INDIA bloc | ఇండీ కూటమి సేవ్ డెమొక్రసీ మార్చ్.. ఢిల్లీలో టెన్షన్ టెన్షన్
INDIA bloc | ఎన్నికల సంఘం తీరుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండీ కూటమి (INDIA bloc) సేవ్ డెమొక్రసీ (save democracy) పేరుతో మార్చ్ నిర్వహించింది. పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వరకూ ర్యాలీ ప్రారంభించింది. కూటమిలోని పార్టీల నేతలు ఈ మార్చ్‌లో పాల్గొని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) రాజీనామా చేయాల్సిందే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ మార్చ్ నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు భారీ భద్రతను (high security in Delhi) ఏర్పాటు చేశారు.
INDIA bloc | త్రినేత్ర న్యూస్ : ఎన్నికల సంఘం తీరుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండీ కూటమి (INDIA bloc) భారీ నిరసనలను ప్రారంభించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను అడ్డుపెట్టుకుని ఓట్ చోరీ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఇవాళ ఉదయం కూటమి పార్టీ నేతలు పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వరకూ సేవ్ డెమొక్రసీ పేరుతో మార్చ్ (save democracy protest march) నిర్వహించారు. ఈ సందర్బంగా జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) రాజీనామా చేయాల్సిందే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ మార్చ్‌లో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా ఇండీ కూటమిలోని ప్రధాన పార్టీల నేతలు పాల్గొన్నారు.
#WATCH | Delhi | Congress MP Priyanka Gandhi Vadra and NCP-SP MP Supriya Sule, along with many INDIA bloc MPs, protest march to Election Commission of India https://t.co/ltvjHtKr6c
— ANI (@ANI) October 6, 2026
మరోవైపు ఇండీ కూటమి మార్చ్ నేపథ్యంలో రాజధానిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేసింది. నగరంలో భారీగా పోలీసులు మోహరించారు. ముఖ్యంగా ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌కు చెందిన సుమారు 3,000 మందికిపైగా బలగాలను రంగంలోకి దింపారు. ప్రధాన మార్గాల్లో బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో ముళ్లకంచెలు, బారికేడ్లను పెట్టారు. ఈ ర్యాలీ దృష్ట్యా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ అడ్వైజరీ జారీ చేశారు.
#WATCH | Delhi: Security tightened outside the Election Commission of India office, ahead of the INDIA bloc MPs' protest march from Makar Dwar to here, over CEC Gyanesh Kumar matter. https://t.co/AY0VfRLyuS
— ANI (@ANI) October 6, 2026
ఆ పప్పెట్ దిగిపోవాల్సిందే..
ఈ మార్చ్ సందర్భంగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భారీ అవకతవకలు, రిగ్గింగ్ జరిగాయని ఆరోపించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ దీనిని స్వయంగా పర్యవేక్షించారని చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేతిలో తోలుబొమ్మలా మారిన జ్ఞానేశ్ పదవి నుంచి దిగిపోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆ కీలుబొమ్మను ఆడించే ఇద్దరు వ్యక్తులు (ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశిస్తూ) కూడా బాధ్యత వహించాల్సిందేనన్నారు. వారి బండారం మొత్తం బయటపడిందని వ్యాఖ్యానించారు.
#WATCH | Delhi | LoP, Lok Sabha, Rahul Gandhi, along with INDIA bloc MPs, marches to the Election Commission of India https://t.co/OwLWdXvhoo
— ANI (@ANI) October 6, 2026
Also Read..
8న మరో ఐదు ప్రతిపాదనలు.. కొత్త పార్టీపై విజయసాయి రెడ్డి కీలక అప్డేట్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Form 6 Supreme Court | ఫారం-6 మార్పులకు మేం ఓకే చెప్పలేదు: ఎన్నికల సంఘం వాదనను కొట్టిపారేసిన సుప్రీంకోర్టు
అక్టోబర్ 5, 2026

SIR | బీజేపీ నేతలు.. ఫాం-7 ద్వారా ముస్లిం ఓట్లను ఎలా తొలగిస్తున్నారంటే…
అక్టోబర్ 5, 2026

Manne Krishank | ట్వీట్ల వల్ల ప్రయోజనం లేదు సార్.. సీఎం రేవంత్ అక్రమ సంపాదనపై విచారణ జరిపించండి.. మన్నె క్రిషాంక్
అక్టోబర్ 5, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..
- ●Woman Molest | 'పది'లో పరిచయం.. పెళ్లాయ్యాక కానిస్టేబుల్ లైంగికదాడి
- ●Vijayasai Reddy | 8న మరో ఐదు ప్రతిపాదనలు.. కొత్త పార్టీపై విజయసాయి రెడ్డి కీలక అప్డేట్
- ●KTR | ఫేక్ గాంధీ.. మీకు నచ్చినన్ని కేసులు పెట్టుకోండి : కేటీఆర్
- ●Stock Markets | మార్కెట్లకు గ్లోబల్ బూస్ట్.. నిఫ్టీ 22,600 పైన..
- ●RGIA | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం

Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

Woman Molest | 'పది'లో పరిచయం.. పెళ్లాయ్యాక కానిస్టేబుల్ లైంగికదాడి

Vijayasai Reddy | 8న మరో ఐదు ప్రతిపాదనలు.. కొత్త పార్టీపై విజయసాయి రెడ్డి కీలక అప్డేట్

KTR | ఫేక్ గాంధీ.. మీకు నచ్చినన్ని కేసులు పెట్టుకోండి : కేటీఆర్



