త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Damodar Raja Narasimha | ఐవీఎఫ్ ద్వారా ట్రిప్లెట్స్ జ‌న‌నం.. గాంధీ వైద్యుల‌కు మంత్రి దామోద‌ర అభినంద‌న‌లు

Damodar Raja Narasimha | తల్లిదండ్రులు కావాలనే ఆనందం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న దంపతుల ఆశలను గాంధీ ఆసుపత్రి నెర‌వేరుస్తుంది. ఉచిత ఐవీఎఫ్ చికిత్స ద్వారా సంతానలేమితో బాధపడుతున్న ఎందరో దంపతులు తల్లిదండ్రులు కావాలనే తమ కలను సాకారం చేసుకుంటున్నారు అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ పేర్కొన్నారు.

S

Telangana | Published On Nov 21, 2026, 1.59 pm IST

Damodar Raja Narasimha | ఐవీఎఫ్ ద్వారా ట్రిప్లెట్స్ జ‌న‌నం.. గాంధీ వైద్యుల‌కు మంత్రి దామోద‌ర అభినంద‌న‌లు
Advertisement

Damodar Raja Narasimha | త్రినేత్ర న్యూస్ : తల్లిదండ్రులు కావాలనే ఆనందం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న దంపతుల ఆశలను గాంధీ ఆసుపత్రి నెర‌వేరుస్తుంది. ఉచిత ఐవీఎఫ్ చికిత్స ద్వారా సంతానలేమితో బాధపడుతున్న ఎందరో దంపతులు తల్లిదండ్రులు కావాలనే తమ కలను సాకారం చేసుకుంటున్నారు అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ పేర్కొన్నారు. ఇటీవల ముగ్గురు కవలల (ట్రిప్లెట్స్) జననం కూడా ఇందులో భాగమే అని తెలిపారు. అంకితభావంతో సేవలందిస్తున్న వైద్యులు, ఐవీఎఫ్ నిపుణులు, ఎంబ్రియాలజిస్టులు, నర్సులు, మొత్తం గాంధీ ఐవీఎఫ్ బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియ‌జేస్తున్నాను. ఆర్థిక ఇబ్బందులు ఎప్పటికీ మాతృత్వానికి ఆటంకం కాకూడదన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి నాణ్యమైన సంతాన సాఫల్య వైద్యం అందుబాటులో ఉండాల‌ని మంత్రి దామోద‌ర పేర్కొన్నారు.

 

Advertisement
Advertisement