Chamala Kiran Kumar Reddy | పదవుల కోసం రోడ్డెక్కి కొట్టుకుంటే.. ప్రజల్లో చులకనౌతాం: ఎంపీ చామల
Chamala Kiran Kumar Reddy | పదవుల కోసం రోడ్డెక్కి కొట్టుకుంటే ప్రజల్లో చులకనౌతామని కాంగ్రెస్ కార్యకర్తలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) సూచించారు. తనకు, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు.
Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర.న్యూస్: పదవుల కోసం రోడ్డెక్కి కొట్టుకుంటే ప్రజల్లో చులకనౌతామని కాంగ్రెస్ కార్యకర్తలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) సూచించారు. తనకు, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు (Congress Cadre) సంయమనం పాటించాలన్నారు. పదవుల విషయమై బుధవారం అర్వపల్లిలో (Arvapally) ఎంపీ చామల, ఎమ్మెల్యే సామేలు (Mandula Samuel) మద్దతుదారులు కర్రలు, రాళ్లతో కొట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ చామల కిరణ్ స్పందిస్తూ.. తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య మనస్పర్థలు వచ్చినట్లు ప్రచారం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే ముందుల సామెల్.. తానకు ఎలాంటి రాజకీయ బ్యాగ్రౌండ్ లేదని చెప్పారు. అయినా కాంగ్రెస్ కార్యకర్తలు తమను అక్కున చేర్చుకుని గెలిపించారని తెలిపారు.
తాను ఎమ్మెల్యే మందుల సామేల్‌కు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో మండల అధ్యక్ష పదవికి, పీఏసీఎస్ (PACS) చైర్మన్ పదవి, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి తాను ఎవరినీ ప్రమోట్ చేయలేదని స్పష్టం చేశారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు ఎవరిని కోరుకుంటే వారికే పదవులు ఇద్దామని స్థానిక ఎమ్మెల్యేతో చెప్పానన్నారు. మందుల సామేల్ తీసుకునే నిర్ణయానికి తాను వ్యతిరేకం కాదని పునరుద్ఘాటించారు. తాను విదేశాల్లో ఉన్నప్పుడు మండల అధ్యక్షులను ప్రకటించారని, అదే విషయమై తనకు కాంగ్రెస్ కార్యకర్తలు ఫోన్ చేశారని తెలిపారు.
ఇదే అంశాన్ని తాను పీసీసీ చీఫ్ (PCC Chief) మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకువెళ్లానన్నారు. నిర్ణయం తీసుకున్నారు, ప్రకటన ఆపాలని కోరానని చెప్పారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత మండలం తిరుమలగిరి, తన సొంత మండలం శాలి గౌరారం తుంగతుర్తిలోనే (Thungathurthy) ఉన్నాయని తెలిపారు. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి డీసీసీ అధ్యక్షులు, పార్లమెంట్ పరీశీలకుడితో మాట్లాడి సమస్యను పరిష్కారం చేస్తామని వెల్లడించారు. మండల స్థాయిలో కార్యకర్తలు ఎవరికి ఎక్కువ మద్దతిస్తే వారికే అవకాశం ఇద్దామన్నారు. పదవుల కోసం రోడ్డు ఎక్కి కొట్టుకుంటే ప్రజల్లో చులకన అవుతామని చెప్పారు. అందువల్ల కాంగ్రెస్ (Congress) కార్యకర్తలు సమన్వయం పాటించాలని సూచించారు. తాను ఏ వర్గానికి, ఏ కులానికి, ఏ మతానికి వ్యతిరేకం కాదని, ఎవరికీ అన్యాయం చేయాలనే ఆలోచన లేదని చెప్పారు. ప్రజలు నమ్మకంతో తమను గెలిపించారని, వారి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.
సంబంధిత వార్తలు

Graduates’ MLC Elections | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరి.. రాకేశ్‌రెడ్డి వర్సెస్ గడల శ్రీనివాస్, పీవీ శ్రీనివాస్‌రావు!
ఆగస్టు 25, 2026

Jairam Ramesh | ఇస్రోను కేంద్రం బలహీనపరుస్తోంది.. జైరామ్ రమేష్
ఆగస్టు 24, 2026

Balmoor Venkat | విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు.. మీ లడాయి ఎక్కడికి పోయింది?.. బీజేపీ నేతలపై బల్మూర్ వెంకట్ ఆగ్రహం
ఆగస్టు 24, 2026
తాజావార్తలు
- ●Toxic | 'టాక్సిక్' సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..
- ●CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్
- ●HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం
- ●Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ
- ●Ganesh Festival | గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
- ●Harish Rao | జీవో 97 రద్దు చేయకపోతే.. లక్ష మందితో సచివాలయం ముట్టడి

Toxic | 'టాక్సిక్' సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..

CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్

HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం

Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ



