Gas Cylinders | 15 రోజులుగా బుక్ కాని గ్యాస్.. షేక్‌పేటలో ఆటోలో నుంచి సిలిండర్లు ఎత్తుకెళ్లిన జనం
Gas Cylinders | రాష్ట్రంలో ఇంధన కొరత ఏర్పడింది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్లపై (Gas Cylinders) ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై భయాందోళనలతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూకడుతున్నారు.
Gas Cylinders | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో ఇంధన కొరత ఏర్పడింది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్లపై (Gas Cylinders) ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై భయాందోళనలతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూకడుతున్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ దొరకదన్న భయంతో ప్రజలు బంకుల వద్ద బారులు తీరుతున్నారు. తాజాగా గృహవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పెంచింది. డిమాండ్ తగినట్లుగా ఎల్పీజీ సిలిండర్లను పంపిణీ చేయకపోతుండటంతో వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్ద ఆందోళనకు దిగుతున్నారు.
హైదరాబాద్ (Hyderabad) షేక్‌పేటలోని (shaikpet) వివేకానంద నగరల్‌లో ఉన్న మాధవి గ్యాస్ ఏజెన్సీ సిబ్బందిపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 15 రోజులుగా గ్యాస్ బుక్ కావడంలేదని ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీ సిబ్బంది ఒక వాహనంలో నుంచి మరో వాహనంలోకి ఎల్పీజీ సిలిండర్లను ఎక్కిస్తుండగా.. వాటిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అయినప్పటికీ వినియోగదారులు వెనక్కి తగ్గకపోవడంతో ఏజెన్సీకి చెందిన వ్యక్తి బండరాయితో హల్‌చల్ చేశాడు. రాయితో కొడతానంటూ వినియోగదారులపై దాడికి యత్నించాడు. దీనిని అక్కడే ఉన్నవారు తమ ఫోన్లలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
పెట్రోల్ బంకుల వద్ద జనం క్యూ..
కాగా, హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ దొరకదన్న భయంతో ప్రజలు బంకుల (petrol pumps) వద్దకు పరుగులు తీస్తున్నారు. దీంతో కిలోమీటర్ల మేర క్యూలు దర్శనమిస్తున్నాయి. కొందరైతే ఏకంగా పెద్ద పెద్ద క్యాన్‌లకు పెట్రోల్ నింపుకుని వెళ్తున్నారు. అదే సమయంలో నగరంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం రాత్రి నుంచే నగరంలోని దాదాపు అన్ని పెట్రోల్ బంకుల వద్ద ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ ఉదయం కూడా ఆఫీసులకు వెళ్లే వాళ్లు (employees) ఉదయం నుంచే పెట్రోల్ కోసం పరుగులు తీస్తున్నారు.
రాష్ట్రంలో ఇంధన కొరత లేదు..
ఈ నేపథ్యంలో పెట్రోల్ కొరత రాబోతుంది అంటూ ప్రచారం.. బంకుల దగ్గర వాహనాల రద్దీ పెరగడంపై తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో ఇంధన కొరత లేదని స్పష్టం చేసింది తప్పుడు వార్తలతో ప్రజలు ఆందోళనతో బంకులకు వస్తున్నారని.. దీనివల్ల విక్రయాలు సాధారణం కంటే 2.5 నుంచి 3 రెట్లు పెరిగినట్లు తెలిపింది. విపరీతమైన రద్దీ వల్ల కొన్ని చోట్ల తాత్కాలికంగా నిల్వలు అయిపోతున్నాయని.. వాస్తవంగా ఎలాంటి ఇంధన కొరత లేదని ప్రకటించింది. HPCL, IOCL, BPCL పెట్రోలియం కంపెనీల్లో సరిపడా నిలువలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రజలకు కొన్ని సూచనలు చేసింది ఆందోళనతో ఫుల్ ట్యాంక్ చేయించకుండా.. అవసరాలకు తగ్గట్టుగానే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయమని సూచించింది. క్యాన్లు, డ్రమ్ముల్లో పెట్రోల్, డీజిల్ కొని స్టాక్ పెట్టుకోవద్దని, అవసరానికి తగ్గట్టు పెట్రోల్ కొనుగోలు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
ఇవికూడా చదవండి..
హైదరాబాద్‌లో పెట్రోల్ బంక్‌ల వద్ద కిలోమీటర్ల మేర క్యూ.. ఆటోల బంద్‌తో ఉద్యోగుల అవస్థలు
రాజస్థాన్ రాయల్స్ అమ్మకం.. షేన్ వార్న్ కుటుంబానికి దక్కనున్న రూ.450 కోట్లు..
ఇంధన కొరత లేదు.. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన
సంబంధిత వార్తలు

Gas Cylinders | భారీ వర్షం.. వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన 3,000 ఎల్పీజీ సిలిండర్లు.. షాకింగ్ వీడియో
జులై 9, 2026

Student Missing | చదువుపై అయిష్టంతో కాలేజీ నుంచి విద్యార్థిని అదృశ్యం.. మూడు రోజులపాటు ఉచిత బస్సులో చక్కర్లు..
జులై 9, 2026

HPCL | హెచ్పీసీఎల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. డిప్లొమా, డిగ్రీ అర్హత
జులై 9, 2026
తాజావార్తలు
- ●BSNL | శాటిలైట్ ఫోన్ సేవలను ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్.. ఇప్పుడు ఎవరైనా కొనవచ్చు.. ధర ఎంతంటే..?
- ●Vaddiraju Ravichandra | బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపీ వద్దిరాజు.. నియమించిన కేసీఆర్
- ●Meta Muse Image | మెటా మ్యూస్ ఇమేజ్ వచ్చేసింది.. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏఐతో ఫొటోలకు కొత్త రూపం..
- ●Konda Surekha | కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోండి... పీసీసీ చీఫ్ మహేశ్‌కు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు
- ●Koppula Eshwar | తాడిచర్ల బ్లాక్‌ను సింగరేణియే గుర్తించింది.. కాంగ్రెస్, బీజేపీలు గొప్పలు చెప్తుంటే నవ్వొస్తుంది
- ●Chamala Kiran Kumar Reddy | పదవుల కోసం రోడ్డెక్కి కొట్టుకుంటే.. ప్రజల్లో చులకనౌతాం: ఎంపీ చామల

BSNL | శాటిలైట్ ఫోన్ సేవలను ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్.. ఇప్పుడు ఎవరైనా కొనవచ్చు.. ధర ఎంతంటే..?

Vaddiraju Ravichandra | బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపీ వద్దిరాజు.. నియమించిన కేసీఆర్

Meta Muse Image | మెటా మ్యూస్ ఇమేజ్ వచ్చేసింది.. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏఐతో ఫొటోలకు కొత్త రూపం..

Konda Surekha | కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోండి... పీసీసీ చీఫ్ మహేశ్‌కు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు



