త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS Australia | ఆస్ట్రేలియాలో ఘనంగా కేసీఆర్ దీక్షా దివస్

BRS Australia | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఆస్ట్రేలియాలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఎన్నారై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

P

Telangana | Published On Nov 28, 2026, 6.50 pm IST

BRS Australia | ఆస్ట్రేలియాలో ఘనంగా కేసీఆర్ దీక్షా దివస్
Advertisement
  • తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకున్న ప్రవాస తెలంగాణీయులు
  • అమరుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాలి: అనిల్ బైరెడ్డి

BRS Australia | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఆస్ట్రేలియాలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఎన్నారై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమంలో చారిత్రాత్మక ఘట్టమని ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకుడు అనిల్ బైరెడ్డి అన్నారు.

ఆ దీక్షతో ఉద్యమం మరింత ఉధృతమైందని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయని పేర్కొన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, యువత, ప్రజాసంఘాలు ఐక్యంగా ఉద్యమంలో పాల్గొన్నాయని గుర్తుచేశారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను, ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కృషిని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు కూడా మాతృభూమి పట్ల ప్రేమను, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ వరంగల్ జిల్లా సీనియర్ నాయకురాలు డాక్టర్ హరి రమాదేవి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల పాత్ర మరువలేనిదన్నారు.

ఆస్ట్రేలియాలో బీఆర్ఎస్ కార్యక్రమాలను నిర్వహిస్తున్న అనిల్ బైరెడ్డి బృందాన్ని అభినందించారు. ఈ నెల 29న కరీంనగర్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా నిర్వహించనున్న దీక్షా దివస్ సభకు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని అనిల్ బైరెడ్డి బృందం పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అనిల్ బైరెడ్డితో పాటు రమేశ్‌ బాబు హరి, సత్య గుండా, రవీందర్ చుక్క, రాహుల్ నాడిదే, దీపక్ హరి, ప్రవీణ్, పవన్ రెడ్డి, నవీన్, కుల్విందర్ బజ్వా, శ్యామ్ లింగంపల్లి, రఘు, శిరీష‌, దీప్తి, సతీశ్‌ మాచర్ల, కవల్ సింగ్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement