త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmika Mandanna | గ‌ర్ల్‌ఫ్రెండ్ కాంబో రిపీట్ – ద‌ర్శ‌కుడికి ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న ర‌ష్మిక‌

"ది గ‌ర్ల్‌ఫ్రెండ్" త‌ర్వాత డైరెక్ట‌ర్ రాహుల్ ర‌వీంద్ర‌న్‌తో ర‌ష్మిక మంద‌న్న మ‌రో సినిమా చేయ‌బోతున్నారు. ప్ర‌యోగాత్మ‌క కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో అడివి శేష్ హీరోగా న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో ఈ సినిమాపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు చెబుతున్నారు.

N

Entertainment | Published On Nov 21, 2026, 1.50 pm IST

Rashmika Mandanna | గ‌ర్ల్‌ఫ్రెండ్ కాంబో రిపీట్ – ద‌ర్శ‌కుడికి ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న ర‌ష్మిక‌
Advertisement

Rashmika Mandanna | నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న తెలుగులో మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. టాలీవుడ్ యంగ్ హీరో అడివిశేష్‌తో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించిన మైసా న‌వంబ‌ర్ 27న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ర‌వీంద్ర పుల్లే ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ యాక్ష‌న్ జాన‌ర్‌ను ట‌చ్ చేస్తోంది ర‌ష్మిక‌. మైసా త‌ర్వాత ర‌ష్మిక మంద‌న్న కొత్త సినిమా ఏద‌న్న‌ది అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

ప్ర‌యోగానికి సిద్ధం...

తాజాగా ఈ తెలంగాణ కోడ‌లు మ‌రో ప్ర‌యోగానికి సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. అడివి శేష్ హీరోగా రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రాబోతుంది. ఇందులో నేష‌న‌ల్ క్ర‌ష్ హీరోయిన్‌గా ఫిక్స్ అయిన‌ట్లు తెలిసింది. అడివి శేష్ గ‌త సినిమాల త‌ర‌హాలోనే డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొంద‌నున్న‌ట్లు స‌మాచారం. అడివి శేష్‌తో పాటు ర‌ష్మిక పాత్ర‌లు ఛాలెంజింగ్‌గా ఉంటాయ‌ని అంటున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ప‌నులు తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లు తెలిసింది. 2027 జ‌న‌వ‌రిలో అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.

ది గ‌ర్ల్‌ఫ్రెండ్‌...

గతంలో రాహుల్ ర‌వీంద్ర‌న్ డైరెక్ష‌న్‌లో "ది గ‌ర్ల్‌ఫ్రెండ్" సినిమా చేసింది ర‌ష్మిక మంద‌న్న‌. గ్లామ‌ర్ పాత్ర‌లు త‌ప్ప ఎమోష‌న‌ల్ రోల్స్‌కు ర‌ష్మిక న్యాయం చేయ‌లేద‌నే విమ‌ర్శ‌ల‌కు ఈ స‌క్సెస్‌తోనే బ‌దులిచ్చింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు న్యాయం చేయ‌గ‌ల‌ద‌ని నిరూపించుకుంది. గ‌ర్ల్‌ఫ్రెండ్ టైమ్‌లోనే రాహుల్ ర‌వీంద్ర‌న్‌తో మ‌రో సినిమా చేస్తాన‌ని ర‌ష్మిక మాటిచ్చింది. ఇచ్చిన మాట‌ను ఇప్పుడు నిల‌బెట్టుకోబోతుంది.

గూఢ‌చారి 2...

మ‌రోవైపు హీరోగా ప్ర‌స్తుతం "గూఢ‌చారి 2" సినిమా చేస్తున్నాడు అడివిశేష్‌. ఇమ్రాన్ హ‌ష్మీ, వామికా గ‌బ్బి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీ వ‌చ్చే ఏడాది మేలో థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

 

Advertisement
Advertisement