Shane Warne | రాజస్థాన్ రాయల్స్ అమ్మకం.. షేన్ వార్న్ కుటుంబానికి దక్కనున్న రూ.450 కోట్లు..
Shane Warne | ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ బంతితో మాయాజాలం సృష్టించడమే కాకుండా, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే దూరదృష్టి కలిగిన వ్యక్తిగా కూడా నిలిచారు. 2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొలి సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు, తన ఒప్పందంలో చేర్చిన ఒక ప్రత్యేక క్లాజ్ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆయన కుటుంబానికి భారీ లాభం తీసుకురానుంది.
Shane Warne | ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ బంతితో మాయాజాలం సృష్టించడమే కాకుండా, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే దూరదృష్టి కలిగిన వ్యక్తిగా కూడా నిలిచారు. 2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొలి సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు, తన ఒప్పందంలో చేర్చిన ఒక ప్రత్యేక క్లాజ్ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆయన కుటుంబానికి భారీ లాభం తీసుకురానుంది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టును అమెరికాకు చెందిన కల్ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం 1.63 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.15,290 కోట్లు) కొనుగోలు చేయడంతో ఆ క్లాజ్ అమల్లోకి వచ్చింది.
ఆడిన ప్రతి సీజన్‌కు 0.75 శాతం యాజమాన్య వాటా..
2008 ఐపీఎల్ సీజన్‌కు ముందు షేన్ వార్న్‌తో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఆయనకి కెప్టెన్ బాధ్యతలతోపాటు జట్టు క్రికెటింగ్ కార్యకలాపాలపై సంపూర్ణ నియంత్రణ కూడా ఇచ్చారు. ఈ ఒప్పందంలో భాగంగా జట్టుకు ఆయన ఆడిన ప్రతి ఏడాది 0.75 శాతం యాజమాన్య వాటాను ఆయనకి కేటాయించారు. అప్పట్లో ఆయన ది హెరాల్డ్ సన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. తన ఒప్పందంలో భాగంగా తనను కెప్టెన్‌గా, కోచ్‌గా, అలాగే జట్టును నిర్వహించేందుకు కూడా బాధ్యతలు వహించాలని జట్టు యాజమాన్యం కోరిందని, తాను మొత్తం బాధ్యతలు చూసుకునే వ్యక్తినని వార్న్ తెలిపారు.
వార్న్ వాటా విలువ రూ.450 కోట్లు..
వార్న్ రాజస్థాన్ రాయల్స్ తరఫున నాలుగు సీజన్లలో ఆడగా, 2008లో తొలి సీజన్‌లోనే జట్టుకు టైటిల్ అందించారు. కాగా ఆయన యాజమాన్య వాటా మొత్తం 3 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం జట్టు 1.63 బిలియన్ డాలర్లకు అమ్ముడవడంతో, వార్న్ వాటా విలువ సుమారు రూ.450-460 కోట్లకు చేరింది. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత, ఈ వాటాను విక్రయించి నగదు రూపంలో తీసుకునే అర్హత ఆయన కుటుంబానికి ఉంటుంది. అయితే ఈ ఒప్పందానికి బీసీసీఐ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. మొదటగా 2008లో ఈ ఫ్రాంచైజీని మనోజ్ బాదలే నేతృత్వంలోని ఎమర్జింగ్ మీడియా కేవలం 67 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అయితే 2022లో షేన్ వార్న్ కన్నుమూశారు. అయినప్పటికీ ఆయన 18 ఏళ్ల కిందట తీసుకున్న ఆ నిర్ణయం ఇప్పుడు ఆయన కుటుంబానికి భారీ లాభాన్ని తెచ్చిపెట్టింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

India vs England | ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ వైభవ్ సూర్యవంశీకి దక్కని ఛాన్స్.. సునీల్ గవాస్కర్ ఏమన్నారంటే..?
జులై 2, 2026

Shree Charani | ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. వరల్డ్ నెంబర్ వన్ బౌలర్‌గా శ్రీ చరణి
జూన్ 24, 2026

Abhishek Porel | పెండ్లి పేరుతో మోసం చేశాడు.. ఐపీఎల్ ఆటగాడిపై యువతి ఫిర్యాదు
జూన్ 24, 2026
తాజావార్తలు
- ●Karnataka | లారీని ఢీకొట్టిన మినీ ట్రక్కు.. ఏడుగురు దుర్మరణం
- ●Musi | మూసీ రివర్‌ఫ్రంట్‌కు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతి.. మొదటి దశలో 21 కి.మీ పనులు
- ●Goat Milk | పిల్లలకు మేకపాలు మంచివేనా? వైద్యుల కీలక హెచ్చరిక..
- ●Earthquake | నాందేడ్‌లో స్వల్ప భూప్రకంపనలు.. తెలంగాణలోని ఆ జిల్లాల్లో కంపించిన భూమి
- ●Chabahar Port | భారత్‌కు షాక్.. ఇరాన్‌లోని చాబహార్ పోర్టుపై అమెరికా దాడులు
- ●Deepika Padukone | లగ్జరీలకే లక్షల్లో ఖర్చులు - కల్కి 2 నుంచి దీపికా పడుకోణ్ తప్పుకోవడంపై టాలీవుడ్ ప్రొడ్యూసర్ కామెంట్స్

Karnataka | లారీని ఢీకొట్టిన మినీ ట్రక్కు.. ఏడుగురు దుర్మరణం

Musi | మూసీ రివర్‌ఫ్రంట్‌కు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతి.. మొదటి దశలో 21 కి.మీ పనులు

Goat Milk | పిల్లలకు మేకపాలు మంచివేనా? వైద్యుల కీలక హెచ్చరిక..

Earthquake | నాందేడ్‌లో స్వల్ప భూప్రకంపనలు.. తెలంగాణలోని ఆ జిల్లాల్లో కంపించిన భూమి



