త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ఫేక్ గాంధీ.. మీకు న‌చ్చినన్ని కేసులు పెట్టుకోండి : కేటీఆర్

KTR | కాంగ్రెస్ ప్ర‌భుత్వ అక్ర‌మాల‌పై ప్ర‌శ్నిస్తున్న బీఆర్ఎస్ నేత మ‌న్నె క్రిశాంక్‌పై తాజాగా ఎఫ్ఐఆర్ న‌మోద‌వ్వ‌డంపై ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.

S

Telangana | Published On Oct 6, 2026, 10.40 am IST

KTR | ఫేక్ గాంధీ.. మీకు న‌చ్చినన్ని కేసులు పెట్టుకోండి : కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర న్యూస్ : కాంగ్రెస్ ప్ర‌భుత్వ అక్ర‌మాల‌పై ప్ర‌శ్నిస్తున్న బీఆర్ఎస్ నేత మ‌న్నె క్రిశాంక్‌పై తాజాగా ఎఫ్ఐఆర్ న‌మోద‌వ్వ‌డంపై ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ప‌రిమితి లేని ఏటీఎంలా మారిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అవినీతి సామ్రాజ్యాన్ని మీరు(మ‌న్నె క్రిశాంక్) ప్ర‌శ్నిస్తున్నారు. 420 హామీల ఫేక్ గాంధీ క‌చ్చితంగా కేసులు పెడుతాడు. మిస్ట‌ర్ ఫేక్ గాంధీ.. మీకు న‌చ్చిన‌న్ని కేసులు పెట్టుకోండి. కాంగ్రెస్ నేత‌ల అవినీతిని బ‌ట్ట‌బ‌య‌లు చేస్తూనే ఉంటాం. ఇది నా ప్రామీస్.. రాబోయే రోజుల్లో ఇలాంటివి మ‌రెన్నో బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement