Supriya Sule | మోదీ కేబినెట్‌లోకి సుప్రియా సూలే..? డీలిమిటేషన్ మద్దతు ప్రతిఫలంగా ఎన్సీపీకి కీలక పదవులు..!
Supriya Sule | కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) నిర్ణయించింది. ఇందుకు ప్రతిఫలంగా కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవులను ఆశిస్తున్నట్లు సమాచారం. ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule)కి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Supriya Sule | త్రినేత్ర న్యూస్ : నవంబర్ 30న ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ఢిల్లీ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏడు నెలల క్రితం అంటే ఏప్రిల్‌లో లోక్‌సభలో వీగిపోయిన నియోజకవర్గాల పునర్విభజన (Delimitation), మహిళా రిజర్వేషన్ బిల్లులను తిరిగి ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఎన్డీయే (NDA) కూటమికి మద్దతు భారీగా పెరుగుతోంది. ప్రతిపక్ష ఇండీ కూటమిలోని ఎన్సీపీ (Sharad Pawar) కూడా ఈ బిల్లులకు మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
త్వరలో కేంద్ర కేబినెట్‌లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ సారి కేబినెట్‌లోకి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule)కి కేంద్ర కేబినెట్ బెర్తు ఖరారైనట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఈ అంశంపై కేంద్రంతో శరద్ పవార్ వర్గం చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. బిల్లుకు మద్దతు ప్రతిఫలంగా కేంద్రంతోపాటూ మహారాష్ట్ర ప్రభుత్వంలోనూ కీలక పదవులు ఎన్సీపీ ఆశిస్తున్నట్లు సమాచారం. రెండు మంత్రి పదవులు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.
పార్లమెంట్‌లో బిల్లుకు అధికారికంగా మద్దతు ప్రకటించే ముందే అధికార పంపిణీ ఫార్ములా ఖరారు కావాలని పవార్ పార్టీలోని ఒక వర్గం భావిస్తున్నట్లు ఒక సీనియర్ నేత తెలిపారు. మరోవైపు, అనారోగ్యంతో బాధపడుతున్న శరద్ పవార్ ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి ఫోన్ చేసి తన పార్టీ పరిస్థితులను వివరించినట్లు సమాచారం. ఎన్సీపీ(ఎస్పీ)లో మరో చీలిక రాకుండా నివారించాలంటే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడం తప్పనిసరి అని ఆయన మిత్రపక్షాలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
Also Read..
వాట్సాప్ యూజర్లకు సీఈఆర్టీ-ఇన్ హెచ్చరిక.. వెంటనే అప్‌డేట్ చేయండి..
తాజావార్తలు
- ●Affair Suspicion | మరొకరితో సంబంధం.. అనుమానంతో ప్రియురాలి దారుణ హత్య
- ●WhatsApp Security | వాట్సాప్ యూజర్లకు సీఈఆర్టీ-ఇన్ హెచ్చరిక.. వెంటనే అప్‌డేట్ చేయండి..
- ●Karthika Deepam | కేపీహెచ్‌బీ విషాదం.. కార్తీక దీపం అంటుకుని యువతి మృతి
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో జోరు.. వారాంతంలో ర్యాలీ..
- ●X | ఎక్స్‌లో కొత్త ఫీచర్.. 18 నెలల ముందే పోస్టుల షెడ్యూలింగ్..
- ●Telangana | పారిశ్రామికాభివృద్ధికి సరికొత్త ఎజెండా.. ఇండస్ట్రియల్ పాలసీ 2.0

Affair Suspicion | మరొకరితో సంబంధం.. అనుమానంతో ప్రియురాలి దారుణ హత్య

WhatsApp Security | వాట్సాప్ యూజర్లకు సీఈఆర్టీ-ఇన్ హెచ్చరిక.. వెంటనే అప్‌డేట్ చేయండి..

Karthika Deepam | కేపీహెచ్‌బీ విషాదం.. కార్తీక దీపం అంటుకుని యువతి మృతి

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో జోరు.. వారాంతంలో ర్యాలీ..






