ పాయింట్లతో కలిపి మొత్తం 7.05 శాతం వార్షిక వడ్డీని అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లో 4 సంవత్సరాల 7 నెలల 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు ఉన్న ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్లకు 6.9 శాతం వడ్డీ లభిస్తుంది. 5 సంవత్సరాలకు మించిన కాలపరిమితి ఉన్న టర్మ్ డిపాజిట్లపై సంవత్సరానికి 6.6 శాతం వడ్డీ ఇస్తోంది.
ఐసీఐసీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్..
ఐసీఐసీఐ బ్యాంక్ లో 3 సంవత్సరాల 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు ఉన్న ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్లు గరిష్ఠంగా 7.1 శాతం వార్షిక వడ్డీ పొందవచ్చు. 5 సంవత్సరాలకు మించిన టర్మ్ డిపాజిట్లపై 7 శాతం వడ్డీ అందుతోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో 1,205 రోజుల నుంచి 5 సంవత్సరాల వరకు ఉన్న ఎఫ్‌డీలపై 6.85 శాతం వడ్డీ లభిస్తుంది. అదే కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.15 శాతం వడ్డీ అందిస్తున్నారు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 5 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 8.05 శాతం వడ్డీ అందిస్తోంది. సీనియర్ సిటిజన్ల కోసం పలు బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు అందిస్తున్న నేపథ్యంలో, ఫిక్స్‌డ్ డిపాజిట్లు మరోసారి ప్రజాదరణ పొందుతున్నాయి. అయితే పెట్టుబడి పెట్టే ముందు తమ ఆర్థిక అవసరాలు, పెట్టుబడి కాలపరిమితి, అందించే వడ్డీ రేట్లను పరిశీలించి తగిన ఎఫ్‌డీని ఎంచుకోవడం మంచిది.
సంబంధిత వార్తలు

Job Mela | ఐసీఐసీఐలో 250 రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు.. రేపు సంగారెడ్డిలో జాబ్‌మేళా..
ఆగస్టు 13, 2026

Pilot Rohith Reddy | పైలట్ రోహిత్‌రెడ్డికి షాక్.. చెక్ బౌన్స్ కేసులో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
ఆగస్టు 8, 2026

RBI | బ్యాంక్ డిపాజిట్లపై ఆర్బీఐ కొత్త రూల్.. ఇక అన్ని బ్రాంచ్‌ల్లో ఒకే వడ్డీ..
ఆగస్టు 1, 2026
తాజావార్తలు
- ●Sushmita Konidela | ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ - సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- ●Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.లక్ష ప్రైజ్‌మనీ.. ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్
- ●Meta | మెటా పాలసీలపై ఓవర్‌సైట్ బోర్డు కీలక సూచనలు.. కొత్త మార్గదర్శకాలు జారీ..
- ●BRSV | పాలిటెక్నిక్ కోర్సులను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర : గెల్లు శ్రీనివాస్ యాదవ్
- ●Talasani Srinivas Yadav | ముఖ్యమంత్రి నోటి దురద తగ్గించుకో : మాజీమంత్రి తలసాని
- ●Mahesh Goud | పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్

Sushmita Konidela | ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ - సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.లక్ష ప్రైజ్‌మనీ.. ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్

Meta | మెటా పాలసీలపై ఓవర్‌సైట్ బోర్డు కీలక సూచనలు.. కొత్త మార్గదర్శకాలు జారీ..

BRSV | పాలిటెక్నిక్ కోర్సులను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర : గెల్లు శ్రీనివాస్ యాదవ్



