త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

WhatsApp Security | వాట్సాప్ యూజర్లకు సీఈఆర్టీ-ఇన్ హెచ్చరిక.. వెంటనే అప్‌డేట్ చేయండి..

WhatsApp Security | ఆండ్రాయిడ్, ఐఫోన్, విండోస్, మ్యాక్ కంప్యూటర్లలో వాట్సాప్ వినియోగిస్తున్న వారికి భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) హై-సివియారిటీ సెక్యూరిటీ హెచ్చరిక జారీ చేసింది. పాత వెర్షన్లలో ఉన్న భద్రతా లోపాలను ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం, పరికరాల్లోకి చొరబడడం, అనధికారికంగా డేటాను యాక్సెస్ చేసే ప్రమాదం ఉందని వెల్లడించింది. వెంటనే వాట్సాప్ తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.

S

Technology | Published On Nov 28, 2026, 11.43 am IST

WhatsApp Security | వాట్సాప్ యూజర్లకు సీఈఆర్టీ-ఇన్ హెచ్చరిక.. వెంటనే అప్‌డేట్ చేయండి..
Advertisement

WhatsApp Security | ఆండ్రాయిడ్, ఐఫోన్, విండోస్, మ్యాక్ కంప్యూటర్లలో వాట్సాప్ వినియోగిస్తున్న వారికి భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) హై-సివియారిటీ సెక్యూరిటీ హెచ్చరిక జారీ చేసింది. పాత వెర్షన్లలో ఉన్న భద్రతా లోపాలను ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం, పరికరాల్లోకి చొరబడడం, అనధికారికంగా డేటాను యాక్సెస్ చేసే ప్రమాదం ఉందని వెల్లడించింది. వెంటనే వాట్సాప్ తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.

CERT-In హెచ్చ‌రిక‌..

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే CERT-In వాట్సాప్ వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్‌టాప్ ప్లాట్‌ఫామ్‌లలోని పాత వాట్సాప్ వెర్షన్లలో తీవ్రమైన భద్రతా లోపాలు ఉన్నట్లు గుర్తించింది. ఈ లోపాలను ఆసరాగా చేసుకుని సైబర్ దాడి చేసేవారు భద్రతా పరిమితులను అధిగమించడం, అనధికారిక కోడ్‌ను అమలు చేయడం, వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయడం వంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అప్లికేషన్‌లో డేటా ఇన్‌పుట్‌ను సరిగ్గా ధ్రువీకరించకపోవడం, మెమరీ నిర్వహణలో లోపాలు, మీడియా ఫైల్స్, ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సెషన్లు, అనుసంధానిత పరికరాల లింకుల నిర్వహణలోని బలహీనతలు ఈ సమస్యలకు కారణమని తెలిపింది. ప్రత్యేకంగా రూపొందించిన హానికరమైన మీడియా ఫైల్స్ లేదా లింకులను పంపడం ద్వారా దాడి చేసేవారు యాప్‌ను క్రాష్ చేయడం, పరికరాలను తమ నియంత్రణలోకి తీసుకోవడం, ప్రైవేట్ చాట్స్‌, స్టోర్ చేసిన ఫైల్స్‌ను అనధికారికంగా యాక్సెస్ చేసే ప్రమాదం ఉందని సెక్యూరిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ప్రభావితమైన వెర్షన్ల వివరాలు..

ఆండ్రాయిడ్‌లో వాట్సాప్ 2.26.35.74, 2.26.17.4 కంటే పాత వెర్షన్లు, వాట్సాప్ బిజినెస్‌లో 2.26.23.70, 2.26.17.4 కంటే పాత వెర్షన్లు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఐఫోన్‌లో వాట్సాప్ 2.26.24.72, 2.26.15.72 కంటే పాత వెర్షన్లు, వాట్సాప్ బిజినెస్ 2.26.23.72 కంటే పాత వెర్షన్లు ఈ హెచ్చరిక పరిధిలోకి వస్తాయి. మ్యాక్ డెస్క్‌టాప్‌లో వాట్సాప్ 2.26.23.72 కంటే పాత వెర్షన్లు, విండోస్‌లో 2.3000.1032164386.258709 కంటే పాత వెర్షన్లు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలిపింది.

ఏం చేయాలి..?

వినియోగదారులు ఆటోమేటిక్ అప్‌డేట్ల కోసం వేచి చూడకుండా మెటా విడుదల చేసిన తాజా సెక్యూరిటీ ప్యాచ్‌లను వెంటనే ఇన్‌స్టాల్ చేసుకోవాలని సీఈఆర్టీ-ఇన్ సూచించింది. ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా, ఐఫోన్ వినియోగదారులు యాపిల్ యాప్ స్టోర్ ద్వారా వాట్సాప్ లేదా వాట్సాప్ బిజినెస్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. విండోస్ కంప్యూటర్లలో మైక్రోసాఫ్ట్ స్టోర్ ద్వారా, మ్యాక్ కంప్యూటర్లలో మ్యాక్ యాప్ స్టోర్ లేదా అధికారిక వాట్సాప్ వెబ్‌సైట్ ద్వారా తాజా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించింది.

Advertisement
Advertisement