Student Missing | చదువుపై అయిష్టంతో కాలేజీ నుంచి విద్యార్థిని అదృశ్యం.. మూడు రోజులపాటు ఉచిత బస్సులో చక్కర్లు..
Student Missing | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు (Free Bus) ప్రయాణంతో ఎంతో మంది లబ్ధిపొందుతున్నారు. తక్కువ జీతాలు పొందుతున్న, రోజువారీ కూలి పనులు చేసుకునే మహిళలు బస్సుల్లో జీరో టికెట్ వల్ల ప్రతి నెల సుమారు రూ.2 వేల వరకు ఆదాచేసుకుంటున్నారు. మహిళల సాధికారత, ఆర్థిక భద్రత కోసం ప్రభుత్వ ప్రవేశ పెట్టిన ఈ పథాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు.
Student Missing | త్రినేత్ర.న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు (Free Bus) ప్రయాణంతో ఎంతో మంది లబ్ధిపొందుతున్నారు. తక్కువ జీతాలు పొందుతున్న, రోజువారీ కూలి పనులు చేసుకునే మహిళలు బస్సుల్లో జీరో టికెట్ వల్ల ప్రతి నెల సుమారు రూ.2 వేల వరకు ఆదాచేసుకుంటున్నారు. మహిళల సాధికారత, ఆర్థిక భద్రత కోసం ప్రభుత్వ ప్రవేశ పెట్టిన ఈ పథాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. చదువుకోవడం ఇష్టం లేని ఓ విద్యార్థిని (Student Missing) కాలేజీ నుంచి చెప్పాపెట్టకుండా వచ్చి.. బస్సులో ఆధార్ కార్డు చూపించి మూడు రోజులు చక్కర్లు కొట్టింది. కేసును ఛేదించేందుకు పోలీసులు ముప్పుతిప్పలు పడ్డారు.
మంచిర్యాల (Mancherial) జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయంలో (KGBV) ఓ బాలిక ఇంటర్ ప్రథమ సంవత్సరం (Inter Student) చదువుతున్నది. చదువుకోడంపై ఆసక్తి లేకపోవడంతో చెప్పాపెట్టకుండా ఈ నెల 5న తెల్లవారుజామున కాలేజీ నుంచి అదృశ్యమైంది. కాలేజీ నుంచి వెళ్లిన బాలిక.. ఇంటికి కూడా రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసును దర్యాప్తు చేయడం ప్రారంభించారు. కోటపల్లి నుంచి బైక్‌పై లిఫ్ట్ అడిగి వెళ్లినట్లు గుర్తించారు. ఆ తర్వాత ఆధార్ కార్డుతో ఆర్టీసీ బస్సులో చెన్నూరు నుంచి మంచిర్యాల, మంచిర్యాల నుంచి ఆదిలాబాద్ చేరుకుంది. అక్కడి నుంచి మంచిర్యాలకు వచ్చి.. కరీంనరగ్ వెళ్లింది. దీంతో కరీంనగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. పోలీసులు గుర్తించి ఆమెను పట్టుకున్నారు. మూడు రోజులు బసులో చక్కర్లు కొట్టినట్లు తెలుసుకుని అవాక్కవడం పోలీసుల వంతయింది.
సంబంధిత వార్తలు

CP Ramesh | వర్షాకాల సమస్యలపై సీపీ రమేశ్ క్షేత్రస్థాయి పరిశీలన.. నీటి నిల్వ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
జులై 18, 2026

Python | కేబీఆర్ పార్కులో 20 అడుగుల భారీ కొండచిలువ.. Video
జులై 18, 2026

Talasani Srinivas Yadav | బల్కంపేట ఎల్లమ్మ కల్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు.. భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలన్న మాజీ మంత్రి తలసాని
జులై 18, 2026
తాజావార్తలు
- ●ISRO Apprentice | ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో అప్రెంటిస్‌లు.. రాత పరీక్ష లేకుండానే..
- ●Horoscope | జూలై 19 రాశి ఫలాలు.. మీ కోపం వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం!
- ●Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక
- ●Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!
- ●Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ●Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి

ISRO Apprentice | ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో అప్రెంటిస్‌లు.. రాత పరీక్ష లేకుండానే..

Horoscope | జూలై 19 రాశి ఫలాలు.. మీ కోపం వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం!

Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక

Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!



