త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Oil Depot | ఇరాన్ ఆయిల్‌ డిపోలపై ఇజ్రాయెల్‌ దాడులు.. భారీగా ఎగ‌సిప‌డిన మంట‌లు

Oil Depot | ప‌శ్చిమాసియాలో యుద్ధం మ‌రింత ముదురుతున్న‌ది. తొమ్మిదిరోజులుగా సాగుతున్న యుద్ధంలో ఇరాన్‌లోని (Iran) సైనిక స్థావరాలు, వ్యూహాత్మ‌క స్థ‌లాలు, బంక‌ర్లే ల‌క్ష్యంగా దాడుల‌కు పాల్ప‌డిన ఇజ్రాయెల్ (Israel), అమెరికా సేన‌లు.. తాజాగా చ‌మురు డిపోల‌పై (Oil Depot) విరుచుకుప‌డ్డాయి.

G

International | Published On Mar 8, 2026, 9.26 am IST

Oil Depot | ఇరాన్ ఆయిల్‌ డిపోలపై ఇజ్రాయెల్‌ దాడులు.. భారీగా ఎగ‌సిప‌డిన మంట‌లు
Advertisement

Oil Depot | త్రినేత్ర‌.న్యూస్‌: ప‌శ్చిమాసియాలో యుద్ధం మ‌రింత ముదురుతున్న‌ది. తొమ్మిదిరోజులుగా సాగుతున్న యుద్ధంలో ఇరాన్‌లోని (Iran) సైనిక స్థావరాలు, వ్యూహాత్మ‌క స్థ‌లాలు, బంక‌ర్లే ల‌క్ష్యంగా దాడుల‌కు పాల్ప‌డిన ఇజ్రాయెల్ (Israel), అమెరికా సేన‌లు.. తాజాగా చ‌మురు డిపోల‌పై (Oil Depot) విరుచుకుప‌డ్డాయి. ఆదివారం తెల్ల‌వారుజామున ద‌క్షిణ టెహ్రాన్‌లోని ఆయిల్ డిపోలు, రిఫైన‌రీ కాంప్లెక్సుల‌పై దాడి చేసింది. దీంతో భారీగా మంట‌లు వ్యాపించాయి. ఇరాన్‌ ఇక్కడి నుంచే చమురును సైన్యం సహా పలు శాఖలకు తరలిస్తుంటుందని ఇజ్రాయెల్ సైన్యం ఐడీఎఫ్‌ వెల్లడించింది. ఆ దేశ సైనిక మౌలిక వసతులను దెబ్బతీయడంలో మరో అడుగు వేశామని పేర్కొంది. మొత్తం మూడు డిపోల్లో మంటలు వ్యాపించినట్లు అంత‌ర్జాతీయ మీడియా వెల్ల‌డించింది.

https://x.com/BRICSinfo/status/2030408820774642119

మ‌రోవైపు ఇరాన్ కూడా దాడులు ముమ్మ‌రం చేసింది. కువైట్‌లోని (Kuwait) కీలక భ‌వ‌నాల‌పై దాడులకు పాల్ప‌డింది. ఆ దేశ సోష‌ల్ సెక్యూరిటీ భ‌వ‌నంపై డ్రోన్ల‌తో దాడులు చేసింది. కువైట్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద రెండు చమురు డిపోలపై దాడులు జరిగాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

https://x.com/BRICSinfo/status/2030473137603674121

ఇక దుబాయ్‌లోని మెరీనాలో ఒక ఎత్త‌యిన భ‌వ‌నంపై ఇరాన్ ప్ర‌యోగించిన బాలిస్టిక్ క్షిప‌ణి శ‌కలాలు ప‌డ్డాయి. దీంతో బిల్డింగ్ నుంచి భారీగా పొగ‌లు వ‌చ్చాయి. ఇరాన్ ప్ర‌యోగించిన బాలిస్టిక్ క్షిప‌ణిని యూఏఈ గ‌గ‌న‌త‌ల ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ విజ‌య‌వంతంగా అడ్డుకున్న‌ప్ప‌టికీ, దాని శ‌క‌లాలు ఒక ట‌వ‌ర్ ఫాసాడ్‌పై ప‌డ‌టంతో స్వ‌ల్ప న‌ష్టం జ‌రిగింద‌ని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌రుగ‌లేద‌ని, ప్ర‌స్తుతం ప‌రిస్థితి అదుపులోనే ఉన్న‌ద‌ని వెల్ల‌డించారు. ఇరాన్ నుంచి మొత్తం 16 బాలిస్టిక్ క్షిప‌ణులు, 121 డ్రోన్లు వ‌చ్చిన‌ట్లు యూఏఈ ర‌క్ష‌ణ విభాగం గుర్తించింది. వాటిలో 15 క్షిప‌ణుల‌ను, 119 డ్రోన్ల‌ను గాలిలోనే కూల్చేసిన‌ట్లు వెల్ల‌డించింది.

https://x.com/AJENews/status/2030424830768455689

Also Read..

కామారెడ్డిలో విషాదం.. పెంచ‌లేక ముగ్గురు పిల్ల‌ల‌ను చంపిన తండ్రి

బ్యాట్‌ Vs బాల్‌.. అహ్మదాబాద్‌ వేదికగా నేడు రసవత్తర పోరు

ఉమెన్స్ డే స్పెషల్: సైబరాబాద్ ఖాకీ వనితలకు ‘సలాం’.. ప్రాణాలు కాపాడిన సాహసానికి ఉన్నతాధికారుల నీరాజనం!

Advertisement
Advertisement