Vaddiraju Ravichandra | బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపీ వద్దిరాజు.. నియమించిన కేసీఆర్
Vaddiraju Ravichandra | రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra) బీఆర్ఎస్ (BRS) పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా (Parliamentary Leader) నియమితులయ్యారు.
Vaddiraju Ravichandra | త్రినేత్ర.న్యూస్: రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra) బీఆర్ఎస్ (BRS) పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా (Parliamentary Leader) నియమితులయ్యారు. ప్రస్తుతం పార్లమెంటరీ పార్టీ ఉప నేతగా వ్యవహరిస్తున్న రవిచంద్రను పార్టీ అధ్యక్షులు కేసీఆర్ (KCR) రాజ్యసభలో (Rajya Sabha) బీఆర్ఎస్ పక్ష నేతగా, పార్లమెంటరీ పార్టీ లీడర్‌గా నియమించారు. బీసీలతో పాటు బహుజనులు, పార్టీకి రవిచంద్ర అందిస్తున్న సేవలను గుర్తించిన కేసీఆర్ ఆయన్ను రెండో సారి రాజ్యసభకు నామినేట్ చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ శాసనమండలికి వెళ్లడంతో ఆ స్థానంలో రవిచంద్రను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండో సారి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు నలుగురు కేఆర్.సురేశ్ రెడ్డి, దీవకొండ దామోదర్ రావు, డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర ఎన్నికయ్యారు. పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న సురేష్ రెడ్డి ఇటీవల రిటైర్ అవడంతో.. ఆయన స్థానంలో రవిచంద్రను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నియమించారు. రవిచంద్ర పదవీ కాలం 2030 ఏప్రిల్ వరకు ఉంది. ఆయన పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయీ సంఘం, బొగ్గు, గనుల శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
కేసీఆర్, కేటీఆర్‌కు కృతజ్ఞతలు..
పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎంపిక చేసిన బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌కు (KTR) వద్దిరాజు రవిచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. బీసీ వర్గానికి చెందిన తనను రాజ్యసభకు రెండు పర్యాయాలు పంపడమే కాకుండా పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారే. తనపై ఉంచిన ఈ గురుతర బాధ్యతను వినమ్రంగా స్వీకరిస్తానని, తెలంగాణ ప్రజల గొంతును పార్లమెంటులో బలంగా వినిపిస్తానని చెప్పారు. పార్టీని మరింత శక్తివంతం చేసేందుకు, కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు శక్తివంచన లేకుండా తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.
సంబంధిత వార్తలు

Singireddy Niranjan Reddy | సిరిసిల్లలో రేవంత్ ప్రసంగం ఆత్మస్తుతి, పరనింద : హంతకుడే సంతాపం తెలిపినట్లుంది
సెప్టెంబర్ 30, 2026

CM Revanth Reddy | సిరిసిల్లలో గెలిపిస్తే ఢిల్లీని ఒప్పించి మంత్రిని చేస్తా : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సెప్టెంబర్ 30, 2026

CM Revanth Reddy | బీఆర్ఎస్ పాలనలో ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల
సెప్టెంబర్ 30, 2026
తాజావార్తలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర.. భారీ స్థాయిలో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు..
- ●SAIL Apprentices | సెయిల్‌లో 710 అప్రెంటిస్‌లు.. రాతపరీక్ష లేకుండానే..
- ●Captain Smit Machchhar | అతడు ఒక హీరో.. కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను కొనియాడిన ప్రధాని మోదీ
- ●Gas Cylinder Price | భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..
- ●University Men's Hostel | యూత్ కాంగ్రెస్, ఎస్ఎఫ్ఐ ఘర్షణ.. రణరంగంగా యూనివర్సిటీ మెన్స్ హాస్టల్
- ●Gandhi Jayanti | డ్రైడే.. రేపు మాంసం, మద్యం దుకాణాలు బంద్..

Stock Markets | స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర.. భారీ స్థాయిలో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు..

SAIL Apprentices | సెయిల్‌లో 710 అప్రెంటిస్‌లు.. రాతపరీక్ష లేకుండానే..

Captain Smit Machchhar | అతడు ఒక హీరో.. కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను కొనియాడిన ప్రధాని మోదీ

Gas Cylinder Price | భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..



