MBBS | ఐదు విడతల నీట్ కౌన్సెలింగ్ తర్వాత కూడా 411 మెడికల్ సీట్లు ఖాళీగానే.. అధిక ఫీజుల భారమే కారణమా..?
MBBS | ఐదు విడతల నీట్ కౌన్సెలింగ్ (NEET counselling) పూర్తయినా ఇంకా దేశవ్యాప్తంగా 400కి పైగా ఎంబీబీఎస్ (MBBS) సీట్లు (medical seats) ఖాళీగానే ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఖాళీ సీట్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. కొన్ని ప్రైవేట్, డీమ్డ్ మెడికల్ కాలేజీల్లో వార్షిక ఫీజులు గతంలో సుమారు రూ.15 లక్షలుగా ఉండగా.. ఇప్పుడు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెరిగాయి. అధిక ఫీజులే ఈ పరిస్థితి కారణమని నిపుణులు భావిస్తున్నారు.
MBBS | త్రినేత్ర న్యూస్ : మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) నిర్వహించిన ప్రత్యేక స్ట్రే వేకెన్సీ (Special Stray Vacancy Round) రౌండ్ సహా మొత్తం ఐదు విడతల నీట్ కౌన్సెలింగ్ (NEET counselling) పూర్తయినా ఇంకా దేశవ్యాప్తంగా 400కి పైగా ఎంబీబీఎస్ సీట్లు (medical seats) ఖాళీగానే ఉన్నాయి. ప్రత్యేక ఖాళీల రౌండ్ కోసం విడుదల చేసిన సీట్ మ్యాట్రిక్స్‌లో మొదట 946 సీట్లు ఉండగా, అదనంగా మరో 2 సీట్లను కలపడంతో మొత్తం ఖాళీల సంఖ్య 948కి చేరింది. వీటిలో 537 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మిగిలిన 411 సీట్లు ఖాళీగానే మిగిలిపోయాయి (411 medical seats remain unallotted).
గతేడాదితో పోలిస్తే ఈసారి ఖాళీ సీట్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. గతేడాది (2025) కౌన్సెలింగ్ తర్వాత కేవలం 60 నుండి 70 సీట్లు మాత్రమే ఖాళీగా మిగిలాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ఏడాది నాలుగు రౌండ్లు పూర్తి చేసిన తర్వాత MCC అదనంగా ఈ ఐదో రౌండ్‌ను నిర్వహించినప్పటికీ 400కు పైగా సీట్లు మిగిలిపోవడం గమనార్హం.
ప్రైవేట్ కాలేజీల ఫీజుల భారంపై ఆందోళనలు
ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ప్రకారం.. చాలా మందికి వైద్య విద్యను అభ్యసించాలన్న కల ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల (MBBS fees) భారం ఆందోళనకరంగా మారింది. కొన్ని ప్రైవేట్, డీమ్డ్ మెడికల్ కాలేజీల్లో వార్షిక ఫీజులు గతంలో సుమారు రూ.15 లక్షలుగా ఉండగా.. ఇప్పుడు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెరిగాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీ, కొన్ని ప్రముఖ ప్రైవేట్ సంస్థల్లోని సీట్లు పూర్తిగా భర్తీ అవుతుండగా, కొన్ని నిర్దిష్ట ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోనే ఖాళీలు ఎక్కువగా ఉంటున్నాయి.
మిగిలిపోయిన సీట్లన్నీ ప్రధానంగా అధిక ఫీజులు ఉన్న ప్రైవేట్, డీమ్డ్ విశ్వవిద్యాలయాలకు చెందినవేనని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. అధిక ఫీజుల భారాన్ని భరించలేకే చాలా మంది విద్యార్థులు సీట్లు ఖాళీ ఉన్నా చేరడం లేదని ఆందోళన వ్యక్తం చేశాయి. ఫీజులు ఎక్కువగా ఉంటే సీట్ల సంఖ్యను పెంచడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని సదరు వర్గాలు పేర్కొన్నాయి.
విదేశీ వైద్య విద్యార్థులకు నిరాశ..
మరోవైపు విదేశీ వైద్య విద్యార్థులకు నిరాశ ఎదురైంది. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకుని భారత్‌లో ప్రాక్టీస్ చేయడానికి తప్పనిసరి అయిన ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (FMGE) ఫలితాల్లో దాదాపు ఐదుగురిలో నలుగురు విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ప్రకటించిన ఎఫ్‌ఎంజీఈ (FMGE) అక్టోబర్ 2026 ఫలితాలలో 22.87 శాతం మంది అభ్యర్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.
మొత్తం 42,113 మంది దరఖాస్తు చేసుకోగా, 40,923 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 9,354 మంది మాత్రమే అర్హత సాధించారు. మిగతా 31,539 మంది పాస్ కాలేదు. మరో 30 మంది అభ్యర్థుల ఫలితాలను నిలిపివేశారు. స్కోర్ జాబితా పరిశీలనలో 14,613 మంది విద్యార్థులు 300 మార్కులకు గాను 125 నుంచి 149 మధ్య మార్కులు సాధించినప్పటికీ, అర్హత సాధించడానికి అవసరమైన 150 మార్కులను అందుకోలేకపోయారు. వీరిలో 5,365 మంది 140 నుంచి 149 మధ్య మార్కులు సాధించి అర్హతను కోల్పోయారు.
Also Read..
కేదార్‌నాథ్ ఆలయ తలుపులు మూసివేత.. ఉఖీమఠ్‌కు బయల్దేరిన ఉత్సవ పల్లకి
సిద్ధూ జొన్నలగడ్డకు జోడీగా నయన్ సారిక.. సుకుమార్ బ్యానర్‌లో కొత్త ప్రేమకథ!
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Airtel Broadband | బ్రాడ్‌బ్యాండ్‌లో ఎయిర్టెల్ జోరు.. వేగం, నాణ్యతలో జియోపై భారీ ఆధిక్యం..
- ●Professor Tejasri Complaint | రాజేంద్రనగర్ పీఎస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత: వీసీపై ఫిర్యాదు చేసిన మహిళా ప్రొఫెసర్‌కు పోలీసుల వేధింపులు
- ●Priya Bhavani Shankar | ప్రియ భవానీ శంకర్ జీవితంలో కొత్త అధ్యాయం.. ప్రియుడు రాజ్వెల్తో ఏడడుగులు వేసిన ఇరుముడి భామ!
- ●PepsiCo Layoffs | వేయి ఉద్యోగాలకు పెప్సికో కోత.. కారణాలివే..
- ●Siddhu Jonnalagadda | సిద్ధూ జొన్నలగడ్డకు జోడీగా నయన్ సారిక.. సుకుమార్ బ్యానర్‌లో కొత్త ప్రేమకథ!
- ●CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి బర్త్‌డే ఫ్లెక్సీ దగ్ధం.. రగిలిన వర్గ విభేదాలు

Airtel Broadband | బ్రాడ్‌బ్యాండ్‌లో ఎయిర్టెల్ జోరు.. వేగం, నాణ్యతలో జియోపై భారీ ఆధిక్యం..

Professor Tejasri Complaint | రాజేంద్రనగర్ పీఎస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత: వీసీపై ఫిర్యాదు చేసిన మహిళా ప్రొఫెసర్‌కు పోలీసుల వేధింపులు

Priya Bhavani Shankar | ప్రియ భవానీ శంకర్ జీవితంలో కొత్త అధ్యాయం.. ప్రియుడు రాజ్వెల్తో ఏడడుగులు వేసిన ఇరుముడి భామ!

PepsiCo Layoffs | వేయి ఉద్యోగాలకు పెప్సికో కోత.. కారణాలివే..






