Kalvakuntla Kavitha | తల్లి కాంగ్రెస్‌తోనే పోరాటం చేశాం.. ఈ పిల్ల కాంగ్రెస్ ఎంత..? : కల్వకుంట్ల కవిత
Kalvakuntla Kavitha | సింగరేణి బొగ్గు గనుల్లోకి ప్రతిపక్ష పార్టీలను రానివ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. కానీ తల్లి కాంగ్రెస్‌తోనే పోరాటం చేసి.. తెలంగాణను సాధించుకున్నాం. ఇప్పుడున్న ఈ పిల్ల కాంగ్రెస్ ఎంత? అని నిప్పులు చెరిగారు.
Kalvakuntla Kavitha | త్రినేత్ర.న్యూస్ : సింగరేణి బొగ్గు గనుల్లోకి ప్రతిపక్ష పార్టీలను రానివ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. కానీ తల్లి కాంగ్రెస్‌తోనే పోరాటం చేసి.. తెలంగాణను సాధించుకున్నాం. ఇప్పుడున్న ఈ పిల్ల కాంగ్రెస్ ఎంత? అని నిప్పులు చెరిగారు. ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఇజ్జత్ తీయటమే పనిగా పెట్టుకున్నాడని ధ్వజమెత్తారు. సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా గోదావరిఖని 11 ఇంక్లైన్ కార్మికులతో కవిత మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సింగరేణిలో కార్మికుల కష్టాలు తెలుసుకునేందుకు వస్తే మమ్మల్ని అడ్డుకుంటున్నారు. కార్మికులకు కనీస అవసరాలు తీర్చకుండా ప్రభుత్వం, ఆఫీసర్లు ఇబ్బంది పెడుతున్నారు. సింగరేణిని కాపాడేందుకు బీజేపీ ఎక్కువ బొగ్గు బ్లాకులు కేటాయించాలి. అండర్ గ్రౌండ్ మైనింగ్ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. కార్మికుల హక్కుల కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ పోరాటం చేస్తుంది. కార్మికులను కలిసేందుకు వస్తే గేట్లు బంద్ పెట్టి అడ్డుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీలను సింగరేణి కార్మికులు కలవద్దా? కార్మికులకు ఏ పార్టీ వారితోనైనా మాట్లాడే హక్కు ఉంది. కానీ సింగరేణి యాజమాన్యం పోలీసులను తీసుకొచ్చి మమ్మల్ని అడ్డుకుంటున్నారు. అసలు సింగరేణి క్యాంపస్‌లోకి పోలీసులే రావద్దు. కానీ వాళ్లను తీసుకొచ్చారంటే వీళ్లు ఎంత తప్పు చేసి ఉంటారు? అని కవిత నిలదీశారు.

ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, రాహుల్ గాంధీ కూడా ఎన్నికలకు ముందు సింగరేణి కార్మికులతో మీటింగ్‌లు పెట్టలేదా? మీ మాటలు నమ్మి కోల్ బెల్ట్ ప్రాంతంలో కాంగ్రెస్‌ను గెలిపించారు. కానీ మీరు గెలిచాక గ్లౌజ్‌లు, షూస్, మెషీన్లు ఏదీ నాణ్యత లేకుండా అయిపోయింది. గనుల్లోకి వెళ్లే కార్మికులకు కనీసం ఆక్సిజన్ కూడా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఏమైనా అడిగితే గత ప్రభుత్వం మీద నెట్టేసి డబ్బులు లేవు అంటున్నారు. సింగరేణి కార్మికులకు మాట ఇచ్చే ముందు ఇవ్వన్నీ మీకు తెలియవా? కనీసం నీళ్లు, గాలి ఇచ్చే సోయి కూడా లేదు. ప్రాథమిక సౌకర్యాలు కూడా ఇవ్వటం లేదు. సింగరేణిలో రాజకీయ జోక్యం ఎక్కువ కావటంతోనే చిన్న చిన్న సౌకర్యాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. వీటన్నింటినీ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. నాది ప్రశ్నించే తత్వం. నేను 20 ఏళ్లుగా సింగరేణి కార్మికులతో కలిసి పనిచేస్తున్నానని కవిత తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో అగ్గిరాజేసి రాష్ట్రం సాధించుకున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కూడా కేసీఆర్‌తో మాట్లాడి మీ కోసం పనిచేశా. ముఖ్యంగా డిపెండెంట్ ఉద్యోగాల కోసం నేను చేసిన పోరాటంతో 19 వేల ఉద్యోగాలు నడుచుకుంటూ వచ్చాయి. మహిళలకు సింగరేణిలో ఉద్యోగాలు వచ్చేలా చేశాం. నేను ఎప్పటికీ సింగరేణి బిడ్డనే. ఎక్కడున్న కార్మికుల కోసమే కొట్లాడుతా. సింగరేణి కార్మికులను ఆఫీసర్లు ఇబ్బంది పెడుతుండటం చాలా బాధాకరం. ఆఫీసర్లకే తమ హక్కులు కాపాడుకునేందుకు యూనియన్లు ఉన్నాయి. అలాంటిది కార్మికులకు తమ హక్కులు కాపాడుకోవటానికి యూనియన్లు ఉండొద్దా? కార్మికులను ఇబ్బంది పెట్టవద్దని...చిన్న వాటికే మెమోలు అంటూ పరేషాన్ చేయవద్దని రిక్వెస్ట్ చేస్తున్నా. వన్ విజన్ అన్నట్లుగా ఉండాలి. కానీ ఇక్కడ రెండు విజన్లు అన్నట్లుగా పనిచేస్తున్నారు. మీ కారణంగా మైన్‌లో కార్మికులు సంతోషంగా లేరు. ఆఫీసర్లు మానవీయకోణంలో ఆలోచించాలి. డిజీల్ కుంభకోణంలో పైన ఉన్న పెద్దవాళ్లు చిన్న ఆఫీసర్లను ఇబ్బంది పెడితే రియాజ్ నేనే వాళ్ల హక్కుల కోసం పోరాటం చేశాం. కార్మికుల హక్కులు, వారికిచ్చే సౌకర్యాలు, భద్రత కోసం ఆఫీసర్లే తమపై అధికారులతో కొట్లాడాలి. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్లు మనల్ని రానివ్వొద్దని ప్రయత్నం చేస్తున్నారు అని కవిత మండిపడ్డారు.

మొన్నటికీ మొన్న నేను హిట్లర్ లాంటి వాడినంటూ గొప్పగా చెప్పుకుంటున్నాడు. అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత బేలగా మాట్లాడుతాడా? ఆయన బేలా మాటల కారణంగానే ఆంధ్రాలో ఉండే నాయకులు మనపై పెత్తనం చెలాయించేందుకు మళ్లీ కుట్రలు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు చేస్తే 11రోజులు అన్నం తినలేదన్న పవన్ కళ్యాణ్ మళ్లీ తెలంగాణలో రాజకీయాలు చేస్తాడంట. వాళ్లను మనం అడ్డుకుంటున్నామంట. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ పవన్ కళ్యాణ్ వారంలో మూడు రోజులు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. మన ముఖ్యమంత్రి బేలగా మాట్లాడుతుంటే పక్క రాష్ట్రం వాళ్లు పెత్తనం కోసం వస్తున్నారు. అందుకే మన సంపద మనం కాపాడుకునేందుకు మనమంతా మేలుకోవాలి అని కవిత సూచించారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ సింగరేణికి కొత్త బ్లాక్‌లు ఇవ్వాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మూసుకుపోతున్న అండర్ గ్రౌండ్ మైనింగ్‌ను తెరవాలి. బొగ్గు బ్లాక్‌లలో షాప్ట్ వేస్తే అవి ఇంకొక 50 ఏళ్ల వరకు నడుస్తాయి. ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటే కుదరదు. అండర్ గ్రౌండ్ మైనింగ్ చేయాల్సిందే. అండర్ గ్రౌండ్ మైనింగ్ కారణంగా పర్యావరణ పరిరక్షణతో పాటు వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. సింగరేణి కార్మికులకు కష్టాలపై మాట్లాడాల్సిన ఏఐటీయూసీ మౌనంగా ఉంది. సింగరేణి డబ్బులతో నిర్మించిన మెడికల్ కాలేజ్ లో 25 శాతం సీట్లు కార్మికుల పిల్లలకు ఇవ్వాలి. కానీ ఐదు శాతం కూడా ఇవ్వటం లేదు. దీనిపై ఏఐటీయూసీ నేతలు మాట్లాడటం లేదు. సింగరేణి కార్మికుల పిల్లలు చదువుకునేందుకు మంచి స్కూల్స్ ఏర్పాటు చేయాలి. సింగరేణిని కాపాడటమే మా ప్రథమ కర్తవ్యం. మా ట్రేడ్ యూనియన్ హెచ్ఎంఎస్. రకరకాల కారణాలతో నేను కొత్తగా పార్టీ పెట్టాల్సి వచ్చింది. మా పార్టీకి మీ ఆశీర్వాదం కావాలని బాయిబాట కార్యక్రమం ద్వారా ఇక్కడకు వచ్చాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు మీ మద్దతు కావాలని వచ్చాను. మీరు కష్టంలో ఉన్నప్పుడు నేను మీకోసం పోరాటం చేస్తాను. మిమ్మల్ని ఆఫీసర్లు ఇబ్బంది పెడితే ఒక్క ఫోన్ చేయండి. మేము వచ్చి మీకోసం పోరాటం చేస్తామని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●Pavel Durov Reliance | భారత్‌లో టెలిగ్రామ్ బ్యాన్పై రిలయన్స్, వాట్సప్ కుట్ర! సీఈఓ సంచలన ఆరోపణలు.. అసలు నిజమేంటి?
- ●TG Weather | తెలంగాణలో నాలుగురోజులు వడగాలులు, వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..
- ●Ponguleti Srinivasa Reddy | రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు.. గుడిసెల వాసులకే తొలి ప్రాధాన్యత : మంత్రి పొంగులేటి
- ●Donald Trump Iran Deal | మళ్లీ బాంబులు వేస్తాం.. ఇరాన్‌తో డీల్ ఇంకా ఫైనల్ కాలేదు: జీ7 సమ్మిట్‌లో డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
- ●Gellu Srinivas Yadav | 'మన ఊరు - మన బడి' కిందనే 'ఆరుట్ల స్కూల్' అభివృద్ధి.. సీఎం రేవంత్‌కు గెల్లు శ్రీనివాస్ కౌంటర్
- ●Pizza Hut | అమ్మకానికి పిజ్జా హట్.. 2.7 బిలియన్ డాలర్లకు విక్రయించేందుకు డీల్..!

Pavel Durov Reliance | భారత్‌లో టెలిగ్రామ్ బ్యాన్పై రిలయన్స్, వాట్సప్ కుట్ర! సీఈఓ సంచలన ఆరోపణలు.. అసలు నిజమేంటి?

TG Weather | తెలంగాణలో నాలుగురోజులు వడగాలులు, వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..

Ponguleti Srinivasa Reddy | రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు.. గుడిసెల వాసులకే తొలి ప్రాధాన్యత : మంత్రి పొంగులేటి

Donald Trump Iran Deal | మళ్లీ బాంబులు వేస్తాం.. ఇరాన్‌తో డీల్ ఇంకా ఫైనల్ కాలేదు: జీ7 సమ్మిట్‌లో డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్






