Faridabad Teacher | 30 సెకన్లలో 34 కత్తిపోట్లు.. స్కూల్ టీచర్‌పై వ్యక్తి పైశాచిక దాడి
Faridabad Teacher | హర్యానా (Haryana)లోని ఫరీదాబాద్‌లో (Faridabad) దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రైవేట్ పాఠశాల టీచర్‌ని ఓ వ్యక్తి అతికిరాతకంగా హత్య చేశాడు. 30 సెకన్లలో 34 సార్లు కత్తితో పొడిచి పైశాచిక ఆనందం పొందాడు. ఈ ఘటన పాఠశాల ఆవరణలో చోటు చేసుకోవడం గమనార్హం.
Faridabad Teacher | త్రినేత్ర.న్యూస్ : హర్యానా (Haryana)లోని ఫరీదాబాద్‌లో (Faridabad) దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రైవేట్ పాఠశాల టీచర్‌ను ఓ వ్యక్తి అతికిరాతకంగా హత్య చేశాడు. కేవలం 30 సెకన్లలోనే 34 సార్లు కత్తితో పొడిచి (Teacher Stabbed 34 Times In 30 Seconds) పైశాచిక ఆనందం పొందాడు. ఈ ఘటన పాఠశాల ఆవరణలోనే చోటు చేసుకోవడం గమనార్హం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫరీదాబాద్‌లోని సిక్రోనా గ్రామంలో (Sikrona village) ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో సంధ్య (29) అనే మహిళ టీచర్‌గా పని చేస్తోంది. ఆమెకు రెండేళ్ల క్రితం అమిత్ (21) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి అతడు సంధ్య వెంట పడుతూ వేధించడం మొదలు పెట్టాడు. విసిగిపోయిన సదరు టీచర్ అమిత్‌పై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. దీంతో అప్పట్లో అతను బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పాడు. ఈ ఘటనతో ఆవేశానికి గురైన అమిత్.. సంధ్యపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు.
నిన్న ఉదయం ముఖానికి మాస్క్‌తో సంధ్య పనిచేసే పాఠశాల వద్దకు వెళ్లాడు. గేటు ద్వారా లోపలికి వచ్చి సంధ్యను పిలవాలని రిసెప్షనిస్ట్‌కు చెప్పాడు. ఆమె వచ్చే వరకూ లాబీలో వెయిట్ చేశాడు. సంధ్య రాగానే గేటు బయటకు రావాలంటూ ఆమెకు సైగ చేశాడు. సంధ్య బయటకు రాగానే క్షణం కూడా ఆగకుండా ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ముఖం, మెడ, ఛాతీపై కేవలం 30 సెకన్లలోనే 34 సార్లు కత్తితో పొడిచాడు. మహిళ కింద పడిపోయినా ఆగకుండా ఆమెపై దాడి చేస్తూనే ఉన్నాడు.
కేకలు విని బయటకు వచ్చిన అడ్మినిస్ట్రేటర్ ఈ ఘటనకు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అమిత్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించగా నిందితుడు అతడిపై కూడా దాడికి దిగాడు. అనంతరం అక్కడి నుంచి ఉడాయించాడు. దాడి తర్వాత రక్తం మడుగుల్లో కొట్టుమిట్టాడుతున్న సంధ్యను పాఠశాల యాజమాన్యం వెంటనే అల్ ఫలాహ్ ఆసుపత్రికి (Al Falah Hospital) తరలించారు. అయితే, ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అప్పటి వరకూ ఎంతో ప్రశాంతంగా ఉన్న పాఠశాల ఆవరణ ఈ ఘటనతో భాయానక వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో నిందితుడి పైశాచికత్వం స్పష్టంగా రికార్డయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఘటన జరిగిన రెండు గంటల్లోనే నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. విచారణలో అమిత్ హత్యను అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read..
కాసుల వర్షం కురిపిస్తున్న పెన్నీ స్టాక్స్.. 6 నెలల్లో 198 శాతం లాభాలు..
డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కు పూర్తి స్థాయి అధికారిని నియమించాలి.. హరీశ్ రావు డిమాండ్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అభిప్రాయ సేకరణ చేపట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Red Fort Attack | ఢిల్లీ పేలుడు వెనుక ఆల్‌ఖైదా హస్తం.. UNSC సంచలన నివేదిక
- ●Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు
- ●Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?
- ●Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన
- ●Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్
- ●Shakeela | నటి షకీలాకు సర్జరీ - స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారి.... మెడ నరాలు దెబ్బతిని..

Red Fort Attack | ఢిల్లీ పేలుడు వెనుక ఆల్‌ఖైదా హస్తం.. UNSC సంచలన నివేదిక

Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు

Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?

Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన






