MEA | గల్ఫ్ నుంచి 52వేల మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు.. వెల్లడించిన ఎంఈఏ..
MEA | పశ్చిమ ఆసియాలో పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయుల భద్రతపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తుందని భారత్ తెలిపింది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్న భారత పౌరుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
MEA | పశ్చిమ ఆసియాలో పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయుల భద్రతపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తుందని భారత్ తెలిపింది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్న భారత పౌరుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. శనివారం అర్ధరాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపిన వివరాల ప్రకారం, ఆ ప్రాంతంలో గగనతలం కొంత మేర తెరుచుకున్న తర్వాత ఇప్పటివరకు 52వేల మందికి పైగా భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారని వెల్లడించింది. అదే సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న భారతీయులు స్థానిక అధికారుల మార్గదర్శకాలు, భారత దౌత్య కార్యాలయాలు జారీ చేస్తున్న సూచనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
భారతీయుల భద్రత, సంక్షేమం ముఖ్యం..
విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రత, సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అవసరమైన సహాయం అందించేందుకు ఆ ప్రాంతంలోని పలు దేశాల ప్రభుత్వాలతో భారత్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని తెలిపింది. పశ్చిమ ఆసియాలో భద్రతా పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే కొనసాగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ స్థావరాలపై దాడులు కొనసాగిస్తుండగా, టెహ్రాన్ కూడా ఇజ్రాయెల్ స్థావరాలు, ఆ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై ప్రతిదాడులు చేస్తోంది. పశ్చిమ ఆసియా, గల్ఫ్ ప్రాంతాల్లో మారుతున్న పరిస్థితులను భారత ప్రభుత్వం నిరంతరం గమనిస్తోంది. ముఖ్యంగా అక్కడ ప్రయాణంలో లేదా తాత్కాలికంగా ఉండి చిక్కుకుపోయిన భారతీయుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం.. అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
24 గంటల హెల్ప్ లైన్ ఏర్పాటు..
ఆ ప్రాంతంలో ఉన్న భారతీయులు స్థానిక అధికారుల మార్గదర్శకాలను, అలాగే తమ ప్రాంతంలోని భారత రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్ జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నాం.. అని MEA పేర్కొంది. ఆ ప్రాంతంలోని భారత దౌత్య కార్యాలయాలు ఇప్పటికే వివరణాత్మక సూచనలు జారీ చేసి 24 గంటల హెల్ప్‌లైన్ సదుపాయాలను ఏర్పాటు చేశాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో గగనతలం కొంతవరకు తెరుచుకోవడంతో భారతీయ, విదేశీ విమానయాన సంస్థలు వాణిజ్య విమానాలను నడుపుతున్నాయని తెలిపింది. వీటిలో షెడ్యూల్ కాని ప్రత్యేక విమానాలు కూడా ఉన్నాయని, ఆ దేశాల్లో ప్రయాణంలో ఉన్న లేదా తాత్కాలికంగా ఉన్న భారతీయులు తిరిగి స్వదేశానికి చేరుకునేందుకు వీలు కల్పిస్తున్నాయని వెల్లడించింది.
52వేల మంది భారతీయులు స్వదేశానికి..
మార్చి 1 నుంచి 7 వరకు గల్ఫ్ ప్రాంతం నుంచి మొత్తం 52వేల మందికి పైగా భారతీయులు ఈ విమానాల ద్వారా సురక్షితంగా భారత్‌కు చేరుకున్నారు. వీరిలో 32,107 మంది భారతీయ విమానయాన సంస్థల ద్వారా ప్రయాణించారు. రాబోయే రోజుల్లో మరిన్ని విమానాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.. అని MEA తెలిపింది. వాణిజ్య విమాన సేవలు అందుబాటులో లేని దేశాల్లో ఉన్న భారతీయులు సమీపంలోని భారత రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్‌ను సంప్రదించి అందుబాటులో ఉన్న సమీప వాణిజ్య విమానాల వివరాలు తెలుసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ సూచించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






