త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kiara Advani | రెండు సినిమాలు డిజాస్ట‌ర్ – అయినా మూడోసారి బాలీవుడ్ హీరోయిన్‌కు ఛాన్స్ ఇచ్చిన రామ్‌చ‌ర‌ణ్‌

విన‌య‌విధేయ రామ‌, గేమ్ ఛేంజ‌ర్ డిజాస్ట‌ర్స్ త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్, కియారా అద్వానీ కాంబినేష‌న్‌లో మ‌రో తెలుగు సినిమా రాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమాలో హీరోయిన్‌గా ఈ బాలీవుడ్ బ్యూటీ క‌న్ఫామ్ అయిన‌ట్లు స‌మాచారం

N

Entertainment | Published On Jul 2, 2026, 12.50 pm IST

Kiara Advani | రెండు సినిమాలు డిజాస్ట‌ర్ – అయినా మూడోసారి బాలీవుడ్ హీరోయిన్‌కు ఛాన్స్ ఇచ్చిన రామ్‌చ‌ర‌ణ్‌
Advertisement

Kiara Advani | టాలీవుడ్‌లో రామ్‌చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ కాంబినేష‌న్ అచ్చిరాలేదు. ఈ బాలీవుడ్ బ్యూటీతో రామ్‌చ‌ర‌ణ్ విన‌య‌విధేయ‌రామ‌తో పాటు గేమ్ ఛేంజ‌ర్ సినిమాలు చేశాడు. భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ రెండు సినిమాలు డిజాస్ట‌ర్స్‌గా నిలిచాయి. ఈ రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండా మూడోసారి ఈ జోడీ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్లు స‌మాచారం.

స్టైలిష్ యాక్ష‌న్‌...

పెద్ది త‌ర్వాత స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు రామ్‌చ‌ర‌ణ్. ఈ మెగా హీరో గ‌త సినిమాల‌కు భిన్నంగా స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ రూపొంద‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్ సినిమాల‌కు సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతోన్నాయి. ఆగ‌స్ట్ లేదా సెప్టెంబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం.

ర‌ష్మిక‌....కృతి అనుకొని...

కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీ క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కృతి స‌న‌న్‌, ర‌ష్మిక మంద‌న్న‌తో పాటు ప‌లువురు అగ్ర‌నాయిక‌ల పేర్ల‌ను ప‌రిశీలించిన మేక‌ర్స్ చివ‌ర‌కు కియారాను ఫైన‌ల్ చేశార‌ట‌. ఇప్ప‌టివ‌ర‌కు చేసిన తెలుగు సినిమాల్లో ట్రెడిష‌న‌ల్ రోల్‌లో క‌నిపించిన ఈ బాలీవుడ్ బ్యూటీ రామ్‌చ‌ర‌ణ్ సినిమాలో మాత్రం బోల్డ్ క్యారెక్ట‌ర్ చేస్తోన్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాతోనైనా చ‌ర‌ణ్‌, కియారా జోడీకి హిట్టు ద‌క్కుతుందా? లేదా? అన్న‌ది టాలీవుడ్ ఫ్యాన్స్‌లో ఆస‌క్తిక‌రంగా మారింది. పుష్ప, పుష్ప 2 బ్లాక్‌బ‌స్ట‌ర్స్ త‌ర్వాత సుకుమార్ తెర‌కెక్కిస్తోన్నసినిమా కావ‌డంతో షూటింగ్ మొద‌లుకాక‌ముందే తెలుగు నాట ఈ సినిమాపై భారీగా హైప్ ఏర్ప‌డింది. రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తోన్న 17వ సినిమా ఇది.

టాక్సిక్‌లో...

ప్ర‌స్తుతం య‌శ్ టాక్సిక్‌లో ఓ క‌థానాయిక‌గా కియారా అద్వానీ క‌నిపించ‌బోతుంది. ఈ పీరియాడిక‌ల్ గ్యాంగ్‌స్ట‌ర్ మూవీతోనే క‌న్న‌డ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఇటీవ‌ల రిలీజైన టీజ‌ర్‌తో పాటు స్పెష‌ల్ గ్లింప్స్‌లో య‌శ్‌, కియారా ఇంటిమేట్‌, బోల్డ్ సీన్లు వైర‌ల్ అయ్యాయి.

క్రాస్ ఓవ‌ర్ అథ్లెట్‌...

కాగా పెద్ది మూవీ రామ్‌చ‌ర‌ణ్‌ను న‌టుడిగా మ‌రో మెట్టు ఎక్కించింది. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాలో క్రాస్ ఓవ‌ర్ అథ్లెట్ పాత్ర‌లో చ‌ర‌ణ్  అసమాన నటనతో అద‌ర‌గొట్టాడు. నిజాయితీతో కూడిన మంచి ప్ర‌య‌త్నంగా పెద్ది సినిమాకు పేరొచ్చిన క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చిపెట్ట‌లేక‌పోయింది.

.

Advertisement
Advertisement