Harish Rao | డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కు పూర్తి స్థాయి అధికారిని నియమించాలి.. హరీశ్ రావు డిమాండ్
Harish Rao | తెలంగాణలో వైద్య విధాన పరిషత్‌ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (Directorate of Secondary Health)గా మార్చినప్పటికీ పూర్తి స్థాయి అధికారిని నియమించకపోవడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.
- 184 ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి గాల్లో దీపంగా మారింది
- ప్రభుత్వం కమిటీ వేసి సర్వీసు నిబంధనలు, మార్గదర్శకాలు వెంటనే రూపొందించాలి
- మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు డిమాండ్
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో వైద్య విధాన పరిషత్‌ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (Directorate of Secondary Health)గా మార్చినప్పటికీ పూర్తి స్థాయి అధికారిని నియమించకపోవడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మెరుగుపడటానికి తక్షణమే పూర్తి స్థాయి డైరెక్టర్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ వైద్య విద్య ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ ఇవాళ హరీశ్‌రావును కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు అవసరమైన గైనకాలజీ, ఆర్థోపెడిక్, యూరాలజీ, పీడియాట్రిక్ తదితర ప్రత్యేక వైద్య సేవలను అందించే తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) పరిస్థితి కమిషనర్ లేక గాల్లో దీపంలా మారడం శోచనీయమన్నారు. గత రెండు నెలలుగా పూర్తిస్థాయి అధికారి లేకపోవడంతో టీవీవీపీ పరిధిలోని ఎంసీహెచ్, జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీ మొత్తంగా 184 ఆసుపత్రుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆసుపత్రుల పనితీరు, ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, వైద్యుల హాజరు, ల్యాబ్ పరీక్షలు, మందుల లభ్యత తదితర అంశాలను పర్యవేక్షించే ఉన్నతాధికారి లేకుండా పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఒకవైపు వైద్యులు, వైద్య సిబ్బంది సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు పడుతుండగా.. మరోవైపు ప్రజలు సరైన వైద్య సేవలు అందక అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారన్నారు. వైద్య సిబ్బంది వేతనాలు, సర్వీస్ సమస్యలు సహా ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో TVVPని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మార్చి ప్రభుత్వంలో విలీనం చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.
దాదాపు మూడేళ్లు గడుస్తున్నా.. సర్వీసు నిబంధనలు రూపొందించక పోవడం, లక్ష్యం కార్యరూపం దాల్చకపోవడం దురదృష్టకరమన్నారు. దీంతో వైద్యులు, వైద్య సిబ్బంది తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై ఉద్యోగులు ప్రభుత్వానికి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా లాభం లేకుండా పోయిందని మండిపడ్డారు. రోడ్లెక్కి నిరసనలు తెలియచేస్తున్నా పట్టించుకోకపోవడం దుర్మార్గం అంటూ రేవంత్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వైద్యులు, వైద్య సిబ్బంది సమస్యలతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్యాన్ని వీడాలని స్పష్టం చేశారు. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కు సంబంధించి వెంటనే కమిటీ వేసి సర్వీస్ నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించాలని, తక్షణమే పూర్తిస్థాయి అధికారిని నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు అవసరమైన గైనకాలజీ, ఆర్థోపెడిక్, యూరాలజీ, పీడియాట్రిక్ తదితర ప్రత్యేక వైద్య సేవలను అందించే తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) పరిస్థితి కమిషనర్ లేక గాలిలో దీపంలా మారడం శోచనీయం.
గత రెండు నెలలుగా పూర్తిస్థాయి అధికారి లేకపోవడంతో TVVP… pic.twitter.com/P4Tf8gSXrj
— Harish Rao Thanneeru (@BRSHarish) August 4, 2026
Also Read..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అభిప్రాయ సేకరణ చేపట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్
విమాన ప్రయాణీకుల భద్రతకు ఏం చర్యలు తీసుకుంటున్నారు..? కేంద్రాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎంపీ
పెట్టుబడిదారులకు అలర్ట్.. బంగారం కొనేందుకు సరైన సమయమా..?
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Nayanthara | తన సినిమాతో తానే పోటీ - రెండు రోజుల గ్యాప్‌లో నయనతార రెండు సినిమాలు రిలీజ్
- ●MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు
- ●GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్
- ●MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- ●DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?
- ●స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!

Nayanthara | తన సినిమాతో తానే పోటీ - రెండు రోజుల గ్యాప్‌లో నయనతార రెండు సినిమాలు రిలీజ్

MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు

GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్

MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్



