Petroleum Dealers Association | ఇంధన కొరత లేదు.. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన
Petroleum Dealers Association | రాష్ట్రంలో ఇంధన కొరతపై తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ (Telangana Petroleum Dealers Association) కీలక ప్రకటన చేసింది. హెచ్‌పీసీఎల్ (HPCL), ఐఓసీఎల్ (IOCL), బీపీసీఎల్ (BPCL) కంపెనీల వద్ద సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని అసోసియేషన్ స్పష్టం చేసింది. సరఫరా వ్యవస్థ సక్రమంగా కొనసాగుతోందని తెలిపింది.
Petroleum Dealers Association | తెలంగాణలో ఇంధన కొరత (fuel shortage)పై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ దొరకదన్న భయంతో బంకుల వద్ద క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ (Telangana Petroleum Dealers Association) స్పందించింది. రాష్ట్రంలో ఇంధన కొరత లేదని స్పష్టం చేసింది. తప్పుడు కథనాలను ప్రజలు నమ్మొద్దని సూచించింది.
హెచ్‌పీసీఎల్ (HPCL), ఐఓసీఎల్ (IOCL), బీపీసీఎల్ (BPCL) కంపెనీల వద్ద సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని అసోసియేషన్ స్పష్టం చేసింది. సరఫరా వ్యవస్థ సక్రమంగా కొనసాగుతోందని తెలిపింది. రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధనం సరిపడా అందుబాటులోనే ఉందని వెల్లడించింది. కొరత భయంతో ప్రజలు పెట్రోల్ కోసం క్యూ కడుతున్నారని తెలిపింది. ఈ కారణంగా సాధారణ స్థాయి కంటే 2.5 నుంచి 3 రెట్లు అధికంగా అమ్మకాలు జరుగుతున్నాయని వివరించింది. విపరీతమైన రద్దీ కారణంగానే కొన్ని బంకుల్లో షార్టేజ్ వచ్చిందని.. దీన్ని ఇంధన కొరతగా భావించొద్దని అసోసియేషన్ తెలిపింది. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు కథనాలను నమ్మి ప్రజలు భయాందోళనకు గురికావొద్దని సూచించింది.
ఇంధనం దొరకదన్న భయంతో బంకుల వద్దకు జనం క్యూ కడుతున్నారని తెలిపింది. నిల్వలు ఉంచుకునేందుకు ముందస్తు కొనుగోళ్లతో ఇబ్బంది ఏర్పడుతోందని అసోసియేషన్ పేర్కొంది. అంతేకాదు, పెట్రోల్ లేదా డీజిల్‌ను క్యాన్లలో నిల్వ చేయడం ప్రమాదకరమని.. ఇది PESO నిబంధనలకు విరుద్ధమని పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. ప్యానిక్ నిల్వలు చేయొద్దని ప్రజలను కోరింది.
సరిపడా నిల్వలు ఉన్నాయ్..
మరోవైపు రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌కు కొరత లేదని తెలంగాణ పౌరసరఫరాల శాఖ సైతం స్పష్టం చేసింది. ప్రజలు భయాందోళనకు గురికావద్దని సూచించింది. రిఫైనరీల నుంచి ఇంధన సరఫరా సక్రమంగా జరుగుతోందని తెలిపింది. సరిపడా నిల్వలు అందుబాటులోనే ఉన్నాయని వివరించింది.

Also Read..
హైదరాబాద్‌లో నేడు ఆల్ ఇండియా పోలీస్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ ప్రారంభం
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత.. బీఆర్ఎస్ వాయిదా తీర్మానం
హైదరాబాద్‌లో పెట్రోల్ బంక్‌ల వద్ద కిలోమీటర్ల మేర క్యూ.. ఆటోల బంద్‌తో ఉద్యోగుల అవస్థలు
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Karnataka | లారీని ఢీకొట్టిన మినీ ట్రక్కు.. ఏడుగురు దుర్మరణం
- ●Musi | మూసీ రివర్‌ఫ్రంట్‌కు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతి.. మొదటి దశలో 21 కి.మీ పనులు
- ●Goat Milk | పిల్లలకు మేకపాలు మంచివేనా? వైద్యుల కీలక హెచ్చరిక..
- ●Earthquake | నాందేడ్‌లో స్వల్ప భూప్రకంపనలు.. తెలంగాణలోని ఆ జిల్లాల్లో కంపించిన భూమి
- ●Chabahar Port | భారత్‌కు షాక్.. ఇరాన్‌లోని చాబహార్ పోర్టుపై అమెరికా దాడులు
- ●Deepika Padukone | లగ్జరీలకే లక్షల్లో ఖర్చులు - కల్కి 2 నుంచి దీపికా పడుకోణ్ తప్పుకోవడంపై టాలీవుడ్ ప్రొడ్యూసర్ కామెంట్స్

Karnataka | లారీని ఢీకొట్టిన మినీ ట్రక్కు.. ఏడుగురు దుర్మరణం

Musi | మూసీ రివర్‌ఫ్రంట్‌కు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతి.. మొదటి దశలో 21 కి.మీ పనులు

Goat Milk | పిల్లలకు మేకపాలు మంచివేనా? వైద్యుల కీలక హెచ్చరిక..

Earthquake | నాందేడ్‌లో స్వల్ప భూప్రకంపనలు.. తెలంగాణలోని ఆ జిల్లాల్లో కంపించిన భూమి




