Koppula Eshwar | తాడిచర్ల బ్లాక్‌ను సింగరేణియే గుర్తించింది.. కాంగ్రెస్, బీజేపీలు గొప్పలు చెప్తుంటే నవ్వొస్తుంది
Koppula Eshwar | తాడిచర్ల బ్లాక్‌ను మొదట గుర్తించింది సింగరేణియేనని.. కాంగ్రెస్, బీజేపీలు తమ ఘనతగా గొప్పలు చెప్పుకోవడం కరెక్టు కాదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. 13 ఏండ్ల నిరీక్షణ తర్వాత తాడిచర్ల సింగరేణికి దక్కిందని, భవిష్యత్‌లో ఏ గనినైనా సింగరేణికే కేటాయించాలన్నారు.
- తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోరాటాల వల్లే తాడిచర్ల దక్కింది
- భవిష్యత్‌లో ఏ గనినైనా సింగరేణికే కేటాయించాలి
- కొన్ని బ్లాక్‌లను వేలం వేయొద్దని కేసీఆర్ ప్రధానికి లేఖ రాసినా సప్పుడే చేయలే
- బొగ్గు స్కాం దోషులెవరో తేల్చాలి
- మీడియా సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్
Koppula Eshwar | త్రినేత్ర.న్యూస్: తాడిచర్ల బ్లాక్‌ను మొదట గుర్తించింది సింగరేణియేనని.. కాంగ్రెస్, బీజేపీలు తమ ఘనతగా గొప్పలు చెప్పుకోవడం కరెక్టు కాదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. 13 ఏండ్ల నిరీక్షణ తర్వాత తాడిచర్ల సింగరేణికి దక్కిందని, భవిష్యత్‌లో ఏ గనినైనా సింగరేణికే కేటాయించాలన్నారు. సెక్షన్ 17 (ఏ) ప్రకారం గతంలో పలు బ్లాక్‌లను వేలం వేయకూడదని కేసీఆర్ ప్రధానికి ఉత్తరం రాసినా పట్టించుకోలేదని విమర్శించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు.
సింగరేణిని కాపాడుకోవడం ప్రజల హక్కు. కేసీఆర్ ఆలోచనలతో సింగరేణి బలోపేతమైంది. అనేక పోరాటాల తర్వాత తాడిచర్లపై హక్కులు సాధించుకున్నాం. కాంగ్రెస్, బీజేపీలు తమ ఘనతగా చెప్పుకోవడం కరెక్టు కాదు. అసలు తాడిచర్ల వేలం నిర్వహించే జాబితాలో ఉన్నదా? 13 ఏండ్ల నిరీక్షణ తర్వాత తాడిచర్ల సింగరేణికి దక్కింది. గతంలో తాడిచర్ల బ్లాక్‌ను వేలం వేద్దామంటే కేసీఆర్ వ్యతిరేకించారు. ఆనాడు బ్లాక్‌లు సింగరేణికి దక్కకపోవడానికి కేంద్రమే కారణం అని కొప్పుల ఫైరయ్యారు.
ప్రైవేటుపరమైన గనులను తిరిగి సింగరేణికే అప్పగించాలి..
కాంగ్రెస్, బీజేపీలు పోటీపడి తాడిచర్లను తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తుండటం హాస్యాస్పదంగా ఉంది. ఎంఎండీఆర్ యాక్ట్ కు మార్పులు తెచ్చి గనులు వేలం వేయడానికి కాంగ్రెస్, బీజేపీలే కారణం. సింగరేణిలో అనేక స్కాంలను మా నేత హరీశ్‌రావు బయటపెట్టారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోరాటాల వల్లే తాడిచర్ల సింగరేణికి దక్కింది. కాంగ్రెస్, బీజేపీలు నాటకాలు పక్కన పెట్టి ప్రైవేటు పరమైన గనులను తిరిగి సింగరేణికి దక్కేలా చేయాలి. బొగ్గు మాయం స్కాంలో దోషులెవరో తేల్చాలి. సింగరేణిలో కార్మికుల పెండింగ్ డిమాండ్లన్నీ పరిష్కరించాకే కాంగ్రెస్, బీజేపీలు సింగరేణిపై మాట్లాడాలి అని కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!

Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం





