త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dell Alienware 15 | డెల్ నుంచి కొత్త ఏలియన్‌వేర్ 15 ల్యాప్‌టాప్‌.. కంటెంట్ క్రియేట‌ర్లు, గేమర్లకు బెస్ట్ ఫీచ‌ర్లు..

Dell Alienware 15 | డెల్ టెక్నాలజీస్, ఏలియన్‌వేర్ కలిసి భారత మార్కెట్‌లో కొత్త ఏలియన్‌వేర్ 15 గేమింగ్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేశాయి. ఈ కొత్త మోడల్‌తో తొలిసారిగా భారత్‌లో మరింత విస్తృతమైన వినియోగదారులకు ఏలియన్‌వేర్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

S

Technology | Published On Jul 2, 2026, 1.25 pm IST

Dell Alienware 15 | డెల్ నుంచి కొత్త ఏలియన్‌వేర్ 15 ల్యాప్‌టాప్‌.. కంటెంట్ క్రియేట‌ర్లు, గేమర్లకు బెస్ట్ ఫీచ‌ర్లు..
Advertisement

Dell Alienware 15 | డెల్ టెక్నాలజీస్, ఏలియన్‌వేర్ కలిసి భారత మార్కెట్‌లో కొత్త ఏలియన్‌వేర్ 15 గేమింగ్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేశాయి. ఈ కొత్త మోడల్‌తో తొలిసారిగా భారత్‌లో మరింత విస్తృతమైన వినియోగదారులకు ఏలియన్‌వేర్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ల్యాప్‌టాప్‌లో ఏఎండీ రైజన్ 7 260, ఏఎండీ రైజన్ 5 220 ప్రాసెసర్లు అందుబాటులో ఉండగా, ఎన్‌విడియా జీఫోర్స్ ఆర్‌టీఎక్స్ 3050, ఆర్‌టీఎక్స్ 4050 గ్రాఫిక్స్ కార్డులతో అందుబాటులో ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లో 15.3 ఇంచుల డబ్ల్యూయూఎక్స్‌జీఏ డిస్‌ప్లేను అందించారు. ఇందులో 165 హెడ్జ్‌ రిఫ్రెష్ రేట్, 300 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. అలాగే 720పి వెబ్‌క్యామ్, డ్యుయల్ అరే మైక్రోఫోన్ సెటప్, వైట్ బ్యాక్‌లిట్ కీబోర్డ్, ఇంటిగ్రేటెడ్ స్క్రోలింగ్ సపోర్ట్ క‌లిగిన మల్టీటచ్ జెశ్చర్ టచ్‌ప్యాడ్‌ను కూడా ఇచ్చారు. ఈ ల్యాప్‌టాప్ నోవా బ్లాక్ ఫినిష్‌తో, పాలీకార్బోనేట్ రెసిన్ ఛాసిస్‌తో డిజైన్ అయింది. ఫ్లూయిడ్ కాంటూర్స్, వీ-రైల్ స్ట్రక్చర్, 180 డిగ్రీల హింజ్ డిజైన్ కారణంగా గేమింగ్‌తోపాటు ఎడ్యుకేష‌న్‌, సాధారణ కంప్యూటింగ్ అవసరాలకు కూడా అనువుగా ఉంటుంది. మన్నిక పరంగా కూడా దీనిని పరీక్షించారు. ప్రమాదవశాత్తు 60 మిల్లీలీటర్ల వరకు ద్రవం పడినా తట్టుకునేలా, అన్ని వైపులా, మూలలపై 18 ఇంచుల ఎత్తు నుంచి పడినా పనిచేసేలా డ్యూరబిలిటీ టెస్టులు నిర్వహించినట్లు కంపెనీ వెల్లడించింది.

ఫ్యాన్ శ‌బ్దాన్ని త‌గ్గించే స్టెల్త్ మోడ్‌..

ఉష్ణోగ్రత నియంత్రణ కోసం ఇందులో ఏలియన్‌వేర్ క్రయో-టెక్ థర్మల్ సిస్టమ్‌ను ఉపయోగించారు. కీబోర్డ్ పైన, కింద భాగాల్లో ఇంటేక్ వెంట్స్, ప్రత్యేక ఎగ్జాస్ట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో గేమింగ్, స్ట్రీమింగ్, మల్టీటాస్కింగ్ సమయంలో కూడా స్థిరమైన పనితీరును అందించడంతోపాటు హార్డ్‌వేర్ విశ్వసనీయతను కొనసాగించేలా ప‌నిచేస్తుంది. అలాగే స్టెల్త్ మోడ్ ఫీచర్ కూడా ఉంది. ఇది అవసరమైనప్పుడు పర్‌ఫార్మెన్స్ మోడ్ నుంచి క్వయెట్ మోడ్‌కు మారి ఫ్యాన్ శబ్దాన్ని తగ్గిస్తుంది. భారత్‌లో ఏలియన్‌వేర్ 15 ప్రారంభ ధరను రూ.1,15,990గా నిర్ణయించారు. ఈ ల్యాప్‌టాప్ ను డెల్ ఇండియా ఆన్ లైన్ స్టోర్‌తోపాటు డెల్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్ర‌యిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌, ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్‌ల‌లో ఈ ల్యాప్‌టాప్‌పై త‌గ్గింపు ధ‌ర‌లు, ఆఫ‌ర్ల‌ను ఇవ్వ‌నున్నారు. అలాగే ఇంటెల్ కోర్ 7 ప్రాసెస‌ర్‌, ఎన్‌విడియా జిఫోర్స్ ఆర్టీఎక్స్ 5060 గ్రాఫిక్ కార్డు కలిగిన హై ఎండ్ వేరియెంట్ల‌ను కూడా ఈ నెల‌లో రిలీజ్ చేయ‌నున్న‌ట్లు కంపెనీ తెలిపింది.

బ్యాంకు ఆఫ‌ర్లు సైతం..

ఈ ల్యాప్ టాప్‌కు గాను గురువారం నుంచే ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై గరిష్టంగా రూ.10వేల వరకు లేదా 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. జీరో డౌన్ పేమెంట్ ఫైనాన్సింగ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డులపై 12 నెలలు, 24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని అందిస్తున్నారు. అలాగే రూ.22,632 విలువైన ఏలియన్‌వేర్ 25 ఇంచుల‌ 320 హెడ్జ్‌ గేమింగ్ మానిటర్ ను ప్రత్యేక ఆఫర్‌లో కేవలం రూ.9,999కే కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు. మ‌రిన్ని వివ‌రాల‌కు డెల్ ఇండియా సైట్‌ను లేదా డెల్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ల‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

Advertisement
Advertisement