KCR | సామాజిక సంపద సృష్టికర్తలు.. మహిళలు: కేసీఆర్
KCR | అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day) సందర్భంగా మహిళాలోకానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సామాజిక సంపద సృష్టికర్తలని, దేశాభివృద్ధిలో పురుషుడితో సమానంగా స్త్రీ భాగస్వామ్యం ఇమిడివున్నదన్నారు.
KCR | త్రినేత్ర.న్యూస్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day) సందర్భంగా మహిళాలోకానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సామాజిక సంపద సృష్టికర్తలని, దేశాభివృద్ధిలో పురుషుడితో సమానంగా స్త్రీ భాగస్వామ్యం ఇమిడివున్నదన్నారు. సంతానోత్పత్తి అనే అనివార్యమైన ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత స్త్రీకి ప్రకృతి కేటాయించిందని, మానవ మనుగడను కొనసాగించే ప్రత్యేక కర్తవ్యాన్ని అనేక కష్టాలతో నిర్వర్తిస్తున్న మహిళ త్యాగశీలి అని కొనియాడారు.
ఆకాశంలో సగమై, అపారమైన శక్తి సామర్థ్యాలు కలిగివున్న మహిళా లోకానికి అన్ని రంగాల్లో పురుషునితో సమానమైన అవకాశాలను మరింతగా అందించినపుడు మాత్రమే, కుటుంబాభివృద్ధి సంపూర్ణ మవుతుందని, తద్వారా సమాజ, దేశ, ప్రపంచాభివృద్ధి ఫరిడవిల్లుతుందని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో,అనంతర స్వయంపాలనలో తెలంగాణ మహిళల పాత్ర గొప్పదని వివరించారు. మహిళా సాధికారత దిశగా, వారి సంక్షేమం, ప్రగతికోసం పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. మహిళా సాధికారతను మరింతగా పెంచే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరమున్నదని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రపతి పదవిని బీజేపీ దుర్వినియోగం చేస్తోంది: సీఎం మమతా బెనర్జీ
గల్ఫ్ నుంచి 52వేల మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు.. వెల్లడించిన ఎంఈఏ..
ఇరాన్ ఆయిల్ డిపోలపై ఇజ్రాయెల్ దాడులు.. భారీగా ఎగసిపడిన మంటలు
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



