BSNL | శాటిలైట్ ఫోన్ సేవలను ప్రారంభించిన బీఎస్‌ఎన్‌ఎల్.. ఇప్పుడు ఎవరైనా కొనవచ్చు.. ధర ఎంతంటే..?
BSNL | భారత ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) దేశంలోని సాధారణ మొబైల్ నెట్‌వర్క్ పూర్తిగా అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా కమ్యూనికేషన్‌ను అందించే ప్రత్యేక శాటిలైట్ ఫోన్ సేవను ప్రారంభించింది.
Technology | Published On Jul 9, 2026, 1.13 pm IST
BSNL | భారత ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) దేశంలోని సాధారణ మొబైల్ నెట్‌వర్క్ పూర్తిగా అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా కమ్యూనికేషన్‌ను అందించే ప్రత్యేక శాటిలైట్ ఫోన్ సేవను ప్రారంభించింది. కమ్యూనికేషన్ బియాండ్ బౌండరీస్ అనే థీమ్‌తో తీసుకొచ్చిన ఈ సేవ, మొబైల్ టవర్లు లేని లేదా పనిచేయని ప్రాంతాల్లో అత్యవసర కమ్యూనికేషన్‌కు కీలక ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. ఈ సేవ కోసం ప్రత్యేకంగా రూపొందించిన శాటిలైట్ హ్యాండ్‌సెట్‌లను ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ నెట్‌వర్క్ సేవలను అందించే ఇన్‌మార్సాట్ వంటి సంస్థల భాగస్వామ్యంతో ఈ పరికరాలను అభివృద్ధి చేశారు. క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా సమర్థంగా పనిచేసేలా ఈ హ్యాండ్‌సెట్‌లను రూపొందించారు.
దృఢమైన నిర్మాణం, నేరుగా శాటిలైట్లతోనే కమ్యూనికేషన్..
ఈ శాటిలైట్ ఫోన్‌లో బలమైన, మన్నికైన డిజైన్‌ను అందించారు. దుమ్ము, నీరు, గట్టి దెబ్బలు వంటి పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం దీనికి ఉంటుంది. విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాల్లో ఎక్కువసేపు ఉపయోగించుకునేలా దీర్ఘకాలిక బ్యాటరీని అమర్చారు. స్పష్టమైన వాయిస్ కమ్యూనికేషన్‌తోపాటు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయం కోరేందుకు ప్రత్యేక ఎస్‌ఓఎస్ ఫీచర్‌ను కూడా ఇందులో అందుబాటులో ఉంచారు. శాటిలైట్ ఫోన్లు భూమిపై ఉన్న మొబైల్ టవర్లపై ఆధారపడకుండా నేరుగా శాటిలైట్ ద్వారా పనిచేస్తాయి. అందువల్ల అత్యంత మారుమూల ప్రాంతాల్లో పనిచేసే సంస్థలు, అత్యవసర సేవలు, ప్రత్యేక విభాగాలకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. సరిహద్దు ప్రాంతాలు, దూర ప్రాంతాల్లో విధులు నిర్వహించే రక్షణ దళాలు, భద్రతా బలగాలకు ఈ సేవ కీలకంగా మారనుంది. భూకంపాలు, వరదలు, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో సాధారణ టెలికాం నెట్‌వర్క్ దెబ్బతిన్నా కమ్యూనికేషన్ ను కొనసాగించేందుకు ఇది ప్రధాన ఆధారంగా ఉంటుంది.

ధర ఎంత, ఎక్కడ కొనాలి..
అలాగే సముద్ర రవాణా, ఆఫ్‌షోర్ కార్యకలాపాలు, గనుల పరిశ్రమ, అటవీ పరిశోధనలు వంటి రంగాల్లో పనిచేసేవారికి కూడా ఈ సేవ ఉపయోగపడుతుంది. ఎత్తైన పుణ్యక్షేత్రాలకు వెళ్లే యాత్రికులు, సాహస యాత్రలు చేసే ప్రయాణికులు కూడా అవసరమైతే ఈ శాటిలైట్ ఫోన్‌ను వినియోగించుకోవచ్చు. శాటిలైట్ కమ్యూనికేషన్‌కు అవసరమైన ఆధునిక మౌలిక సదుపాయాల కారణంగా దీని ధర సాధారణ మొబైల్ సేవలతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. బీఎస్‌ఎన్‌ఎల్ తన శాటిలైట్ ఫోన్ ధరను అన్ని పన్నులు కలిపి రూ.1,34,166గా నిర్ణయించింది. దీని కొనుగోలు లేదా ఇతర వివరాల కోసం బీఎస్‌ఎన్‌ఎల్ ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ఆసక్తి ఉన్న వారు 9768866652 నంబర్‌లో సంప్రదించవచ్చు. అధిక ధర కారణంగా సాధారణ వినియోగదారుల కంటే ప్రభుత్వ సంస్థలు, పారిశ్రామిక రంగం, అత్యవసర సేవలు, ప్రత్యేక అవసరాలు ఉన్న విభాగాలకే ఈ శాటిలైట్ ఫోన్ ప్రధానంగా ఉపయోగపడే అవకాశం ఉంది.
సంబంధిత వార్తలు

BSNL | కేవలం రూ.51కే 28 రోజుల ప్లాన్.. రోజూ 2జీబీ డేటా.. బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్లాన్..
సెప్టెంబర్ 21, 2026

Cheetah | విజయవంతంగా ప్రాజెక్టు చీతా.. 71 ఏండ్ల తర్వాత భారత గడ్డపై చీతాల సందడి
సెప్టెంబర్ 21, 2026

Russia Sanctions Bill | రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం.. ఇక భారత్‌పై 100% టారిఫ్స్..!
సెప్టెంబర్ 19, 2026
తాజావార్తలు
- ●DoT SIM Card Misuse Fine | మీ సిమ్ కార్డు వేరేవాళ్లు వాడుతున్నారా? రూ.50 లక్షల ఫైన్, జైలు శిక్ష తప్పదు
- ●Heroine Radha | 50 కోట్లు దొంగతనానికి స్కెచ్ - సోదరిపై టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కంప్లైంట్
- ●UP Teacher Shot Dead | దారుణం.. విద్యార్థుల ఎదుటే టీచర్‌ను కాల్చి చంపాడు
- ●Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా
- ●Lava Virat Curve | లావా విరాట్ కర్వ్ వచ్చేసింది.. వెనుక మరో డిస్ప్లే..
- ●V Hanumantha Rao | కాంగ్రెస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్సే కాపాడాలి

DoT SIM Card Misuse Fine | మీ సిమ్ కార్డు వేరేవాళ్లు వాడుతున్నారా? రూ.50 లక్షల ఫైన్, జైలు శిక్ష తప్పదు

Heroine Radha | 50 కోట్లు దొంగతనానికి స్కెచ్ - సోదరిపై టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కంప్లైంట్

UP Teacher Shot Dead | దారుణం.. విద్యార్థుల ఎదుటే టీచర్‌ను కాల్చి చంపాడు

Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా



