KTR | నిర్ధారణ చేసుకోకుండా తప్పుడు వార్తలు ప్రచురించడం శోచనీయం.. ఈనాడుపై కేటీఆర్ ఆగ్రహం
KTR | తన పాస్‌పోర్టు జప్తు అయిందంటూ (passport seize) ప్రముఖ తెలుగు దినపత్రిక ఈనాడులో వచ్చిన వార్తపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సదరు సంస్థకు లీగల్ నోటీసు పంపారు. తప్పుడు వార్తను 48 గంటల్లోగా ఉపసంహరించుకోవాలని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆ నోటీసులో డిమాండ్ చేశారు.
KTR | హైదరాబాద్, త్రినేత్ర న్యూస్ : ఫార్ములా-ఈ రేసు నిధుల దుర్వినియోగం కేసులో (Formula E case) తన పాస్‌పోర్టు జప్తు అయిందంటూ (passport seize) ప్రముఖ తెలుగు దినపత్రిక ఈనాడులో వచ్చిన వార్తపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక ప్రముఖ దినపత్రిక వాస్తవాలు నిర్ధారణ చేసుకోకుండా తప్పుడు వార్తలు ప్రచురించడం శోచనీయమన్నారు. ఈ మేరకు సదరు పత్రికకు లీగల్ నోటీసు పంపినట్లు చెప్పారు.
తన పాస్‌పోర్టు జప్తు చేయాలని కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 29న ఈనాడు ప్రచురించిన కథనంలో.. కేవలం ఒక సాధారణ మెమోను కోర్టు ఆదేశాలుగా తప్పుగా చిత్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించేలా వార్త రాశారని ఆరోపించారు. తప్పుడు వార్తను 48 గంటల్లోగా ఉపసంహరించుకోవాలని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆ నోటీసులో డిమాండ్ చేశారు. ప్రింట్ ఎడిషన్‌తో పాటు వెబ్‌సైట్, ఈ-పేపర్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఈ తప్పును సరిదిద్దుతూ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో క్రిమినల్ పరువు నష్టం దావాతోపాటూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (Press Council of India)ను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. కాగా, కేటీఆర్‌తో సహా నలుగురి పాస్‌పోర్టులను తాత్కాలికంగా జప్తు చేయాలని ఏసీబీ కోర్టు రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్‌కు లేఖ రాసినట్లు ఈనాడు పత్రిక ఇటీవలే వార్త ప్రచురించిన విషయం తెలిసిందే.
నా పాస్‌పోర్టు విషయంలో తప్పుడు వార్త ప్రచురించిన ఈనాడు దినపత్రికకు, నా న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ పంపించాను.
50 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక ప్రముఖ దినపత్రిక వాస్తవాలు నిర్ధారణ చేసుకోకుండా, తప్పుడు వార్తలు ప్రచురించడం శోచనీయం.
సదరు తప్పుడు వార్తను అన్ని మాధ్యమాల నుండి వెంటనే ఉపసంహరించుకుని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.
— KTR (@KTRBRS) October 6, 2026
Also Read..
మేజరైన కుమార్తెను తమతోనే ఉండేలా తల్లిదండ్రులు బలవంతం చేయలేరు : హైకోర్టు
ఇండీ కూటమి సేవ్ డెమొక్రసీ మార్చ్.. ఢిల్లీలో టెన్షన్ టెన్షన్
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Allahabad High Court | మేజరైన కుమార్తెను తమతోనే ఉండేలా తల్లిదండ్రులు బలవంతం చేయలేరు : హైకోర్టు
- ●Indian Stock Market | లార్జ్ క్యాప్స్ వర్సెస్ స్మాల్ క్యాప్స్.. ఇన్వెస్టర్ల చూపు ఎటు వైపు..?
- ●Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..
- ●Woman Molest | 'పది'లో పరిచయం.. పెళ్లాయ్యాక కానిస్టేబుల్ లైంగికదాడి
- ●INDIA bloc | ఇండీ కూటమి సేవ్ డెమొక్రసీ మార్చ్.. ఢిల్లీలో టెన్షన్ టెన్షన్
- ●Vijayasai Reddy | 8న మరో ఐదు ప్రతిపాదనలు.. కొత్త పార్టీపై విజయసాయి రెడ్డి కీలక అప్డేట్

Allahabad High Court | మేజరైన కుమార్తెను తమతోనే ఉండేలా తల్లిదండ్రులు బలవంతం చేయలేరు : హైకోర్టు

Indian Stock Market | లార్జ్ క్యాప్స్ వర్సెస్ స్మాల్ క్యాప్స్.. ఇన్వెస్టర్ల చూపు ఎటు వైపు..?

Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

Woman Molest | 'పది'లో పరిచయం.. పెళ్లాయ్యాక కానిస్టేబుల్ లైంగికదాడి






