త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Upcoming IPOs | వచ్చే వారం 5 ఐపీఓలు.. డిసెంబర్ 1 నుంచి సందడి..

Upcoming IPOs | వచ్చే వారం ప్రైమరీ మార్కెట్‌లో ఐదు కంపెనీలు ఐపీఓలకు సిద్ధమయ్యాయి. డిసెంబర్ 1 నుంచి 3వ తేదీ మధ్య మాతంగి రబ్బర్, ఏజే ప్యాకేజింగ్, స్వరా బేబీ ప్రొడక్ట్స్, మోనోమార్క్ ఇంజినీరింగ్, విశ్వాస్ రిఫాయిల్స్ అండ్ కన్స్యూమర్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను ప్రారంభించనున్నాయి. మరోవైపు ఇప్పటికే ప్రారంభమైన ఫుడ్ లింక్ ఎఫ్ అండ్ బీ హోల్డింగ్స్, ఎయిర్‌ప్రో టెక్నాలజీ ఐపీఓలు వచ్చే వారం ముగియనున్నాయి.

S

Business | Published On Nov 28, 2026, 12.30 pm IST

Upcoming IPOs | వచ్చే వారం 5 ఐపీఓలు.. డిసెంబర్ 1 నుంచి సందడి..
Advertisement

Upcoming IPOs | వచ్చే వారం ప్రైమరీ మార్కెట్‌లో ఐదు కంపెనీలు ఐపీఓలకు సిద్ధమయ్యాయి. డిసెంబర్ 1 నుంచి 3వ తేదీ మధ్య మాతంగి రబ్బర్, ఏజే ప్యాకేజింగ్, స్వరా బేబీ ప్రొడక్ట్స్, మోనోమార్క్ ఇంజినీరింగ్, విశ్వాస్ రిఫాయిల్స్ అండ్ కన్స్యూమర్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను ప్రారంభించనున్నాయి. మరోవైపు ఇప్పటికే ప్రారంభమైన ఫుడ్ లింక్ ఎఫ్ అండ్ బీ హోల్డింగ్స్, ఎయిర్‌ప్రో టెక్నాలజీ ఐపీఓలు వచ్చే వారం ముగియనున్నాయి.

ఏయే ఐపీఓలు వ‌స్తున్నాయి..?

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి వచ్చే వారం ఐపీఓల సందడి నెలకొననుంది. డిసెంబర్ 1న మాతంగి రబ్బర్ రూ.125.16 కోట్ల ఐపీఓను ప్రారంభించనుంది. ఒక్కో షేరుకు ధరల శ్రేణిని రూ.163 నుంచి రూ.172గా నిర్ణయించింది. ఇందులో రూ.99.10 కోట్ల విలువైన కొత్త షేర్ల జారీతోపాటు రూ.26.06 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ ఉంది. డిసెంబర్ 3 వరకు సబ్‌స్క్రిప్షన్‌కు అవకాశం ఉండగా, డిసెంబర్ 8న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్టింగ్ కానుంది. అదే రోజు ఏజే ప్యాకేజింగ్ రూ.54 కోట్ల ఎస్ఎంఈ ఐపీఓను ప్రారంభించనుంది. ఒక్కో షేరు ధరను రూ.175 నుంచి రూ.180గా నిర్ణయించింది. ఈ ఐపీఓ కూడా డిసెంబర్ 3న ముగియనుండగా, డిసెంబర్ 8న ఎన్ఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది.

డిసెంబర్ 2న స్వరా బేబీ ప్రొడక్ట్స్ రూ.799.88 కోట్ల ఐపీఓను ప్రారంభించనుంది. ఐదు కొత్త ఐపీఓల్లో ఇదే అతిపెద్దది. ఒక్కో షేరు ధరల శ్రేణి రూ.105 నుంచి రూ.111గా నిర్ణయించారు. ఇందులో రూ.499.88 కోట్ల కొత్త షేర్ల జారీ, రూ.300 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ ఉన్నాయి. డిసెంబర్ 4 వరకు బిడ్డింగ్ కొనసాగనుండగా, డిసెంబర్ 9న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్టింగ్ కానుంది.

మోనోమార్క్ ఇంజినీరింగ్ ఐపీఓ..

ఇక మోనోమార్క్ ఇంజినీరింగ్ కూడా డిసెంబర్ 2న రూ.175.50 కోట్ల ఐపీఓను ప్రారంభించనుంది. సివిల్ కన్‌స్ట్రక్షన్ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ ఒక్కో షేరు ధరను రూ.60 నుంచి రూ.65గా నిర్ణయించింది. ఈ ఐపీఓను పూర్తిగా కొత్త షేర్ల జారీ ద్వారా చేపడుతున్నారు. డిసెంబర్ 4న ముగియనున్న ఈ ఇష్యూ డిసెంబర్ 9న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది. ఐదు కంపెనీల్లో చివరిగా విశ్వాస్ రిఫాయిల్స్ అండ్ కన్స్యూమర్ డిసెంబర్ 3న రూ.25.78 కోట్ల ఐపీఓను ప్రారంభించనుంది. ఎడిబుల్ ఆయిల్ రంగంలో ఉన్న ఈ కంపెనీ ఒక్కో షేరు ధరను రూ.85 నుంచి రూ.90గా నిర్ణయించింది. డిసెంబర్ 7 వరకు సబ్‌స్క్రిప్షన్ కొనసాగనుండగా, డిసెంబర్ 10న బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై లిస్టింగ్ కానుంది. ఈ ఐపీఓను కూడా పూర్తిగా కొత్త షేర్ల జారీతోనే చేపడుతున్నారు.

ఇప్ప‌టికే ప్రారంభ‌మైన ఐపీఓలు ఇవే..

మరోవైపు ఇప్పటికే ప్రారంభమైన ఫుడ్ లింక్ ఎఫ్ అండ్ బీ హోల్డింగ్స్ రూ.360.76 కోట్ల ఐపీఓ నవంబర్ 30న ముగియనుంది. రెస్టారెంట్ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ ఒక్కో షేరు ధరను రూ.181 నుంచి రూ.191గా నిర్ణయించింది. ఇందులో రూ.192 కోట్ల కొత్త షేర్ల జారీ, రూ.168.76 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ ఉన్నాయి. నవంబర్ 27 మధ్యాహ్నం 3.34 గంటల నాటికి ఈ ఐపీఓ 1.06 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. డిసెంబర్ 3న లిస్టింగ్ కానుంది. ఎయిర్‌ప్రో టెక్నాలజీ రూ.35.64 కోట్ల ఎస్ఎంఈ ఐపీఓ డిసెంబర్ 1న ముగియనుంది. ఒక్కో షేరు ధరను రూ.99గా నిర్ణయించారు. ఇందులో రూ.27.13 కోట్ల కొత్త షేర్ల జారీ, రూ.6.73 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ ఉన్నాయి. నవంబర్ 27 నాటికి ఈ ఐపీఓ 0.55 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. డిసెంబర్ 4న ఎన్ఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై లిస్టింగ్ కానుంది.

ఈ ఐపీఓల గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) వివరాల ప్రకారం మాతంగి రబ్బర్‌కు రూ.31, ఏజే ప్యాకేజింగ్‌కు రూ.24, స్వరా బేబీ ప్రొడక్ట్స్‌కు రూ.7, మోనోమార్క్ ఇంజినీరింగ్‌కు రూ.20, విశ్వాస్ రిఫాయిల్స్‌కు జీరోగా నమోదయ్యాయి. ఫుడ్‌లింక్‌కు రూ.4, ఎయిర్‌ప్రో టెక్నాలజీకి రూ.3 జీఎంపీ ఉంది. ఇవి నవంబర్ 27 నాటి వివరాలు మాత్రమే. జీఎంపీ అనధికారిక మార్కెట్ అంచనా మాత్రమేనని, లిస్టింగ్ ధరకు హామీ కాదని గమనించాలి.

Advertisement
Advertisement