Konda Surekha | కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోండి… పీసీసీ చీఫ్ మహేశ్‌కు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు
Konda Surekha | ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో (Congress) అంతర్గత వివాదాలు మళ్లీ భగ్గుమన్నాయి. మంత్రి కొండా సురేఖ (Konda Surekha), స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) మధ్య విబేధాలు మరింత ముదురుతున్నాయి.
Konda Surekha | త్రినేత్ర.న్యూస్: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో (Congress) అంతర్గత వివాదాలు మళ్లీ భగ్గుమన్నాయి. మంత్రి కొండా సురేఖ (Konda Surekha), స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) మధ్య విబేధాలు మరింత ముదురుతున్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంపై హైదరాబాద్‌లో దేవాదాయ శాఖ కమిషనర్‌తో కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఉమ్మడి వరంగల్ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు సూచించారు. దీంతో జిల్లా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన మంత్రి కొండా సురేఖ.. కడియంపై ఇప్పటికే పార్టీ అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) ఫిర్యాదు చేశారు. తాజాగా పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌తో (Mahesh Kumar Goud) భేటీ ఆయిన ఆమె.. కడియం శ్రీహరిపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మహిళా మంత్రిని లక్ష్యంగా చేసుకుని జిల్లా రాజకీయాల్లో తనను ఇబ్బంది పెడుతున్నారని పీసీసీ చీఫ్ (PCC Chief) దృష్టికి తీసుకెళ్లారు. ఇదే విషయమై ముఖ్యమంత్రికి కూడా మంత్రి హోదాలో ఫిర్యాదు చేశానని వెల్లడించారు. మంత్రి విజ్ఞప్తి స్పందించిన మహేశ్ గౌడ్.. వివాదాన్ని పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు. త్వరలోనే ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

నేను తప్పు చేయలేదు.. మంత్రి గారే తప్పుగా అర్థం చేసుకున్నారు..
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మంత్రి కొండా సురేఖ మధ్య నెలకొన్న వివాదం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తనపై మంత్రి కొండా సురేఖ చేసిన ఫిర్యాదుపై కడియం శ్రీహరి తాజాగా స్పందించారు. మంత్రి తనను తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను ఎక్కడా ప్రొటోకాల్ ఉల్లంఘించలేదని, ఎలాంటి తప్పూ చేయలేదని ఆయన స్పష్టం చేశారు.
అది నా ప్రాథమిక హక్కు.. సమీక్ష కాదు
తాను దేవాదాయ శాఖ (Endowments department) కార్యాలయానికి వెళ్లి అధికారులకు కేవలం వినతిపత్రం (Representation) మాత్రమే ఇచ్చానని కడియం తేల్చి చెప్పారు. రాజ్యాంగం ప్రకారం, సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీ వరకు ఏ ప్రజాప్రతినిధి అయినా తమ ప్రాంత సమస్యలపై అధికారులను కలిసే హక్కు ఉంటుందని ఆయన గుర్తు చేశారు. తన నియోజకవర్గంలోని చిల్పూరు, జఫర్‌గఢ్, నవాబుపేట తదితర ఐదు దేవాలయాల చైర్మన్లతో కలిసి వెళ్లి ఆలయాల అభివృద్ధిపై అధికారులకు వినతిపత్రం ఇచ్చానని వివరించారు. అధికారులకు రిప్రజెంటేషన్ ఇస్తే, దాన్ని సమీక్ష (Review) అనరని ఆయన స్పష్టం చేశారు.

కేవలం నా నియోజకవర్గం వరకే పరిమితం..
తాను కేవలం స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలోని ఆలయాల గురించే అధికారులతో మాట్లాడానని, ఉమ్మడి వరంగల్ లేదా తెలంగాణ రాష్ట్ర ఆలయాల గురించి కాదని కడియం క్లారిటీ ఇచ్చారు. ఆలయాల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులపై ఎస్టిమేట్స్ (Estimates) ఇస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయిస్తానని మాత్రమే కమిషనర్‌కు సూచించానన్నారు. క్యాబినెట్ ర్యాంక్ ఉన్న మంత్రులు మాత్రమే అధికారులతో సమీక్షలు చేయగలరని, ఎమ్మెల్యేగా తాను అధికారులను కలవడాన్ని తప్పు పట్టలేమని ఆయన స్పష్టం చేశారు.
వివాదాలు వద్దు.. అభివృద్ధిపై ఫోకస్ చేద్దాం
కొందరు కొత్తగా అలవాట్లు నేర్చుకుని వివాదాలు (Controversies) సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, అది సరైన పద్ధతి కాదని కడియం పరోక్షంగా చురకలంటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని, రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని.. ఇలాంటి సమయంలో ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌లో (MGM Hospital) రెగ్యులర్ సూపరింటెండెంట్ లేకపోవడం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (Underground drainage) పనుల పెండింగ్ వంటి కీలకమైన సమస్యలను వదిలేసి, అనవసర విషయాలపై టైమ్ వేస్ట్ చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. మనకున్న అధికారాన్ని, అవకాశాన్ని ప్రజల కోసం వాడాలి తప్ప ఇలా వివాదాల కోసం కాదని కడియం శ్రీహరి ముగించారు.
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..






