Gas Cylinders | భారీ వర్షం.. వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన 3,000 ఎల్పీజీ సిలిండర్లు.. షాకింగ్ వీడియో
Gas Cylinders | మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి హెచ్‌పీసీఎల్ (HPCL) పాతాళగంగ ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ (HPCL Patalganga LPG Bottling Plant) జలమయమైంది. ప్లాంట్‌లో ఉంచిన 3,000 గ్యాస్ సిలిండర్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి.
Gas Cylinders | పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా వంట గ్యాస్‌ను ప్రజలు చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నారు. గ్యాస్ సిలిండర్లను (Gas Cylinders) బంగారం కంటే జాగ్రత్తగా దాచుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మహారాష్ట్రలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఏకంగా 3వేల ఎల్పీజీ సిలిండర్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇందుకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మహారాష్ట్ర వ్యాప్తంగా గత కొంతకాలంగా కుండపోత వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాయ్‌గఢ్ (Raigad) జిల్లాలో కురిసిన భారీ వర్షానికి హెచ్‌పీసీఎల్ (HPCL) పాతాళగంగ ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ (HPCL Patalganga LPG Bottling Plant) రక్షణ గోడ కూలిపోయింది. ఫలితంగా ప్లాంట్ ప్రాంగణంలోకి భారీగా వరద నీరు ప్రవేశించింది. అక్కడ ఉంచిన 3,000 ఎల్పీజీ సిలిండర్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. అవన్నీ పాతాళగంగ నదిలో తేలుతూ కనిపించాయి.
महाराष्ट्र के रायगढ़ में भारी बारिश के बीच पातालगंगा नदी में हजारों LPG गैस सिलेंडर बहने का वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है।
जानकारी के मुताबिक, HPCL के पातालगंगा LPG बॉटलिंग प्लांट परिसर से करीब 3000 सिलेंडर तेज बहाव में बह गए।
फिलहाल किसी जनहानि या विस्फोट की… pic.twitter.com/EpWatKrtSn
— Amit Pandey (@amitpandaynews) July 9, 2026
నదిలో పెద్ద ఎత్తున సిలిండర్లు తేలుతుండటాన్ని గమనించిన స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అవికాస్తా వైరల్‌గా మారాయి. నదిలో కొట్టుకుపోతున్న గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు పరుగులు తీయొద్దని రాయ్‌గఢ్ జిల్లా కలెక్టర్ కిషన్ జావలే సూచించారు. ఆ సిలిండర్లలో గ్యాస్ ఉందో..? లేదో..? అవి సురక్షితమైన స్థితిలో ఉన్నాయో లేదో..? అని అనుమానం వ్యక్తం చేశారు. పాతాళగంగ నది, సమీప ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్లు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Nearly 3,000 LPG cylinders were swept into the Patalganga River after flooding at HPCL's bottling plant in Raigarh district of Maharashtra prompting authorities to urge people not to touch or collect any cylinders found downstream, warning they could still contain gas and pose a… pic.twitter.com/NHAELfopIQ
— Piyush Rai (@Benarasiyaa) July 9, 2026
Also Read..
బెడిసికొట్టిన ట్రాయ్ వ్యూహం.. 140, 1600 సిరీస్ నంబర్ల బ్లాకింగ్ కంటిన్యూ..
చదువుపై అయిష్టంతో కాలేజీ నుంచి విద్యార్థిని అదృశ్యం.. మూడు రోజులపాటు ఉచిత బస్సులో చక్కర్లు..
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Income Tax Act 2025 | రూ.2 లక్షల నగదు తీసుకుంటే జాగ్రత్త.. కొత్త ఆదాయ పన్ను చట్టంలో కఠిన నిబంధనలు..
- ●Donald Trump | లైంగిక వేధింపుల కేసులో ట్రంప్‌కు ఫెడరల్ కోర్టు షాక్
- ●CCI recruitment | కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్.. జూనియర్ అసిస్టెంట్, మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు..
- ●Lenin Censor Review | లెనిన్ సెన్సార్ రివ్యూ - అఖిల్, భాగ్యశ్రీ రొమాన్స్ హైలైట్ - ఆ ట్విస్ట్ మాత్రం షాకింగ్...
- ●Grok 4.5 | గ్రోక్ 4.5 వచ్చేసింది.. కోడింగ్ కోసం స్పేస్ఎక్స్ఏఐ అత్యాధునిక ఏఐ మోడల్..
- ●Heavy Rain | దేశవ్యాప్తంగా ముంచెత్తిన భారీ వర్షాలు.. నీట మునిగిన ఢిల్లీ.. కశ్మీర్, కేరళ అతలాకుతలం

Income Tax Act 2025 | రూ.2 లక్షల నగదు తీసుకుంటే జాగ్రత్త.. కొత్త ఆదాయ పన్ను చట్టంలో కఠిన నిబంధనలు..

Donald Trump | లైంగిక వేధింపుల కేసులో ట్రంప్‌కు ఫెడరల్ కోర్టు షాక్

CCI recruitment | కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్.. జూనియర్ అసిస్టెంట్, మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు..

Lenin Censor Review | లెనిన్ సెన్సార్ రివ్యూ - అఖిల్, భాగ్యశ్రీ రొమాన్స్ హైలైట్ - ఆ ట్విస్ట్ మాత్రం షాకింగ్...






