Kaloji Health University | విద్యార్థులకు అలర్ట్.. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ
Kaloji Health University | నీట్ పరీక్షలో పాసైన విద్యార్థులకు అలర్ట్. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో 2026–-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) కోర్సుల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా (కన్వీనర్ కోటా) సీట్లలో ప్రవేశాల కోసం కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ (Kaloji Health University) నోటిఫికేషన్ విడుదల చేసింది.
Kaloji Health University | త్రినేత్ర.న్యూస్ : నీట్ పరీక్షలో పాసైన విద్యార్థులకు అలర్ట్. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో 2026–-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) కోర్సుల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా (కన్వీనర్ కోటా) సీట్లలో ప్రవేశాల కోసం కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ (Kaloji Health University) నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ యూజీ 2026 (NEET UG-–2026)లో క్వాలిఫై అయిన విద్యార్థులు ఆగస్టు 5 ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 12 సాయంత్రం 6 గంటల వరకు tsmedadm.tsche.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ సూచించింది.
సీట్ల మ్యాట్రిక్స్‌ను వెబ్ ఆప్షన్లకు ముందు ప్రత్యేకంగా ప్రకటిస్తామని పేర్కొంది. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకునే ముందు ప్రాస్పెక్టస్‌ను పూర్తిగా చదివి, అర్హతలు, రిజర్వేషన్లు, అవసరమైన ధ్రువపత్రాలు, నిబంధనలను పరిశీలించి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. పూర్తి వివరాలు, సమాచారం కోసం knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరింది.
విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు
- ఆన్‌లైన్ దరఖాస్తుతో పాటు అన్ని సర్టిఫికెట్లను తప్పకుండా అప్‌లోడ్ చేయాలి.
- నమోదు ప్రక్రియ ఒక్కసారి మాత్రమే ఉంటుంది. ప్రతి రౌండ్ కౌన్సెలింగ్‌కు మళ్లీ సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు.
- సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల చేస్తారు.
- అనంతరం వెబ్ ఆప్షన్లు, కౌన్సెలింగ్ షెడ్యూల్, సీట్ల మ్యాట్రిక్స్‌ను KNRUHS వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.
- వెబ్ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు కళాశాలల ప్రాధాన్యత క్రమాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని విశ్వవిద్యాలయం సూచించింది.
Also Read..
30 సెకన్లలో 34 కత్తిపోట్లు.. స్కూల్ టీచర్‌పై వ్యక్తి పైశాచిక దాడి
డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కు పూర్తి స్థాయి అధికారిని నియమించాలి.. హరీశ్ రావు డిమాండ్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అభిప్రాయ సేకరణ చేపట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్
సంబంధిత వార్తలు

NEET Paper Leak | నీట్ పేపర్ లీక్ చేసింది ఎన్టీఏ సబ్జెక్టు నిపుణులే.. గుట్టు విప్పిన సీబీఐ
ఆగస్టు 7, 2026

Minister Uttam Kumar Reddy | రైతుల ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం.. ప్రతీ గింజకూ లెక్క చెప్పాల్సిందే : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
ఆగస్టు 4, 2026

Harish Rao | డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కు పూర్తి స్థాయి అధికారిని నియమించాలి.. హరీశ్ రావు డిమాండ్
ఆగస్టు 4, 2026
తాజావార్తలు
- ●Bhagyashri Borse | రాకా మ్యూజిక్ డైరెక్టర్‌తో భాగ్యశ్రీ బోర్సే స్టెప్పులు - ఒక్క పాటకు రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?
- ●Chamala Kirankumar Reddy | బీఆర్ఎస్ సోషల్ మీడియాకే పరిమితమైంది.. బావ, బామ్మర్దులిద్దరూ దౌర్భాగ్యులే
- ●Gen Z | జెన్‌జీపై అంత శ్రద్ధ ఉంటే.. అమిత్ షాచేత రాజీనామా చేయించండి.. మోహన్ భగవత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్
- ●Drumstick | దానిమ్మ కంటే మునగ కాయలే బెటర్.. ఆ మగాడి టర్నోవర్ ఏడాదికి రూ. 1.15 కోట్లు..!
- ●JSW MG | ఒక్కసారి చార్జింగ్ చేస్తే 1100 కిలోమీటర్ల మైలేజ్.. భారత్‌లో ఎంజీ మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారు..
- ●Joginapally Santhosh Kumar | వెంకటాపూర్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. 2000 వేల మొక్కలు నాటిన సంతోష్‌కుమార్

Bhagyashri Borse | రాకా మ్యూజిక్ డైరెక్టర్‌తో భాగ్యశ్రీ బోర్సే స్టెప్పులు - ఒక్క పాటకు రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?

Chamala Kirankumar Reddy | బీఆర్ఎస్ సోషల్ మీడియాకే పరిమితమైంది.. బావ, బామ్మర్దులిద్దరూ దౌర్భాగ్యులే

Gen Z | జెన్‌జీపై అంత శ్రద్ధ ఉంటే.. అమిత్ షాచేత రాజీనామా చేయించండి.. మోహన్ భగవత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్

Drumstick | దానిమ్మ కంటే మునగ కాయలే బెటర్.. ఆ మగాడి టర్నోవర్ ఏడాదికి రూ. 1.15 కోట్లు..!



