Harish Rao | అవినీతి చేయకుంటే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు..? : హరీశ్ రావు
Harish Rao | గురుకులాల్లో(Gurukulala tenders) అవినీతిపై చర్చకు మంత్రుల ఆహ్వానం మేరకు గన్‌పార్క్ బయలు దేరిన హరీశ్ రావు (Harish Rao), బీఆర్ఎస్ నాయకుల బృందాన్ని తెలంగాణ భవన్ (Telangana Bhavan) వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
Harish Rao | గురుకులాల్లో(Gurukulala tenders) అవినీతిపై చర్చకు మంత్రుల ఆహ్వానం మేరకు గన్‌పార్క్ బయలు దేరిన హరీశ్ రావు (Harish Rao), బీఆర్ఎస్ నాయకుల బృందాన్ని తెలంగాణ భవన్ (Telangana Bhavan) వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో హరీశ్ రావు కిందపడిపోయారు. దీంతో పోలీసుల తీరుపై బీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసుల తీరును నిరసిస్తూ హరీశ్ రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ భవన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు హరీశ్ రావుతోపాటూ బీఆర్ఎస్ నాయకులను డీసీఎం వ్యానులోకి ఎక్కించి పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్నారు. అయితే, వారిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా సిటీ మొత్తం తిప్పుతున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు పోలీసు వాహనాన్ని ఫాలో అవుతూ వెళ్తున్నారు. హరీశ్ రావును ఎక్కడకు తీసుకెళ్తే అక్కడ వరకు వెంటే వస్తాం అంటూ నినాదాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా పోలీసుల తీరుపై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖలో అవినీతిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం అవినీతి చేయకుంటే తమను ఎందుకు ఆపుతోందంటూ నిలదీశారు. చర్చకురమ్మన్న మంత్రులు ఎక్కడ..? అంటూ ప్రశ్నించారు. వాళ్ల ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ వస్తున్నాయన్నారు. పోలీసులను అడ్డంపెట్టుకుని తమను ఆపినా తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని హరీశ్ రావు తేల్చి చెప్పారు. మీడియా సాక్షిగా రాష్ట్ర ప్రజల ముందు వీళ్ల బండారం బట్టబయలు చేస్తామంటూ సవాల్ విసిరారు.

Also Read..
సీనియర్ సిటిజన్లకు ఎఫ్‌డీలపై 8 శాతం వరకు వడ్డీ.. ఏ బ్యాంక్ ఎంత ఇస్తోంది..?
ఏఐ యూజర్లకు గుడ్ న్యూస్.. క్లాడ్ ఫేబుల్, మైథోస్ తిరిగి అందుబాటులోకి..
సంబంధిత వార్తలు

MLA Sudheer Reddy | మేం టిమ్స్‌కు వెళ్తే డొల్లతనం బయటపడుతుందని భయం.. అందుకే అడ్డుకుంటున్నరు
ఆగస్టు 19, 2026

Harish Rao | బీఆర్ఎస్ నేతల సనత్‌నగర్ టిమ్స్ సందర్శన.. హరీశ్ రావు, తలసాని హౌస్ అరెస్ట్..
ఆగస్టు 19, 2026

Danam Nagender | బీఆర్ఎస్కి రాజీనామా చేయలే.. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలే: దానం నాగేందర్
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●MLA Sudheer Reddy | మేం టిమ్స్‌కు వెళ్తే డొల్లతనం బయటపడుతుందని భయం.. అందుకే అడ్డుకుంటున్నరు
- ●NEET System | నీట్ పరీక్షా విధానం అత్యంత సురక్షితం.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం
- ●Income Tax Department | అనుమానాస్పద విదేశీ నగదు బదిలీలపై ఐటీ శాఖ నజర్
- ●Principal Murdered | ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో సంచలన నిజాలు.. 27 సార్లు కత్తితో పొడిచి చంపిన టెన్త్ విద్యార్థులు
- ●Stray Dogs | వీధికుక్కల సమస్యపై వినూత్న నిరసన.. కుక్క ముఖంతో ప్రజావాణికి వచ్చిన వ్యక్తి
- ●BPCL | పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. రూ.5వేల కోట్లకు బీపీసీఎల్ డిబెంచర్లు..

MLA Sudheer Reddy | మేం టిమ్స్‌కు వెళ్తే డొల్లతనం బయటపడుతుందని భయం.. అందుకే అడ్డుకుంటున్నరు

NEET System | నీట్ పరీక్షా విధానం అత్యంత సురక్షితం.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

Income Tax Department | అనుమానాస్పద విదేశీ నగదు బదిలీలపై ఐటీ శాఖ నజర్

Principal Murdered | ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో సంచలన నిజాలు.. 27 సార్లు కత్తితో పొడిచి చంపిన టెన్త్ విద్యార్థులు



