Meta Muse Image | మెటా మ్యూస్ ఇమేజ్ వచ్చేసింది.. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏఐతో ఫొటోలకు కొత్త రూపం..
Meta Muse Image | మెటా తన తొలి ఇమేజ్ జనరేషన్ మోడల్ మ్యూస్ ఇమేజ్ ని అధికారికంగా విడుదల చేసింది. మెటా సూపర్‌ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అభివృద్ధి చేసిన ఈ ఏఐ మోడల్ ద్వారా మెటా ఏఐలో ఇమేజ్‌లను సృష్టించడం, ఎడిట్ చేయడం మరింత సులభమవుతుంది.
Technology | Published On Jul 9, 2026, 12.58 pm IST
Meta Muse Image | మెటా తన తొలి ఇమేజ్ జనరేషన్ మోడల్ మ్యూస్ ఇమేజ్ ని అధికారికంగా విడుదల చేసింది. మెటా సూపర్‌ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అభివృద్ధి చేసిన ఈ ఏఐ మోడల్ ద్వారా మెటా ఏఐలో ఇమేజ్‌లను సృష్టించడం, ఎడిట్ చేయడం మరింత సులభమవుతుంది. టెక్స్ట్ ప్రాంప్ట్‌లతో కొత్త చిత్రాలను రూపొందించడం, ఇప్పటికే ఉన్న ఫొటోలను మార్చడం, వాటిని మెటా యాప్‌లలో షేర్ చేయడం వంటి ఫీచర్లు ఇందులో అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో కొత్త క్రియేటివ్ టూల్స్‌కు కూడా ఇది సపోర్ట్‌నిస్తుంది. మ్యూస్ ఇమేజ్, మ్యూస్ స్పార్క్ తో కలిసి పనిచేస్తుంది. సంభాషణ రూపంలో ఇచ్చే ప్రాంప్ట్‌ల ఆధారంగా కొత్త చిత్రాలను రూపొందించడంతోపాటు, ఇప్పటికే ఉన్న ఫొటోలను ఎడిట్ చేసి మరింత మెరుగుపరచడానికి మెటా ఏఐ సహాయపడుతుంది.
టెక్ట్స్ ప్రాంప్ట్‌లతో ఎడిటింగ్..
ఈ మోడల్‌లో టెక్స్ట్ ప్రాంప్ట్‌లు లేదా ఇప్పటికే ఉన్న ఫొటోల ఆధారంగా కొత్త చిత్రాలను రూపొందించడం, ఫొటోలలో అవసరం లేని వస్తువులను తొలగించడం, ఒకటి కంటే ఎక్కువ చిత్రాలను కలిపి కొత్త ఇమేజ్ రూపొందించడం, క్యూ ఆర్ కోడ్‌లు సృష్టించడం, గైడ్‌లు, ఇన్ఫోగ్రాఫిక్‌ల కోసం స్పష్టంగా చదవగలిగే టెక్స్ట్‌తో విజువల్స్ తయారు చేయడం వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఇందులో ప్రత్యేక ప్రీసెట్స్ ప్యానెల్ కూడా అందుబాటులో ఉంది. పాత కుటుంబ ఫొటోలను పునరుద్ధరించడం, కొత్త హెయిర్‌స్టైల్‌లను ప్రయత్నించడం, క్లేమేషన్ స్టైల్ పోర్ట్రెయిట్‌లు రూపొందించడం, 16 బిట్ వీడియో గేమ్‌ల తరహా చిత్రాలను సృష్టించడం వంటి రెడీమేడ్ ప్రాంప్ట్‌లు ఇందులో ఉంటాయి. వినియోగదారులు తమ గది ఫొటో తీసి మెటా ఏఐని ఇంటీరియర్‌ను రీడిజైన్ చేయమని కూడా అడగవచ్చు. వెబ్ లేదా ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్‌లో అందుబాటులో ఉన్న ఉత్పత్తులను ఉపయోగించి, తమకు నచ్చిన స్టైల్ లేదా ట్రెండింగ్ డిజైన్‌ల ఆధారంగా కొత్త ఇంటీరియర్ కాన్సెప్ట్‌లను రూపొందించే అవకాశం ఉంటుంది.
30కి పైగా కొత్త ఎఫెక్ట్‌లు..
మ్యూస్ ఇమేజ్ ప్రాంప్ట్‌లను మెటా పలు దశల్లో ప్రాసెస్ చేస్తుంది. ముందుగా లేఅవుట్‌ను ప్లాన్ చేసి, రియల్‌టైమ్ వెబ్ కాంటెక్స్ట్‌ను ఉపయోగించి, పలు విజువల్ రిఫరెన్స్‌లను కలిపి తుది చిత్రాన్ని రూపొందిస్తుంది. వినియోగదారులు స్కెచ్‌లు లేదా అనోటేషన్‌లతో చిత్రాలపై సూచనలు ఇవ్వవచ్చు. అంతేకాకుండా, మెటా ఏఐ సంభాషణ కాంటెక్స్ట్‌ను గుర్తుంచుకుని, మొదటి నుంచి ప్రారంభించాల్సిన అవసరం లేకుండా అదనపు మార్పులను వరుసగా అమలు చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ కోసం కూడా మెటా 30కి పైగా ఏఐ ఆధారిత కొత్త ఎఫెక్ట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ద్వారా ఒకే ట్యాప్‌తో లైటింగ్ మార్చడం, విభిన్న విజువల్ స్టైల్‌లను వర్తింపజేయడం లేదా ఫొటోలను పూర్తిగా కొత్త రూపంలోకి మార్చడం సాధ్యమవుతుంది. నైట్ ఫ్లాష్, డిస్పోజబుల్, పఫర్, పేపర్ డాల్, ఐజీ చార్మ్స్ వంటి ఎఫెక్ట్‌లు ఇందులో ఉన్నాయి. వినియోగదారులు టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి తమకు నచ్చిన కొత్త ఎఫెక్ట్‌లను కూడా సృష్టించుకోవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ల సహకారంతో అభివృద్ధి..
ఈ అప్‌డేట్‌లో స్టోరీస్ కంపోజర్‌ను కూడా మెటా పూర్తిగా రీడిజైన్ చేసింది. కొత్త ఎఫెక్ట్స్ బ్రౌజర్ ద్వారా ప్రతి ఎఫెక్ట్‌ను ముందుగానే ప్రివ్యూ చూసి తర్వాత ఉపయోగించవచ్చు. ఈ ఎఫెక్ట్‌లలో కొన్నింటిని ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ల సహకారంతో అభివృద్ధి చేసినట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే మెటా ఏఐలో స్నేహితుల పబ్లిక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లను ప్రస్తావించి వ్యక్తిగతీకరించిన చిత్రాలను రూపొందించే సదుపాయాన్ని కూడా తీసుకొచ్చింది. పుట్టినరోజు శుభాకాంక్షల కార్డులు, గ్రూప్ ట్రిప్ మీమ్స్, ఆహ్వాన పత్రాలు, కలబొరేటివ్ కాన్సెప్ట్‌లు లేదా ఇతర కస్టమ్ గ్రాఫిక్‌లను సులభంగా రూపొందించవచ్చు. అయితే ఈ ఫీచర్‌ను ఉపయోగించకూడదనుకునే ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు మొబైల్ యాప్‌లో సెట్టింగ్స్ > షేరింగ్ అండ్ రీయూజ్ విభాగంలో దీన్ని నిలిపివేయవచ్చు. వాట్సాప్‌లో కూడా మెటా ఏఐ చాట్‌లలో మ్యూస్ ఇమేజ్ ఇంటిగ్రేషన్ అందుబాటులోకి వస్తోంది. సంభాషణ రూపంలో ఇచ్చే ప్రాంప్ట్‌ల ఆధారంగా నేరుగా చాట్‌లోనే చిత్రాలను రూపొందించుకోవచ్చు.
ఇమేజ్ జనరేషన్, ఎడిటింగ్..
ప్రస్తుతం మెటా ఏఐలో మ్యూస్ ఇమేజ్ ద్వారా ఇమేజ్ జనరేషన్, ఎడిటింగ్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణ వినియోగదారులకు ఈ సేవ ఉచితంగా లభిస్తుండగా, అధిక వినియోగ పరిమితులను మెటా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల ద్వారా అందిస్తారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త స్టోరీస్ అనుభవం, 30కి పైగా ఏఐ ఎఫెక్ట్‌లు, కొత్త ఎఫెక్ట్స్ బ్రౌజర్ ప్రస్తుతం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్‌లో మెటా ఏఐ ద్వారా ఇమేజ్ జనరేషన్ మొదట కొద్ది దేశాల్లో ప్రారంభమవుతోంది. త్వరలో మరిన్ని దేశాలకు విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది. రానున్న వారాల్లో ఫేస్‌బుక్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో మరిన్ని అనుభవాలతో మ్యూస్ ఇమేజ్‌ను విస్తరించనున్నట్లు మెటా వెల్లడించింది. అలాగే అడ్వాంటేజ్ ప్లస్ క్రియేటివ్ ద్వారా ప్రకటనదారులు, ఏజెన్సీలకు కూడా ఈ సదుపాయం అందించనుంది. ఇక మ్యూస్ వీడియో అనే కొత్త ఏఐ వీడియో మోడల్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నట్లు కూడా కంపెనీ ధ్రువీకరించింది.
తాజావార్తలు
- ●ISRO Apprentice | ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో అప్రెంటిస్‌లు.. రాత పరీక్ష లేకుండానే..
- ●Horoscope | జూలై 19 రాశి ఫలాలు.. మీ కోపం వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం!
- ●Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక
- ●Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!
- ●Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ●Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి

ISRO Apprentice | ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో అప్రెంటిస్‌లు.. రాత పరీక్ష లేకుండానే..

Horoscope | జూలై 19 రాశి ఫలాలు.. మీ కోపం వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం!

Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక

Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!






