HPCL | హెచ్‌పీసీఎల్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. డిప్లొమా, డిగ్రీ అర్హత
HPCL | దేశీయ చమురు పంపిణీ సంస్థ అయిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఎగ్జిక్యూటివ్ (Junior Executives) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 116 పోస్టులకు నియామక ప్రక్రియ ప్రారంభించింది.
HPCL | త్రినేత్ర.న్యూస్: దేశీయ చమురు పంపిణీ సంస్థ అయిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఎగ్జిక్యూటివ్ (Junior Executives) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 116 పోస్టులకు నియామక ప్రక్రియ ప్రారంభించింది. ఇంజినీరింగ్ డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ చేసిన వారు జూలై 20వ తేదీ వరకు www.hindustanpetroleum.comలో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), రాత పరీక్ష, గ్రూప్ టాస్క్, సైకోమెట్రిక్ అసెస్‌మెంట్, స్కిల్ టెస్టు, పర్సనల్, టెక్నికల్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.30,000 - 1,20,000. మూల వేతనం అందుతుంది.
మొత్తం ఉద్యోగాలు: 116
ఇందులో జేఈ కెమికల్ 37, ఫైర్ అండ్ సేఫ్టీ 17, సీనియర్ ఆఫీసర్ సేల్స్ 52, అసిస్టెంట్ మేనేజర్ లేదా మేనేజర్ ప్రాజెక్ట్ 5, చీఫ్ మేనేజర్ 1, సీనియర్ మేనేజర్ 1, డిప్యూటీ జీఎం 1 చొప్పున, డిప్యూటీ జీఎం 2 ఖాళీలు ఉన్నాయి. వీటిలో జేఈ కెమికల్, ఫైర్ అండ్ సేఫ్టీ పోస్టులకు ఫ్రెషర్లు కూడా దరఖాస్తు చేసుకోచ్చు. మిగిలిన 62 పోస్టులకు ఉద్యోగానుభవం అవసరం.
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (కెమికల్)- 37
అర్హత: 65 శాతం మార్కులతో రెగ్యులర్ ఇంజినీరింగ్ డిప్లొమా (కెమికల్) పూర్తిచేయాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం. అభ్యర్థుల వయస్సు 25 ఏండ్లకు మించకూడదు.
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్ అండ్ సేఫ్టీ)- 17
అర్హత: 65 శాతం మార్కులతో సైన్స్ డిగ్రీ, ఫైర్ అండ్ సేఫ్టీ డిప్లొమా, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వయస్సు 25 సంవత్సరాలలోపు ఉండాలి.
ఎంపిక విధానం
పోస్టు ప్రకారం కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)/ రాత పరీక్ష, గ్రూప్ టాస్క్, సైకోమెట్రిక్ అసెస్‌మెంట్, స్కిల్ టెస్టు, పర్సనల్/ టెక్నికల్ ఇంటర్వ్యూలతో ఎంపిక చేస్తారు. రాతపరీక్షలో జనరల్ ఆప్టిట్యూడ్, టెక్నికల్ లేదా ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు ఫీజు: రూ.1180, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 20
వెబ్‌సైట్: http://www.hindustanpetroleum.com/
సంబంధిత వార్తలు

Instamart | ఇక స్విగ్గీలోనే ఎల్పీజీ సిలిండర్ బుకింగ్.. నిమిషాల్లోనే డెలివరీ..
జులై 17, 2026

LPG cylinder | ఇన్‌స్టామార్ట్ ద్వారా బుక్ చేసిన 10 నిమిషాల్లోనే గ్యాస్ సిలిండర్ డెలివరీ.. దేశంలోనే తొలిసారి
జులై 15, 2026

HPCL | హెచ్‌పీసీఎల్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీలు.. ఇంజినీరింగ్ చేసినవారు అర్హులు..
జులై 15, 2026
తాజావార్తలు
- ●ISRO Apprentice | ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో అప్రెంటిస్‌లు.. రాత పరీక్ష లేకుండానే..
- ●Horoscope | జూలై 19 రాశి ఫలాలు.. మీ కోపం వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం!
- ●Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక
- ●Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!
- ●Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ●Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి

ISRO Apprentice | ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో అప్రెంటిస్‌లు.. రాత పరీక్ష లేకుండానే..

Horoscope | జూలై 19 రాశి ఫలాలు.. మీ కోపం వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం!

Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక

Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!



