Hyderabad | గృహప్రవేశం జరిగిన ఇంటిపై దుండగుల దాడి..
Hyderabad | వారికి కొత్తింట్లోకి పోయామన్న సంతోషం కొద్ది సేపు కూడా లేకుండా పోయింది. బంధువులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండగా దుండగులు ఆ ఇంటిపై దాడి (attack) చేశారు. కనిపించిన ప్రతిఒక్కరిని చితకబాదారు.
Hyderabad | త్రినేత్ర.న్యూస్: వారికి కొత్తింట్లోకి పోయామన్న సంతోషం కొద్ది సేపు కూడా లేకుండా పోయింది. బంధువులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండగా దుండగులు ఆ ఇంటిపై దాడి (Attack) చేశారు. కనిపించిన ప్రతిఒక్కరిని చితకబాదారు. దీంతో అప్పటికరకు జోష్‌లో ఉన్న ఆ ఇంట్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని (Hyderabad) జిల్లాలోని బోడుప్పల్‌లో (Boduppal) చోటుచేసుకున్నది.
బోడుప్పల్ పరిధిలోని దేవేందర్ నగర్ కాలనీలో నూతనంగా గృహప్రవేశం చేసిన కుటుంబంపై కొందరు మూకుమ్మడిగా దాడి చేశారు. సుమారు 40 నుంచి 50 మంది వ్యక్తులు ఇంట్లోకి చొరబడి మహిళలు, చిన్నారులు, వృద్ధులని చూడకుండా విరుచుకుపడ్డారు. కర్రలు, రాళ్లతో విచక్షణరహితంగా దాడి చేశారు. గృహప్రవేశానికి వచ్చిన బంధువులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Argentina vs Jordan | అర్జెంటినా హ్యాట్రిక్
- ●Nitin Nabin | తెలంగాణపై బీజేపీ అధిష్ఠానం ఫోకస్.. మూడు రోజులు రాష్ట్రంలోనే నితిన్ నబీన్
- ●పోర్చుగల్-కొలంబియా మ్యాచ్ డ్రా
- ●Forest Officer | జింకకు పోహా తినిపించిన అటవీ అధికారి.. సస్పెండ్.. వీడియో
- ●Croatia vs Ghana | నాకౌట్లోకి క్రొయేషియా
- ●Kaddu Ki Kheer | పెండ్లి వేడుకలో మిగిలిన పాయసం తిని.. 30 మందికి అస్వస్థత










