Hyderabad | హైదరాబాద్‌లో పెట్రోల్ బంక్‌ల వద్ద కిలోమీటర్ల మేర క్యూ.. ఆటోల బంద్‌తో ఉద్యోగుల అవస్థలు
Hyderabad | ఇరాన్ యుద్ధం భారత్‌లో లాక్‌డౌన్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. హైదరాబాద్ (Hyderabad)లో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది.
Hyderabad | ఇరాన్ యుద్ధం భారత్‌లో లాక్‌డౌన్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. హైదరాబాద్ (Hyderabad)లో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. పెట్రోల్, డీజిల్ దొరకదన్న భయంతో ప్రజలు బంకుల (petrol pumps) వద్దకు పరుగులు తీస్తున్నారు. దీంతో కిలోమీటర్ల మేర క్యూలు దర్శనమిస్తున్నాయి. కొందరైతే ఏకంగా పెద్ద పెద్ద క్యాన్‌లకు పెట్రోల్ నింపుకుని వెళ్తున్నారు. అదే సమయంలో నగరంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
మంగళవారం రాత్రి నుంచే నగరంలోని దాదాపు అన్ని పెట్రోల్ బంకుల వద్ద ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ ఉదయం కూడా ఆఫీసులకు వెళ్లే వాళ్లు (employees) ఉదయం నుంచే పెట్రోల్ కోసం పరుగులు తీస్తున్నారు. మరోవైపు ఇంధనం దొరక్క నగరంలోని పలు ప్రాంతాల్లో ఆటోలు కూడా బంద్ అయ్యాయి. ఫలితంగా ఉదయం ఆఫీసుకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సుల వెంట పరుగులు తీయాల్సిన పరిస్థితి. అదే సమయంలో బస్సులు కూడా ఫుల్‌గా ఉండటంతో ఉద్యోగులకు తిప్పలు తప్పడం లేదు. దీంతో సామాన్యులు మళ్లీ లాక్‌డౌన్ పరిస్థితులను గుర్తు చేసుకుంటున్నారు.
ట్రెండింగ్‌లో లాక్‌డౌన్
మరోవైపు ప్రస్తుతం సోషల్ మీడియాలో లాక్‌డౌన్ ఇండియా ట్రెండింగ్‌లో ఉంది. గూగుల్ సెర్చింగ్‌లో కూడా లాక్‌డౌన్ ఇన్ ఇండియా తొలి స్థానంలో నిలిచింది. లోక్‌సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రసంగిస్తూ.. మనం కరోనా పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ హింట్ ఇవ్వడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. స్వయంగా ప్రధాన మంత్రే పార్లమెంట్ సాక్షిగా ఇలా మాట్లాడటం ప్రజల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది. మళ్లీ లాక్‌డౌన్ తప్పదా అన్న భయాలు నెలకొంటున్నాయి.
Also Read..
సంబంధిత వార్తలు

Musi | మూసీ రివర్‌ఫ్రంట్‌కు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతి.. మొదటి దశలో 21 కి.మీ పనులు
జులై 9, 2026

PM Modi | భారత్‌కు ఆస్ట్రేలియా యురేనియం సరఫరా చేస్తుంది : ప్రధాని మోదీ
జులై 9, 2026

Student Missing | చదువుపై అయిష్టంతో కాలేజీ నుంచి విద్యార్థిని అదృశ్యం.. మూడు రోజులపాటు ఉచిత బస్సులో చక్కర్లు..
జులై 9, 2026
తాజావార్తలు
- ●Karnataka | లారీని ఢీకొట్టిన మినీ ట్రక్కు.. ఏడుగురు దుర్మరణం
- ●Musi | మూసీ రివర్‌ఫ్రంట్‌కు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతి.. మొదటి దశలో 21 కి.మీ పనులు
- ●Goat Milk | పిల్లలకు మేకపాలు మంచివేనా? వైద్యుల కీలక హెచ్చరిక..
- ●Earthquake | నాందేడ్‌లో స్వల్ప భూప్రకంపనలు.. తెలంగాణలోని ఆ జిల్లాల్లో కంపించిన భూమి
- ●Chabahar Port | భారత్‌కు షాక్.. ఇరాన్‌లోని చాబహార్ పోర్టుపై అమెరికా దాడులు
- ●Deepika Padukone | లగ్జరీలకే లక్షల్లో ఖర్చులు - కల్కి 2 నుంచి దీపికా పడుకోణ్ తప్పుకోవడంపై టాలీవుడ్ ప్రొడ్యూసర్ కామెంట్స్

Karnataka | లారీని ఢీకొట్టిన మినీ ట్రక్కు.. ఏడుగురు దుర్మరణం

Musi | మూసీ రివర్‌ఫ్రంట్‌కు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతి.. మొదటి దశలో 21 కి.మీ పనులు

Goat Milk | పిల్లలకు మేకపాలు మంచివేనా? వైద్యుల కీలక హెచ్చరిక..

Earthquake | నాందేడ్‌లో స్వల్ప భూప్రకంపనలు.. తెలంగాణలోని ఆ జిల్లాల్లో కంపించిన భూమి



