త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Karthika Deepam | కేపీహెచ్‌బీ విషాదం.. కార్తీక దీపం అంటుకుని యువ‌తి మృతి

Karthika Deepam | హైద‌రాబాద్‌ కేపీహెచ్‌బీలో (KPHB) విషాదం చోటుచేసుకుంది. కార్తీక దీపం (Karthika Deepam) అంటుకుని తీవ్రంగా గాయ‌ప‌డిన‌ యువతి చికిత్స పొందుతూ మృతిచెందింది.

G

Hyderabad | Published On Nov 28, 2026, 11.31 am IST

Karthika Deepam | కేపీహెచ్‌బీ విషాదం.. కార్తీక దీపం అంటుకుని యువ‌తి మృతి
Advertisement

Karthika Deepam | త్రినేత్ర న్యూస్‌: హైద‌రాబాద్‌ కేపీహెచ్‌బీలో (KPHB) విషాదం చోటుచేసుకుంది. కార్తీక దీపం (Karthika Deepam) అంటుకుని తీవ్రంగా గాయ‌ప‌డిన‌ యువతి చికిత్స పొందుతూ మృతిచెందింది. అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్‌లో నివాసముంటున్న సాయి వెంకట సింధు (18) ఎస్ఎస్ బొటీక్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న‌ది. ఈ నెల 12న రాత్రి సింధు తన షాప్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఇంటి గేటు వద్ద వెలిగించిన కార్తీక దీపం చీరకు అంటుకుంది. మంట‌లు వ్యాపించి ఆమె తీవ్రంగా గాయప‌డింది. దీంతో కుటుంబ స‌భ్యులు ఆమెను ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

మ‌రో ఘ‌ట‌న‌లో ఎస్ఆర్ న‌గ‌ర్‌లోని (SR Nagar) జ‌గ‌న్నాథ రెసిడెన్సీలో కార్తీక దీపం వెలిగిస్తుండ‌గా ఓ వృద్ధురాలు మృతిచెందారు. చాప‌ర‌ల్ల భానుమ‌తి అనే వృద్ధురాలు త‌న కుమార్తె కిన్నెర వద్ద ఉంటున్నారు. ఈ నెల 23న రెండో కార్తీక సోమవారం సందర్భంగా ఇంట్లో దీపం వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె చీరకు నిప్పంటుకుంది. దీంతో మంట‌లు ఒళ్లంతా వ్యాపించ‌డంతో తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు మంటలు ఆర్పేలోపే ఆమె శరీరం దాదాపు 50 శాతంపైగా కాలిపోయింది. వెంటనే ఆమెను దగ్గర్లోని హాస్పిట‌ల్‌కి తరలించగా.. అక్కడ రెండు రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం బుధవారం ప్రాణాలు కోల్పోయారు.

Advertisement
Advertisement