Deeksha Divas | దీక్షా దివస్ స్ఫూర్తి కొనసాగుతుంది : నాగరాజు గుర్రాల
Deeksha Divas | దీక్షా దివస్ (Deeksha Divas) స్ఫూర్తి కొనసాగుతుందని బీఆర్ఎస్ ఎన్నారై దక్షిణాఫ్రికా శాఖ నాయకుడు గుర్రాల నాగరాజు (Nagaraju Gurrala) తెలిపారు.
Deeksha Divas | త్రినేత్ర న్యూస్ : దీక్షా దివస్ (Deeksha Divas) స్ఫూర్తి కొనసాగుతుందని బీఆర్ఎస్ ఎన్నారై దక్షిణాఫ్రికా శాఖ నాయకుడు గుర్రాల నాగరాజు (Nagaraju Gurrala) తెలిపారు. నవంబర్ 29న నిర్వహించనున్న దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ ఎన్నారై (BRS NRI) దక్షిణాఫ్రికా శాఖ (BRS NRI South Africa) ఆధ్వర్యంలో కొనసాగుతున్న 14 రోజుల ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా మూడో రోజు కోర్ కమిటీ సమావేశం నాగరాజు గుర్రాల అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎన్నారై దక్షిణాఫ్రికా కోర్ కమిటీ సభ్యులందరూ పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన చారిత్రాత్మక ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా నాగరాజు గుర్రాల మాట్లాడుతూ.. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక కీలక మలుపు అని చెప్పారు. ఆ దీక్షతో తెలంగాణ ఉద్యమం మరింత బలపడి, ప్రత్యేక రాష్ట్ర సాధనకు బలమైన పునాది వేసిందన్నారు. కేసీఆర్ పట్టుదల, నాయకత్వం, తెలంగాణ ప్రజల ఐక్య పోరాటం, అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందని గుర్తు చేశారు. నాడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి కొత్త ఊపిరి పోసిందని తెలిపారు. ఆ దీక్షా ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందనే చారిత్రక సత్యాన్ని భావితరాలకు తెలియజేయడం అందరి బాధ్యత అని చెప్పారు. ఈ 14 రోజుల కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర, దీక్షా దివస్ ప్రాముఖ్యత, కేసీఆర్ గారి పోరాటం, అమరవీరుల త్యాగాల గురించి సోషల్ మీడియా పోస్టులు, వీడియోలు, ఇతర ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మహేష్ బిగాల వర్చువల్‌గా పాల్గొని కోర్ కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. దీక్షా దివస్ చారిత్రక ప్రాధాన్యతను వివరించారు. 14 రోజుల కార్యక్రమాల లక్ష్యాలు, నిర్వహణ, తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలకు చేరవేయడంపై విలువైన సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి మేడసాని, హరీశ్ రంగ, అరవింద్ చీకోటి, కిరణ్ కుమార్ బెల్లి, సాయి కిరణ్ నల్ల, సౌజన్ రావు, రాంబాబు, వురే వంశీ, వెంకట్ రావు తల్లపల్లి, నవదీప్ రెడ్డి, రంజిత్, బాలు, విజయ్ జుంజూర్, సుమన్ పోరండ్ల, రవీందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి తదితర కోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలు, యువత, తెలంగాణ అభిమానులు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములై దీక్షా దివస్ స్ఫూర్తిని తమలో నింపుకోవాలని, భావితరాలకు అందించాలని బీఆర్ఎస్ ఎన్నారై దక్షిణాఫ్రికా శాఖ పిలుపునిచ్చింది. దీక్షా దివస్ స్ఫూర్తి నిరంతరం కొనసాగుతుందని.. తెలంగాణ ఉద్యమ చరిత్రను, కేసీఆర్ పోరాట పటిమను భావితరాలకు చేరవేస్తూ 14 రోజుల కార్యక్రమాలను మరింత ఉత్సాహంతో కొనసాగిస్తామని పేర్కొంది.
Also Read..
యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. ఇప్పట్లో లేనట్లే..?
దుల్కర్ సల్మాన్ హీరో - నాని ప్రొడ్యూసర్ - కొత్త కాంబో ఫిక్స్
పెట్టుబడిదారులపై పెరుగుతున్న అమ్మకాల ఒత్తిడి.. మిశ్రమ ధోరణిలో స్టాక్ మార్కెట్లు..
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
- ●Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్
- ●IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
- ●MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
- ●Elderly couple death | వృద్ధాప్య సమస్యలతో భర్త మృతి.. తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య కన్నుమూత
- ●Indus Water | సింధూ జలాల ఒప్పందంపై మా వైఖరి స్పష్టంగా ఉంది : భారత్

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్

Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్

IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ

MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు






