BRS Leaders | కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
BRS Leaders | నవంబర్ 22న కేడీసీ గ్రౌండ్‌లో నిర్వహించనున్న జన చైతన్య సభ నేపథ్యంలో సభా స్థలిని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ, మాజీ చైర్మన్లు, మాజీ కార్పొరేటర్లతో కలిసి పరిశీలించారు.
కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలన్నదే ప్రజల ఆకాంక్ష
కేటీఆర్ సభకు అంచనాలకు మించి ప్రజలు తరలిరానున్నారు
ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
BRS Leaders | త్రినేత్ర న్యూస్ : నవంబర్ 22న కేడీసీ గ్రౌండ్‌లో నిర్వహించనున్న జన చైతన్య సభ నేపథ్యంలో సభా స్థలిని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ, మాజీ చైర్మన్లు, మాజీ కార్పొరేటర్లతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. సభకు సుమారు 20 వేల మంది వస్తారని తొలుత అంచనా వేసినప్పటికీ, ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే అంతకుమించిన స్థాయిలో జనసమీకరణ జరిగే అవకాశం ఉందన్నారు. కేటీఆర్ ప్రసంగాన్ని వినేందుకు వేలాదిగా ప్రజలు తరలిరానున్నారని, సభా ప్రాంగణం కూడా సరిపోని పరిస్థితి ఏర్పడవచ్చని అభిప్రాయపడ్డారు.
ఇతర పార్టీలకు చెందిన నాయకులతో పాటు వివిధ రంగాలకు చెందిన మేధావులు, పలువురు ప్రముఖులు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. గత మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ పదేళ్ల పాలనలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని, గులాబీ సైనికులుగా ప్రజల పక్షాన నిలుస్తామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా చూడాలన్నదే ప్రజల ఆకాంక్షగా ఉందని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీఆర్ఎస్ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని తెలిపారు.
ప్రజలను చైతన్య పరిచేందుకే జన చైతన్య సభ : మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ.. ప్రజలను చైతన్యపరిచేందుకే జన చైతన్య సభ. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే అభయహస్తం హామీలను అమలు చేస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. అయితే మూడేళ్ల పాలన పూర్తవుతున్నా హామీల అమలులో ఆశించిన పురోగతి లేదని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం రాజకీయ విమర్శలు, వ్యక్తిగత దూషణలకు ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న అనంతరం ఉద్యమ నాయకుడు కేసీఆర్ పదేళ్లపాటు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.
రాష్ట్రానికి తిరిగి పూర్వవైభవం రావాలంటే కేసీఆర్ నాయకత్వం అవసరమని, ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడమే జన చైతన్య సభ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ సభలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, మేధావులు, విద్యావేత్తలు బీఆర్ఎస్‌లో చేరనున్నారని వెల్లడించారు. కార్మికులు, కర్షకులు, యువత, మేధావులు, విద్యావేత్తలు, పత్రికా మిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
రేవంత్ ప్రభుత్వం విఫలమైంది : మాజీ మంత్రి ఎర్రబెల్లి
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో నాయకులు, ఎమ్మెల్యేలే అసంతృప్తితో ఉన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలను కాపాడుకునే పరిస్థితి కూడా లేదని, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తి నెలకొందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, మేధావులు బీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రస్తుత పాలనపై ప్రజలతో పాటు అధికార పార్టీ నాయకుల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. రైతులు సాగునీరు, విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, పట్టణ ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు.
420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలులో విఫలమైందని, కనీసం గత ప్రభుత్వం అమలు చేసిన రైతు, ప్రజా సంక్షేమ పథకాలనైనా కొనసాగించి ప్రజలకు మేలు చేయాలని హితవు పలికారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాస్తవ పరిస్థితులను గుర్తించి రైతులు, పట్టణ ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Special Trains | ప్రయాణికులకు అలర్ట్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు
- ●WhatsApp | గుడ్న్యూస్ చెప్పిన వాట్సాప్.. గ్రూప్ సభ్యుల పరిమితి పెంపు..
- ●E-Waste | టెక్నాలజీ పెరిగే.. ఈ-వ్యర్థాలు పేరుకుపోయే!
- ●MK Stalin | స్టాలిన్ రీ ఎంట్రీ ఇస్తారా..? బాబు మృతితో అందరి చూపు కొలత్తూరు ఉప ఎన్నికపైనే
- ●Traffic Restrictions | రాణిగంజ్ ఆర్యూబీ విస్తరణ.. ఆ మార్గంలో 6 నెలలు ట్రాఫిక్ ఆంక్షలు
- ●Gold Prices | దీపావళికి బంగారం కొన్నారా? ఇప్పుడు దాని విలువ ఎంతంటే?

Special Trains | ప్రయాణికులకు అలర్ట్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు

WhatsApp | గుడ్న్యూస్ చెప్పిన వాట్సాప్.. గ్రూప్ సభ్యుల పరిమితి పెంపు..

E-Waste | టెక్నాలజీ పెరిగే.. ఈ-వ్యర్థాలు పేరుకుపోయే!

MK Stalin | స్టాలిన్ రీ ఎంట్రీ ఇస్తారా..? బాబు మృతితో అందరి చూపు కొలత్తూరు ఉప ఎన్నికపైనే





